రన్నరప్ విజ్ఞాన్ స్కూల్ | khao khao tournment vignan school team in second place | Sakshi
Sakshi News home page

రన్నరప్ విజ్ఞాన్ స్కూల్

Published Mon, Oct 28 2013 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

khao khao tournment vignan school team in second place

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సీబీఎస్‌ఈ క్లస్టర్ ఖోఖో టోర్నమెంట్‌లో బాలుర టీమ్ విభాగంలో విజ్ఞాన్ స్కూల్ (నిజాంపేట్) జట్టుకు రెండో స్థానం దక్కింది. నిజాంపేట్‌లో విజ్ఞాన్ స్కూల్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో చివరి రోజు ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో నిజాంపేట్ విజ్ఞాన్ జట్టు 8-13తో కర్ణాటకకు చెందిన మారుతి విద్యాకేంద్ర జట్టు చేతిలో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచింది. కల్పతరు సెంట్రల్ స్కూల్ (కర్ణాటక) జట్టుకు మూడో స్థానం లభించింది.
 
  అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో విజ్ఞాన్ స్కూల్ 9-2తో కర్ణాటకకు చెందిన ఎంకిట్స్ స్కూల్‌పై, మారుతి విద్యాకేంద్ర 3-2తో కల్పతరు సెంట్రల్ స్కూల్‌పై నెగ్గాయి. బాలికల విభాగం ఫైనల్లో బీడీఎల్ డీఏవీ జట్టు 7-5తో మారుతి విద్యా కేంద్ర జట్టుపై విజయం సాధించింది. నిజాంపేట్ విజ్ఞాన్ స్కూల్ జట్టు మూడో స్థానం పొందింది. ఈ పోటీల ముగింపు వేడుకలకు యూజీసీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ జి.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement