
ఫగ్వాడా (రాజస్థాన్): డ్రైవర్ లేకుండా నడిచే (స్వయంచాలిత) వాహనాల అభివృద్ధి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఊపందుకుంది. ఇందులో గూగుల్ ముందు వరుసలో ఉంది. డ్రైవర్‌లెస్ కారును రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది గూగుల్. కానీ వీటి వాడకం మాత్రం ఇంకా అధికారికంగా అందుబాటులోకి రాలేదు. ఇప్పటి వరకు రూపొందించిన అన్ని డ్రైవర్‌లెస్ వెహికిల్స్ డీజిల్ లేదా పెట్రోల్‌తో నడిచేవే. అయితే తొలిసారి సౌరశక్తితో నడిచే డ్రైవర్‌లెస్ వాహనాన్ని రూపొందించారు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు.
ఒక్కసారి చార్జి చేస్తే ఈ బస్సు 70 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తొలి నమూనా సిద్ధమైన ఈ వాహనానికి రూ.15 లక్షలే ఖర్చు కావడం విశేషం. రాజస్థాన్‌లోని ఫగ్వాడాలోగల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన 300 మంది విద్యార్థులు, 50 మంది అధ్యాపకులు సమిష్టిగా దీనిని తయారు చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని వర్క్‌షాప్‌లోనే దీనికి ప్రాణం పోశారు. 2014లో డ్రైవర్ లేని గోల్ఫ్‌కార్ట్ తయారు చేశామని, ఇప్పుడు ఒకడుగు ముందుకువేసి సౌరశక్తితో నడిచే డ్రైవర్ లెస్ బస్సును సిద్ధం చేశామని ప్రాజెక్ట్ లీడర్ మణిదీప్ సింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment