KHao khao tournment
-
యూసుఫ్‌గూడ జీహెచ్‌ఎస్‌కు టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఎం. కాశీనాథ్ గౌడ్ స్మారక ఖోఖో టోర్నమెంట్లో జూనియర్ విభాగం టైటిల్‌ను యూసుఫ్‌గూడ గవర్నమెంట్ హైస్కూల్(జీహెచ్ఎస్) జట్టు కైవసం చేసుకుంది. బడీ చౌడీలోని హెల్త్ లీగ్ క్లబ్లో ఆదివారం జరిగిన ఫైనల్లో యూసుఫ్‌గూడ జీహెచ్ఎస్ జట్టు 10-5 స్కోరుతో మనోరంజిత మెమోరియల్ హైస్కూల్ జట్టుపై విజయం సాధించింది. సెమీఫైనల్లో యూసుఫ్‌గూడ జీహెచ్ఎస్ జట్టు 7-0తో కేవీ హైస్కూల్ (గోల్కొండ) జట్టుపై, మనోరంజిత మెమోరియల్ హైస్కూల్ హెల్త్ లీగ్ క్లబ్ జట్టుపై గెలిచాయి. హెల్త్ లీగ్ క్లబ్ జట్లు ముందంజ సీనియర్ పురుషుల విభాగంలో తొలి రౌండ్లో హెల్త్ లీగ్ క్లబ్ (ఎ)(బి) జట్లు విజయాలను సాధించాయి. హెల్త్ లీగ్ క్లబ్ (ఎ) జట్టు 8-2తో కేవీ హైస్కూల్ (సీఆర్పీఎఫ్-బార్కాస్) జట్టుపై గెలిచింది. రెండో మ్యాచ్‌లో హెల్త్ లీగ్ క్లబ్ (బి) 7-4తో శ్రీహనుమాన్ వ్యాయామ శాల(హెచ్‌వీఎస్) (ఎ) జట్టుపై గెలిచింది. కేవీ హైస్కూల్ (గోల్కొండ) 2-1తో నయాబజార్పై, హైదరాబాద్ జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ క్లబ్ జట్టు 9-4తో యూసుఫ్‌గూడ జీహెచ్ఎస్ జట్టుపై నెగ్గాయి. అంతకు ముందు ఈ పోటీలను ప్రముఖ వ్యాపార వేత్త ప్రీత్‌పాల్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ నరేందర్ గౌడ్, ఓయూ ప్రొఫెసర్ బి.సునీల్ కుమార్, రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ధన్‌కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
రన్నరప్‌గా రంగారెడ్డి జిల్లా
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా సీనియర్ ఖోఖో టోర్నమెంట్లో రంగారెడ్డి జిల్లా పురుషుల, మహిళల జట్లు సత్తా చాటాయి. కరీంనగర్ జిల్లా మంథనిలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల విభాగం ఫైనల్లో రంగారెడ్డి జిల్లా 10-6 స్కోరుతో కరీంనగర్ జట్టు చేతిలో ఓడిపోయి రెండో స్థానం దక్కించుకుంది. రంగారెడ్డి జిల్లా జట్టులో అంకిత్, రంజిత్ కుమార్, ప్రవీణ్ చక్కటి ప్రతిభ కనబర్చారు. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో రంగారెడ్డి జట్టు 10-9తో ఆదిలాబాద్ జట్టుపై గెలిచింది. మహిళల విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి జిల్లా జట్టు 5-4తో నిజామాబాద్ జట్టుపై గెలిచి మూడో స్థానం పొందింది. రంగారెడ్డి జిల్లాలో లక్ష్మీ, రేణుక రాణించారు. అలాగే ఈ టోర్నీలో పురుషుల విభాగంలో బెస్ట్ రన్నర్‌గా అంకిత్ ఎంపికవగా, అత్యుత్తమ క్రీడాకారిణిగా రేణుక ఎంపికైంది. ముగింపు వేడుకలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. -
ఖోఖో విజేత కేశవ మెమోరియల్ కాలేజి
ఎల్బీస్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ జూనియర్ కాలేజి అండర్-19 బాలుర ఖోఖో టోర్నమెంట్ టైటిల్‌ను కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి జట్టు కైవసం చేసుకుంది. హైదరాబాద్ జిల్లా జూనియర్ కాలేజి గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ మెమోరియల్ హైస్కూల్ మైదానంలో బుధవారం జరిగిన ఫైనల్లో కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి జట్టు 15-2తో భవాన్స్ జూనియర్ కాలేజి (సైనిక్‌పురి) జట్టుపై గెలిచింది. కేశవ్ మెమోరియల్ జట్టులో ఎల్లప్ప, సురేష్, సాగర్ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అంతకుముందు సెమీఫైనల్లో కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి 15-0తో కూకట్‌పల్లికి చెందిన న్యూ గవర్నమెంట్ కాలేజిపై, భవాన్స్ జూనియర్ కాలేజి 8-0తో గవర్నమెంట్ కాలేజి (సికింద్రాబాద్)పై గెలిచాయి. -
రన్నరప్ విజ్ఞాన్ స్కూల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సీబీఎస్ఈ క్లస్టర్ ఖోఖో టోర్నమెంట్లో బాలుర టీమ్ విభాగంలో విజ్ఞాన్ స్కూల్ (నిజాంపేట్) జట్టుకు రెండో స్థానం దక్కింది. నిజాంపేట్‌లో విజ్ఞాన్ స్కూల్లో జరుగుతున్న ఈ పోటీల్లో చివరి రోజు ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో నిజాంపేట్ విజ్ఞాన్ జట్టు 8-13తో కర్ణాటకకు చెందిన మారుతి విద్యాకేంద్ర జట్టు చేతిలో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచింది. కల్పతరు సెంట్రల్ స్కూల్ (కర్ణాటక) జట్టుకు మూడో స్థానం లభించింది. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో విజ్ఞాన్ స్కూల్ 9-2తో కర్ణాటకకు చెందిన ఎంకిట్స్ స్కూల్‌పై, మారుతి విద్యాకేంద్ర 3-2తో కల్పతరు సెంట్రల్ స్కూల్‌పై నెగ్గాయి. బాలికల విభాగం ఫైనల్లో బీడీఎల్ డీఏవీ జట్టు 7-5తో మారుతి విద్యా కేంద్ర జట్టుపై విజయం సాధించింది. నిజాంపేట్ విజ్ఞాన్ స్కూల్ జట్టు మూడో స్థానం పొందింది. ఈ పోటీల ముగింపు వేడుకలకు యూజీసీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ జి.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
సెమీ ఫైనల్లో విజ్ఞాన్ స్కూల్
నిజాంపేట, న్యూస్‌లైన్: సీబీఎస్ఈ క్లస్టర్-7 ఖోఖో టోర్నమెంట్లో విజ్ఞాన్ స్కూల్ సెమీఫైనల్‌కు చేరుకుంది. శనివారం బాలుర విభాగంలో జరిగిన ఈ పోటీల్లో మహర్షి విద్యామందిర్, బి.డి.ఎల్, డి.ఎ.వి, కర్ణాటకకు చెందిన శ్రీవిద్యానికేతన్ ఎంకేఈటీఎస్, కల్పతరు సెంట్రల్ పబ్లిక్ స్కూల్, డి.ఎ.వి. కూకట్పల్లి, భారతీయ విద్యాభవన్ బీహెచ్ఈఎల్, గుంటూరుకు చెందిన భాష్యం బ్లూమ్, మారుతీ విద్యాకేంద్రం పాఠశాలలు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఆదివారం జరిగే ముగింపు ఉత్సవానికి యు.జి.సి జాయింట్ సెక్రటరీ డాక్టర్ జి.శ్రీనివాస్ పాల్గొననున్నారు. -
5 నుంచి తెలంగాణ ఖోఖో టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: తెలంగాణ అంతర్ జిల్లా సీనియర్ ఖోఖో టోర్నమెంట్ వచ్చేనెల 5 నుంచి కరీంనగర్‌లోని వేములవాడలో నిర్వహించనున్నట్లు తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు తెలిపారు. ఈ పోటీల్లో పురుషులు, మహిళల విభాగాల్లో ప్రతి జిల్లా నుంచి జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో భాగంగా జాతీయ సీనియర్ ఖోఖో టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్లను ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. 2న రోడ్ రేస్ నిజాం కాలేజి విద్యా సంఘం మాజీ అధ్యక్షుడు సి.దేవేందర్ యాదవ్ స్మారక రాష్ట్ర స్థాయి రోడ్ రేస్ చాంపియన్‌షిప్ నవంబర్ 2న నిజాం కాలేజి మైదానంలో జరుగుతుంది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్, అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో దేవేందర్ స్మారక 25 సిల్వర్ జూబ్లీ రోడ్ రేస్ పోటీలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. పురుషుల, మహిళల, అండర్-16 బాలబాలికల విభాగాల్లో 4కిలో మీటర్లు, అండర్-10,13 బాలబాలికలు విభాగాల్లో 1.5 కిలో మీటర్ల రోడ్ రేసుల పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోటీలు వాయిదా విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లో గురువారం జరగాల్సిన ఇంటర్ జూనియర్ కాలేజి బాస్కెట్‌బాల్ టోర్నీ భారీ వర్షం కారణంగా వాయిదా పడింది. ఈ అండర్-19 బాలుర బాస్కెట్‌బాల్ టోర్నీ నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్.రాజేంద్రప్రసాద్ తెలిపారు. వచ్చే నెల 8 నుంచి చిత్తూరులో అంతర్ జిల్లా అండర్-19 బాస్కెట్‌బాల్ టోర్నీ జరుగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.