- 18 కేంద్రాలు, పరీక్షలు రాయనున్న అభ్యర్థులు 8,799 మంది
11న ఏపీసెట్ అర్హత పరీక్ష
Published Fri, Sep 9 2016 9:18 PM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కళాశాలల్లో అర్హత సాధించే ఏపీసెట్ 2016 పరీక్ష ఈనెల 11న రాజమహేంద్రవరం కేంద్రంగా జరగనుందని ఆ పరీక్షల రీజనల్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎస్.టేకి శుక్రవారం తెలిపారు. 18 పరీక్షాకేంద్రాల్లో జరిగే ఏపీసెట్‌కు మొత్తం 8,799 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలున్నర గంటల వరకు మూడు విభాగాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. దీనిలో ఉత్తీర్ణులైన వారు యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేసేందుకు అర్హత సాధిస్తారు.
పరీక్షా కేంద్రాలివే...: గైట్ ఇంజినీరింగ్ కళాశాల, గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎన్‌హెచ్ 5లో) ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, ఆదిత్య డిగ్రీ కళాశాల, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల, సంహిత డిగ్రీ కళాశాల, ఆదిత్య జూనియర్ కళాశాల, శ్రీప్రకాశ్ విద్యానికేతన్, ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల, రాజమహేంద్రి డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీమతి జాస్తిబుల్లెమ్మాయి కళాశాల, శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(రాజమండ్రి రూరల్ పిడింగొయ్యిలోనున్న ఈ పరీక్ష కేంద్రంకు రవాణా సౌకర్యం అంతంతమాత్రమే, కనీసం అరగంట ముందుగానే ఇక్కడికి చేరుకునేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకోవాలి) మెగా జూనియర్ కళాశాల, ప్రగతి జూనియర్ కళాశాల, ఆదికవి నన్నయ యూనివర్సిటీ, ప్యూచర్ కిడ్స్ స్కూలు, ఎస్‌కేఆర్ మహిళా కళాశాల.
Advertisement