ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: తెలంగాణ అంతర్ జిల్లా సీనియర్ ఖోఖో టోర్నమెంట్ వచ్చేనెల 5 నుంచి కరీంనగర్‌లోని వేములవాడలో నిర్వహించనున్నట్లు తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు తెలిపారు. ఈ పోటీల్లో పురుషులు, మహిళల విభాగాల్లో ప్రతి జిల్లా నుంచి జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో భాగంగా జాతీయ సీనియర్ ఖోఖో టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్లను ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.
2న రోడ్ రేస్
నిజాం కాలేజి విద్యా సంఘం మాజీ అధ్యక్షుడు సి.దేవేందర్ యాదవ్ స్మారక రాష్ట్ర స్థాయి రోడ్ రేస్ చాంపియన్‌షిప్ నవంబర్ 2న నిజాం కాలేజి మైదానంలో జరుగుతుంది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్, అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో దేవేందర్ స్మారక 25 సిల్వర్ జూబ్లీ రోడ్ రేస్ పోటీలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. పురుషుల, మహిళల, అండర్-16 బాలబాలికల విభాగాల్లో 4కిలో మీటర్లు, అండర్-10,13 బాలబాలికలు విభాగాల్లో 1.5 కిలో మీటర్ల రోడ్ రేసుల పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పోటీలు వాయిదా
విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లో గురువారం జరగాల్సిన ఇంటర్ జూనియర్ కాలేజి బాస్కెట్‌బాల్ టోర్నీ భారీ వర్షం కారణంగా వాయిదా పడింది. ఈ అండర్-19 బాలుర బాస్కెట్‌బాల్ టోర్నీ నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్.రాజేంద్రప్రసాద్ తెలిపారు. వచ్చే నెల 8 నుంచి చిత్తూరులో అంతర్ జిల్లా అండర్-19 బాస్కెట్‌బాల్ టోర్నీ జరుగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
5 నుంచి తెలంగాణ ఖోఖో టోర్నీ
Published Fri, Oct 25 2013 12:26 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
Advertisement
Advertisement