సీసీటీవీలో వెలుగుచూసిన అనుమానితుడి ఫొటో
- యూసుఫ్‌గూడలో కారు డ్రైవర్ దారుణ హత్య
- నిందితుడు ఓ ఐఏఎస్ కుమారుడిగా అనుమానం!
- ఆలస్యంగా వెలుగు చూసిన ఉదంతం
హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున ఓ కారు డ్రైవర్ హత్యకు గురయ్యాడు. యూసుఫ్ గూడలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ హత్య... ఆలస్యంగా వెలుగులోకి చూసిం ది. దీనికి పాల్పడింది ఓ ఐఏఎస్ అధికారి కుమారుడిగా అనుమానిస్తున్నారు.
వెళ్లింది ఇద్దరు.. తిరిగొచ్చింది ఒక్కరు: సూర్యాపేట సమీపంలోని దుబ్బతండాకు చెందిన కారు డ్రైవర్ భూక్యా నాగరాజు (40)... భార్య జమున, తన ఇద్దరు పిల్లలతో రహమత్‌నగర్‌లోని జవహర్ నగర్‌లో ఉంటున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నాగరాజు ఓ యువకుడితో కలసి యూసుఫ్‌గూడలోని సాయికల్యాణ్ అపార్ట్‌మెంట్ పైకి వెళ్లాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో నాగరాజుతో వెళ్లిన వ్యక్తి మాత్రమే కిందకు దిగి వెళ్లిపో యాడు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అదే వ్యక్తి సదరు అపార్ట్‌మెంట్ పైకెళ్లి... ఓ మూటను కిందకు తీసుకొస్తుం డగా చప్పుడయింది. ఈ అలికిడికి అప్రమ త్తమైన అపార్ట్‌మెంట్‌లోని ఓ వృద్ధుడు... ఎవరు నువ్వు... ఇక్కడేం చేస్తున్నావంటూ ప్రశ్నించాడు. దీంతో సదరు వ్యక్తి మూట వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
మూటలో శవం...
ఆ మూట నుంచి దుర్వాసన వస్తుండటంతో వృద్ధుడు పోలీసులకు సమాచారం అందిం చాడు. పోలీసులు మూట విప్పి చూడగా ఒకరి మృతదేహం బయటపడింది. ఈ మృతదేహం జవహర్‌నగర్‌లో ఉంటున్న నాగరాజుగా నిర్ధారించుకున్నారు. శుక్రవార మే హత్యకు గురైన నాగరాజుతో టెర్రస్ పైకి వెళ్లిన వ్యక్తిని ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలో లభించిన యువకుడి చిత్రాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
కాల్ డేటా పరిశీలన...
అయితే ఈ హత్యకు పాల్పడింది ఓ ఐఏఎస్ అధికారి కుమారుడని విశ్వసనీయ సమాచారం. ఆదివారం సాయంత్రం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతని కాల్‌డేటా పరిశీలిస్తున్నారు. మృతుడి భార్య నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.