fso
-
నవంబర్ 7న ఎఫ్ఎస్వో అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబర్ 7న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు వెంటనే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, అర్హత పరీక్షను సీబీఆర్టీ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. హాల్టికెట్లలో నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధం కావాలని సూచించింది. -
కేసులు బనాయిస్తాం జాగ్రత్త.. ‘సాక్షి’కి బెదిరింపులు
బెజ్జూర్ (సిర్పూర్): ‘కలప అక్రమ దందా నువ్వే చేపడుతున్నావు.. ఏం అనుకుంటున్నావు.. నువ్వు ఎక్కువ చేస్తున్నావ్.. నీపై కేసులు బనాయిస్తాం..’ అంటూ బెజ్జూర్ అటవీ శాఖ ఎఫ్ఎస్వో ప్రసాద్ బుధవారం ‘సాక్షి’ బెజ్జూర్ విలేకరిని బెదిరింపులకు గురిచేశారు. ‘మాయమవుతున్న కలప’ శీర్షికతో రేంజ్ పరిధిలో కలప అక్రమ రవాణాపై ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. కలప అక్రమ రవాణాను అడ్డుకోలేని అధికారులు బుధవారం ఉదయం ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేసి భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారు. నిఘా పెంచి కలప అక్రమ రవా ణాను అడ్డుకుంటామని తెలపాల్సిన అధికారులు ఇలా భయబ్రాంతులకు గురిచేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ కాల్‌పై ఎఫ్ఆర్వో దయాకర్‌ను వివరణ కోరగా ఈ విషయంపై విచారణ చేపడతామని వెల్లడించారు. ప్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు.. ‘సాక్షి’ కథనంతో స్పందించిన అటవీ అధికారులు బుధవారం బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన ఎస్కే మోహిత్ అనే వ్యక్తి ఇంట్లో ప్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టి 25 టేకు కలప చెక్కలను పట్టుకున్నారు. ఈ మేరకు ప్లైయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్వో అప్పలకొండ వెల్లడించారు. దీని విలువ రూ.8500లు ఉంటుందని వివరించారు. ఈ దాడుల్లో బెజ్జూర్ ఎఫ్ఆర్వో దయాకర్, ఎఫ్ఎస్వో ప్రసాద్, బీట్ అధికారి వెంకటేశ్, సిబ్బంది ఉన్నారు. -
ముగిసిన అటవీశాఖ పరీక్షలు
- ఆఖరి విడత ‘ఎఫ్ఎస్వో’ పరీక్షతో ముగిసిన పర్వం - 580 మంది అభ్యర్థులకు 242 మంది గైర్హాజరు శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి గత మూడు విడతలుగా నిర్వహించిన పరీక్షల పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఆఖరి విడతగా ఆదివారం నిర్వహించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్(ఎఫ్ఎస్వో) పరీక్ష ఆదివారంతో ప్రశాంతంగా ముగిసింది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించమని అధికారులు హెచ్చరించడంతో అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలకు ఉరుకులు, పరుగులు తీశారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల కేంద్రంగా జరిగిన ఈ పరీక్షకు 580 మంది అభ్యర్ధులు హాజరుకావాల్సి ఉండగా 338 మంది మాత్రమే హాజరయ్యారు. పకడ్బంధీగా పరీక్షల నిర్వహణ.. ఇదిలా ఉండగా అటవీశాఖ పరీక్షలకు సంబంధించి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి సఫలీకృతమయ్యారు. జేఎన్టీయూ(హైదరాబాద్) నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బమ్మిడి పోలీసు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. దీనికితోడు జేఎన్టీయూకి చెందిన పరిశీలకుడు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేశారు. జిల్లా అటవీశాఖాధికారి బి.విజయ్‌కుమార్, కార్యాలయ సిబ్బంది పరీక్షలు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మొత్తం మీద అటీవీశాఖ ఉద్యోగాల భర్తీకి మూడు విడతలుగా నిర్వహించిన పరీక్షలన్నీ సజావుగా, సాఫీగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.