ఎస్బీఐ ఏటీఎంలో యువతిపై కాల్పులు | Unknown persons Firing At yousufguda | Sakshi
Sakshi News home page

ఎస్బీఐ ఏటీఎంలో యువతిపై కాల్పులు

Published Wed, May 20 2015 8:35 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

ఎస్బీఐ ఏటీఎంలో యువతిపై కాల్పులు - Sakshi

ఎస్బీఐ ఏటీఎంలో యువతిపై కాల్పులు

హైదరాబాద్: యూసఫ్గూడలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద బుధవారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించింది. ఏటీఎం నుంచి నగదు డ్రా చేసుకుని వెళ్తున్న యువతిపై ఆగంతకులు కాల్పులు జరిపారు. అనంతరం ఆమె నుంచి నగలు, నగదు దోచుకుని అక్కడి నుంచి పరారైయ్యారు. వెంటనే తేరుకున్న సదరు యువతి స్థానికుల సహాయంతో ఎస్ ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అందులో భాగంగా  పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఏటీఎం పరిసర ప్రాంతాల్లో సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించి...  నిందితులకు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. యువతి మధురానగర్ హాస్టల్లో  ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఈ రోజు ఉదయం 7.30 గంటలకు చోటు చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement