Vignan school
-
రన్నరప్ విజ్ఞాన్ స్కూల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సీబీఎస్ఈ క్లస్టర్ ఖోఖో టోర్నమెంట్లో బాలుర టీమ్ విభాగంలో విజ్ఞాన్ స్కూల్ (నిజాంపేట్) జట్టుకు రెండో స్థానం దక్కింది. నిజాంపేట్‌లో విజ్ఞాన్ స్కూల్లో జరుగుతున్న ఈ పోటీల్లో చివరి రోజు ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో నిజాంపేట్ విజ్ఞాన్ జట్టు 8-13తో కర్ణాటకకు చెందిన మారుతి విద్యాకేంద్ర జట్టు చేతిలో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచింది. కల్పతరు సెంట్రల్ స్కూల్ (కర్ణాటక) జట్టుకు మూడో స్థానం లభించింది. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో విజ్ఞాన్ స్కూల్ 9-2తో కర్ణాటకకు చెందిన ఎంకిట్స్ స్కూల్‌పై, మారుతి విద్యాకేంద్ర 3-2తో కల్పతరు సెంట్రల్ స్కూల్‌పై నెగ్గాయి. బాలికల విభాగం ఫైనల్లో బీడీఎల్ డీఏవీ జట్టు 7-5తో మారుతి విద్యా కేంద్ర జట్టుపై విజయం సాధించింది. నిజాంపేట్ విజ్ఞాన్ స్కూల్ జట్టు మూడో స్థానం పొందింది. ఈ పోటీల ముగింపు వేడుకలకు యూజీసీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ జి.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
సెమీ ఫైనల్లో విజ్ఞాన్ స్కూల్
నిజాంపేట, న్యూస్‌లైన్: సీబీఎస్ఈ క్లస్టర్-7 ఖోఖో టోర్నమెంట్లో విజ్ఞాన్ స్కూల్ సెమీఫైనల్‌కు చేరుకుంది. శనివారం బాలుర విభాగంలో జరిగిన ఈ పోటీల్లో మహర్షి విద్యామందిర్, బి.డి.ఎల్, డి.ఎ.వి, కర్ణాటకకు చెందిన శ్రీవిద్యానికేతన్ ఎంకేఈటీఎస్, కల్పతరు సెంట్రల్ పబ్లిక్ స్కూల్, డి.ఎ.వి. కూకట్పల్లి, భారతీయ విద్యాభవన్ బీహెచ్ఈఎల్, గుంటూరుకు చెందిన భాష్యం బ్లూమ్, మారుతీ విద్యాకేంద్రం పాఠశాలలు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఆదివారం జరిగే ముగింపు ఉత్సవానికి యు.జి.సి జాయింట్ సెక్రటరీ డాక్టర్ జి.శ్రీనివాస్ పాల్గొననున్నారు.