ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ బాలికను మహరాష్ట్రకు తీసుకెళ్లిన యువకుడిని నారాయణగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై నరేష్ కథనం మేరకు. వివరాలిలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన లక్ష్మణ్ దమాయ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. అతని కుమారుడు కరణ్ పరియార్ హిమాయత్‌నగర్‌లోని మెమోస్‌లో పనిచేస్తున్నాడు. స్థానికంగా 9వ తరగతి చదువుతున్న తన అత్త కుమార్తెను అతను ప్రేమిస్తున్నాడు. అదను చూసుకుని కరణ్ పరియార్ సదరు బాలికను మహారాష్ట్రలోని కళ్యాణ్ నగరానికి తీసికెళ్లాడు.
ఓ గది అద్దెకు తీసుకుని వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కరణ్ పరియార్ అన్న రాము పరియార్ ఫేస్‌బుక్‌లో తండ్రిపై, అన్నపై కేసు నమోదు అయ్యిందని, ఏ క్షణానైనా అరెస్ట్ చేయవచ్చునని పోస్ట్ చేశారు.
ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్ కావడంతో కరణ్ పరియార్ తన సోదరుడు రాముకు ఫోన్ చేసి తాము కళ్యాణ్‌లో ఉన్నట్లు తెలిపాడు. ఎస్సై నరేష్ సూచన మేరకు సమీపంలోని ఉల్లాస్‌నగర్ పీఎస్‌లో లొంగిపోయాడు. అప్పటికే ఎస్సై అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కరణ్ పరియార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: (Hyderabad: అపార్ట్ మెంట్‌లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..)
Comments
Please login to add a commentAdd a comment