Solar power battery
-
చిన్న ఉపాయమే ఈ సోలార్ ఫ్యాన్.. నాన్స్టాస్ వ్యాపారం!
ఎండ వేడిని భరించాలంటే ఎవరికీ సాహసపడదు. ఆ వేడినుంచి తప్పుకోడానికే శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ వ్యాపారాలు చేసేవాళ్లు, ఎండలో కష్టించి పనిచేసేవాళ్లు తప్పకుండా ఏదో ఒక ఉపాయమైతే చేస్తారు. అలాంటి ప్రయత్నమే.. ఓ హహిళ చేసింది. అదేంటో చూద్దాం. ఎండ తీవ్రత నుంచి తప్పించుకునేందుకు పండ్లు అమ్ముతున్న ఓ మహిళ వినూత్న ఆలోచన చేసింది. పైన గొడుగు ఉన్నా ఉక్కపోతనుంచి కాపాడుకునేందుకు బుల్లిఫ్యాన్ తెచ్చుకుంది.అందుకు సోలార్‌ప్యానెల్ తెచ్చి పక్కనే పెట్టి దానినుంచి వచ్చే విద్యుత్‌తో ఆ ఫ్యాన్ గిరాగిరా తిరుగుతుండగా చల్లని గాలిలో తన వ్యాపారం చేసుకుంటోంది. ఈ దృశ్యం జనగామ జిల్లాకేంద్రంలోని నెహ్రూ పార్క్ సెంటర్ వద్ద శుక్రవారం కనిపించగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – ఫొటో: సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్ -
ఎయిర్పోర్ట్ మెట్రో మార్గంలో సోలార్ పవర్!
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ మెట్రో సౌరకాంతుల శోభను సంతరించుకోనుంది. 31 కి.మీ. మేర చేపడుతున్న ఈ ప్రాజెక్టులో మొత్తంగా 9 నుంచి 10 స్టేషన్లను నిర్మించనున్నారు. స్టేషన్లలో పూర్తిస్థాయిలో సౌరశక్తి వినియోగం ఆధారంగా విద్యుత్ దీపాలు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు తదితర విద్యుత్ ఆధార ఉపకరణాలు పనిచేసేలా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ సంస్థ చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే తొలిదశ మెట్రో ప్రాజెక్టులో 28 మెట్రోస్టేషన్ల పైకప్పులు, ఉప్పల్, మియాపూర్ డిపోల్లోని ఖాళీప్రదేశాల్లో 8.35 మెగావాట్ల క్యాప్టివ్ సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుండటం గమనార్హం. మెట్రోస్టేషన్లు, కార్యాలయాల్లో ఉపయోగించే విద్యుత్ అవసరాల్లో సుమారు 15 శాతం సౌరశక్తి ద్వారానే పొందుతున్నట్లు తొలిదశ మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ వర్గాలు తెలిపాయి. తొలిదశలో సౌరశక్తి వినియోగం ఇలా.. సంప్రదాయేతర ఇంధన వనరులపై మెట్రో సంస్థ దృష్టి సారించింది. ఇప్పటికే మెట్రో రైళ్లలో బ్రేకులు వేసినప్పుడు ఉత్పన్నమయ్యే బలంతో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా రిజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. సౌరశక్తి, రిజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నందుకు 20 మెట్రోస్టేషన్లు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందాయి. లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ ప్లాటినం సర్టిఫికెట్‌ను కూడా మెట్రో సాధించింది. మెట్రోస్టేషన్లను 100 శాతం సౌరవెలుగును ఉపయోగించుకోవడం, క్రాస్ వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంధన వినియోగాన్ని పరిమిత మోతాదులో వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఉప్పల్, మియాపూర్ డిపోల్లో వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు 150 భారీ ఇంకుడుగుంతలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంగణాల్లో వర్షపునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టింది. -
గొర్రెల కాపరి సెల్ చార్జింగ్ ఐడియా అదిరింది..!
సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం ఓ గొర్రెల కాపరి వినూత్నంగా ఆలోచించాడు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన హుస్సేనప్ప తన గొర్రెలను మేత కోసం నల్లమల అటవీప్రాంతానికి తీసుకెళ్తుంటాడు. అయితే అడవిలో విద్యుత్ సౌకర్యం ఉండదు కాబట్టి సెల్‌ఫోన్ చార్జింగ్ సమస్యగా మారింది. దీనికితోడు రాత్రిపూట గొర్రెల మందకు లైటింగ్ కూడా ఉండటం లేదు. దీనిపై ఆలోచించిన హుస్సేనప్ప పరిష్కారమార్గం కనుగొన్నాడు. ఓ సోలార్ ప్లేటు, బ్యాటరీని కొనుగోలు చేసి, గొర్రెల మంద వెంట బియ్యం, ఇతర వంట సామగ్రి తీసుకెళ్లే గాడిదపై ఏర్పాటు చేశాడు. దీనిద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌తో సెల్‌ఫోన్ చార్జింగ్‌తో పాటు మందకు లైటింగ్ ఏర్పాటు చేశాడు. హుస్సేనప్ప గురువారం మందతో పాటు జడ్చర్ల మీదుగా వెళుతుండగా.. గాడిదపైనున్న సోలార్‌ప్లేట్లు ఆకర్షించాయి. – జడ్చర్ల -
ప్రపంచంలో తొలి సోలార్ పవర్ కారు.. విశేషాలు ఇవే
జమానా అంతా పెట్రోల్/డీజిల్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ కార్ల గురించి ఆలోచిస్తుంటూ నెదర్లాండ్స్‌కి చెందిన ఓ కంపెనీ మరో అడుగు ముందుకు వేసి సోలార్ కారుకి రూపకల్పన చేసింది. సరికొత్తగా డిజైన్ చేసిన ఈ సోలార్ కారు పైసా ఖర్చు లేకుండా అదనపు మైలేజీని అందిస్తుంది. ఈ కారుకి లైట్‌ఇయర్ జీరోగా పేరు పెట్టారు. ప్రస్తుతం మేజర్ కార్‌మేకర్ కంపెనీలో ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి పెట్టారు. సరికొత్త మోడల్స్‌ని మార్కెట్లోకి తెస్తున్నారు. అయితే ఇంటి బయట ఛార్జింగ్ స్టేషన్ల సమస్య ఇప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్‌ను వేధిస్తూనే ఉంది. దీంతో ఈవీ వెహికల్స్‌కి అదనపు మైలేజీ అందివ్వడం ద్వారా ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడే అవకాశం తగ్గించాలనే కాన్సెప్టుతో ఈ సోలార్ ఎలక్ట్రిక్ కారుని డిజైన్ చేశారు. ఫస్ట్ ఈవీనే లైట్ ఇయర్ జీరో కారు స్వహతాగా ఎలక్ట్రిక్ కారు. 60 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. సింగిల్ ఛార్జ్‌తో 625 కి.మీ మైలేజీ అందిస్తుంది. పది సెకన్లలో వంది కి.మీ వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 160 కి.మీలు. అయితే అన్ని ఈవీ కార్లకు ఉండే ఛార్జింగ్ సమస్యను అధిగమించేందుకు దీనికి సోలార్ పవర్‌ను జత చేశారు. గత ఆరేళ్లుగా ఈ కాన్సెప్టుపై పని చేయగా తొలి కారుకి ఇప్పుడు తుది రూపం వచ్చింది. సోలార్ బెనిఫిట్స్ లైట్‌ఇయర్ జీరో బాడీలో రెండు చదరపు మీటర్ల అధునాత సోలార్ ప్యానెళ్లను అమర్చారు. వీటి సాయంతో బ్యాటరీలు ఛార్జింగ్ అవుతాయి. ఫలితంగా అదనంగా కనీసం 50 కి.మీ మైలేజీ లభిస్తుంది. ఇలా వచ్చే అదనపు మైలేజీకి కనీస ఖర్చు కూడా ఉండకపోవడం విశేషం. బయటకు వెళితే ఛార్జింగ్ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ధర ఎంతంటే లైట్ ఇయర్ జీరో కారు ధరను 2,50,00 డాలర్లుగా నిర్ణయించారు. తొలి ఏడాది 974 యూనిట్ల కార్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటికి యూరప్ మార్కెట్లో సింహభాగం తామే ఆక్రమిస్తామని లైట్ ఇయర్ జీరో మేకర్స్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: టెస్లాలో ఉంటే సేఫ్! కావాంటే మీరే చూడండి -
అత్యంత ఎత్తులో పవర్ స్టేషన్... టాటా వరల్డ్ రికార్డు
సాక్షి, వెబ్‌డెస్క్: ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న టాటా మరో రికార్డుపై కన్నేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమైంది. దీంతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ని ఏర్పాటు చేయనుంది. సోలార్‌లోకి టాటా కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో కార్పోరేటు కంపెనీలు సౌర విద్యుత్తుపై దృష్టి సారించాయి. అందులో భాగంగా టాటా సంస్థ సైతం దేశంలో వివిధ ప్రాంతాల్లో సోలార్ పవర్ స్టేషన్లు నిర్మాణం చేపడుతోంది. మన అనంతపురంలో 150 మెగావాట్ల పవర్ ప్లాంటుతో పాటు కేరళలోని కాసర్గోడ్లో 50 మెగావాట్లు, ఒడిషాలోని లపంగాపలో 30 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం టాటా పవర్ చేపట్టింది. అయితే వీటి లేని ప్రత్యేకత తాజాగా చేపట్టబోయే ప్రాజెక్టులో చోటు చేసుకోనుంది. వరల్డ్ రికార్డు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూముల్లో ఒకటైన లదాఖ్‌లో కొత్తగా సోలార్ పవర్ ప్లాంటును నిర్మించనుంది టాటా పవర్ సంస్థ, లదాఖ్ ప్రధాన పట్టణమైన లేహ్ సమీపంలో లైంగ్ అనే గ్రామం సమీపంలో భూమి నుంచి 3,600 మీటర్ల ఎత్తులో ఈ సోలార్ పవర్ స్టేషన్‌ను నిర్మించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నెలకొల్పిన సోలార్ పవర్ స్టేషన్‌గా స్విట్జర్లాండ్‌లోని జుంగ్ఫ్రాజోక్ గుర్తింపు ఉంది. 1991లో ఈ పవర్ స్టేషన్‌ని భూమి నుంచి 3,454 మీటర్ల ఎత్తులో నెలకొల్పారు. ముప్పై ఏళ్లుగా ఇదే రికార్డుగా కొనసాగుతోంది. 2023 మార్చికి పూర్తి లేహ్ సమీపంలో నిర్మించే సోలార్ పవర్ స్టేషన్ నిర్మాణం 2023 మార్చి నాటికి పూర్తి కానుంది. పవర్ స్టేషన్‌కు అనుసంధానంగా 50 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ని సైతం టాటా పవర్ నెలకొల్పనుంది. దీని కోసం రూ.386 కోట్లు వెచ్చించనుంది. ఇండియా వేగంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోందని అనడానికి లేహ్‌లో చేపడుతున్న కొత్త సోలార్ పవర్ ప్రాజెక్టు ఉదాహరణ అని టాటా పవర్ సీఈవో ప్రవీర్ సిన్హా అన్నారు. -
సౌరశక్తితో నడిచే డ్రైవర్‌లెస్ బస్
ఫగ్వాడా (రాజస్థాన్): డ్రైవర్ లేకుండా నడిచే (స్వయంచాలిత) వాహనాల అభివృద్ధి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఊపందుకుంది. ఇందులో గూగుల్ ముందు వరుసలో ఉంది. డ్రైవర్‌లెస్ కారును రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది గూగుల్. కానీ వీటి వాడకం మాత్రం ఇంకా అధికారికంగా అందుబాటులోకి రాలేదు. ఇప్పటి వరకు రూపొందించిన అన్ని డ్రైవర్‌లెస్ వెహికిల్స్ డీజిల్ లేదా పెట్రోల్‌తో నడిచేవే. అయితే తొలిసారి సౌరశక్తితో నడిచే డ్రైవర్‌లెస్ వాహనాన్ని రూపొందించారు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు. ఒక్కసారి చార్జి చేస్తే ఈ బస్సు 70 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తొలి నమూనా సిద్ధమైన ఈ వాహనానికి రూ.15 లక్షలే ఖర్చు కావడం విశేషం. రాజస్థాన్‌లోని ఫగ్వాడాలోగల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన 300 మంది విద్యార్థులు, 50 మంది అధ్యాపకులు సమిష్టిగా దీనిని తయారు చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని వర్క్‌షాప్‌లోనే దీనికి ప్రాణం పోశారు. 2014లో డ్రైవర్ లేని గోల్ఫ్‌కార్ట్ తయారు చేశామని, ఇప్పుడు ఒకడుగు ముందుకువేసి సౌరశక్తితో నడిచే డ్రైవర్ లెస్ బస్సును సిద్ధం చేశామని ప్రాజెక్ట్ లీడర్ మణిదీప్ సింగ్ చెప్పారు. -
శభాష్.. సుభానీ సోలార్ స్ప్రేయర్!
కషాయాలు, ద్రావణాలు, జీవామృతం, అటవీ చైతన్యం, అమృత్‌పానీ వంటి భూసార వర్ధని ద్రావణాల నుంచి పురుగుమందుల వరకు పంటలపై మనుషులు పిచికారీ చేయడం రైతుకు భారంగా మారింది. కూలీల కొరత, అధిక ఖర్చు సమస్యలతో పాటు సకాలంలో ప్రారంభించి, త్వరగా పిచికారీ పూర్తి చేయడం కూడా రైతుకు అనుకూలించే ముఖ్య విషయాలు. రైతుకు ఖర్చును, శ్రమను, సమయాన్ని ఆదా చేసే బూమ్ స్ప్రేయర్లు సహా కొత్త రకం స్ప్రేయర్లను రూపొందించడంలో సయ్యద్ సుభానీ సిద్ధహస్తుడు. సౌరశక్తితో తనంతట తానే నడుస్తూ, పిచికారీ చేసే సోలార్ స్ప్రేయర్‌ను తాజాగా సుభానీ ఆవిష్కరించారు. మెట్ట, ఆరుతడి పంటలన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. ప్రయోగాలే ఊపిరిగా సరికొత్త స్ప్రేయర్లను రూపొందిస్తూ అన్నదాతల మన్ననలు పొందుతున్న ప్రసిద్ధ గ్రామీణ ఆవిష్కర్త సయ్యద్ సుభానీ తాజాగా సౌర శక్తితో నడిచే ‘బ్యాటరీ రన్ సోలార్ స్ప్రేయర్’ను రూపొందించారు. మెకానిక్ అయిన సుభానీ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని మారుమూల గ్రామం నాగబైరువారిపాలెం వాస్తవ్యుడు. ఆరేళ్ల క్రితం నుంచి కొత్త డిజైన్లతో స్ప్రేయర్లు తయారు చేస్తున్నారు. జీపు, ట్రాక్టర్లతో నడిచే బూమ్ స్ప్రేయర్లతో పాటు మొత్తం 9 స్ప్రేయర్లను తయారు చేసి ప్రసిద్ధి పొందారు. ఈ మూడు చక్రాల సోలార్ స్ప్రేయర్‌కు డీజిల్/పెట్రోలు అవసరం లేదు. దీని పైన ఏర్పాటు చేసిన సౌర ఫలకం ద్వారా తయారు చేసుకునే సౌరశక్తితో బ్యాటరీ చార్జి అవుతుంది. ఆ శక్తితోనే నడుస్తుంది, పిచికారీ చేస్తుంది. దీని వెనుక మనిషి ఉండాలి. అయితే, శ్రమపడాల్సిన అవసరం లేదు. ట్యాంకును నింపి, సాలులో దీన్ని నిలిపి ఆన్ చేస్తే చాలు. అదే తనను తాను నడుపుకుంటూ పిచికారీ చేస్తూ ముందుకు వెళ్తుంది. స్ప్రేయర్ చక్రాలకు మట్టి పెళ్లలు అడ్డుపడినప్పుడో, మలుపు తిరగాల్సినప్పుడో మనిషి అవసరం ఉంటుంది. ఏయే పంటలకు ఉపయోగం? 9 అంగుళాల నుంచి 42 అంగుళాల అచ్చు వాడే శనగ, మినుము వంటి అపరాలు, పత్తి, పొగాకు, కూరగాయ పంటలు తదితర మెట్ట, ఆరుతడి పైరులన్నిటిలోనూ కషాయాలు, ద్రావణాలు, పురుగుమందుల పిచికారీకి ఇది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. జీవామృతం పిచికారీ చేయాలంటే.. డబుల్ ఫిల్టర్‌ను వాడాలి. పెద్ద నాజిల్ పెట్టుకోవాలని సుభానీ తెలిపారు. పందిరి కూరగాయ తోటల్లో పందిళ్ల పైన పిచికారీ చేయడానికి కూడా దీని డిజైన్‌లో కొన్ని మార్పులు చేసి తయారు చేస్తానని సుభానీ తెలిపారు. ఈ స్ప్రేయర్ చక్రాల మధ్య 18 అంగుళాల దూరం ఉంటుంది. ఇటు 6 అడుగులు, అటు 6 అడుగుల దూరం పిచికారీ చేస్తుంది. అవసరాన్ని బట్టి తగినట్లు మార్పులు చేసుకోవచ్చని సుభానీ తెలిపారు. అర గంటలో ఎకరం పిచికారీ స్ప్రేయర్ తయారీకి రూ. 32 వేల ఖర్చు ఈ మూడు చక్రాల సోలార్ స్ప్రేయర్ తయారీకి సుమారు రూ. 32 వేలు ఖర్చవుతుందని సుభానీ తెలిపారు. సైకిల్‌కి వాడే మూడు చక్రాల బండికి 50 వాట్ల సోలార్ ప్యానల్, 12 యామ్స్ బ్యాటరీ. 12 వోల్టుల (120 పీఎస్) మోటారు, 22 లీటర్ల సామర్థ్యం వాటర్ ట్యాంక్‌ను అమర్చారు. నాలుగు నాజిల్స్ ఏర్పాటు చేశారు. ఎకరా పొలంలో 30 నిమిషాల్లో పురుగుమందు పిచికారీ చేయవచ్చు. కూలీలను పెట్టుకొని పిచికారీ చేయాలంటే గంటన్నర సమయం పడుతుంది. దీని బ్యాటరీకి ఏడాది గ్యారంటీ ఉంది. మనిషి నెట్టుకుంటూ వెళ్లే విధంగా ఒకే చక్రంతో కూడిన సోలార్ స్ప్రేయర్‌ను రూ. 22 వేలకే రూపొందించవచ్చన్నారు. సుభానీని గ్రాంటు ఇవ్వడం ద్వారా నాబార్డు ప్రోత్సహిస్తుండడం విశేషం. బ్యాంకు రుణం ఇస్తే మరిన్ని రూపొందిస్తా! నేను గత ఆరు సంవత్సరాలుగా కొత్తరకం స్ప్రేయర్లపై ప్రయోగాలలో నిమగ్నమై ఉన్నాను. ఇప్పటికి 9 రూపొందించాను. ఈ సోలార్ స్ప్రేయర్ లాంటిది దేశంలో ఇంతకుముందెవరూ తయారు చేయలేదు. నా భార్య షకీలా, తమ్ముడు చిన్న సుభానీ, కుమారులు ఖుధావ, మోషిన్, కుమార్తె షాహిన్తోపాటు నాబార్డు, పల్లెసృజన సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. బ్యాంకు రుణ సౌకర్యం కల్పిస్తే, రైతులకు తోడ్పడే మరిన్ని నూతన పరికరాలు రూపొందిస్తా. – సయ్యద్ సుభానీ (98486 13687), గ్రామీణ ఆవిష్కర్త, నాగబైరువారిపాలెం, పెదనందిపాడు మం., గుంటూరు జిల్లా స్ప్రేయర్‌కు తుది మెరుగులు దిద్దుతున్న సుభానీ – ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి, అమరావతి బ్యూరో ఫొటోలు: పులి ప్రకాశ్, సాక్షి, పెదనందిపాడు -
స్మార్ట్‌ట్రాక్ నుంచి సోలార్ మైక్రో ఇన్వర్టర్
♦ ఏడాదిలో సోలార్ పవర్ బ్యాటరీ తీసుకొస్తాం.. ♦ కంపెనీ సీఈవో భగవాన్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సోలార్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ స్మార్ట్‌ట్రాక్.. ప్లగ్ అండ్ ప్లే సోలార్ మైక్రో ఇన్వర్టర్ను మంగళవారమిక్కడ ఆవిష్కరించింది. దేశీయంగా తయారైన తొలి ఉత్పాదన ఇదేనని కంపెనీ వెల్లడించింది. సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తి అయిన డెరైక్ట్ కరెంట్(డీసీ) ఆల్టర్నేటింగ్ కరెంట్(ఏసీ) మారుస్తుంది. జనించిన విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగిస్తుంది. నిర్వహణ ఖర్చులు లేవు. ఇ-మీటరింగ్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. గృహ, వాణిజ్య అవసరాలకు పనికొస్తుంది. మైక్రో ఇన్వర్టర్ పనితీరును స్మార్ట్ సందేశ్ మొబైల్ యాప్ లేదా స్మార్ట్‌ట్రాక్ వెబ్ పోర్టల్ ద్వారా కస్టమర్ ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. సంప్రదాయ పద్ధతిలో 1 కిలోవాట్‌కు రూ.1 లక్ష ఖర్చు అయితే, తమ సిస్టమ్‌కు రూ.80 వేలు అవుతుందని స్మార్ట్‌ట్రాక్ తెలిపింది. వినియోగదారులు అవసరాన్నిబట్టి తక్కువ ఖర్చుతో ప్యానెళ్లను జోడించొచ్చు. 300 వాట్స్ సోలార్ ప్యానెల్‌తో కలిపి మైక్రో ఇన్వర్టర్ ధర రూ.20 వేలు. అభివృద్ధిలో బ్యాటరీ.. సౌర విద్యుత్‌ను నిల్వ చేసే సమర్థవంతమైన లిథియం అయాన్ బ్యాటరీని అభివృద్ధి చేస్తున్నామని స్మార్ట్‌ట్రాక్ సీఈవో జి.భగవాన్ రెడ్డి తెలిపారు. 8 నెలల్లో మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్పారు. బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ గౌతమ్ వలేటి, ప్రోడక్ట్ మేనేజర్ జాస్మిన్ భానుషాలితో కలసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ట్రాక్లో యూఎస్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సుమారు రూ.165 కోట్లు పెట్టుబడి పెడుతోందని వెల్లడించారు. రూ.100 కోట్ల విలువైన ఆర్డర్ బుక్ ఉందని చెప్పారు. హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం వద్ద కంపెనీకి ప్లాంటు ఉంది. ఇప్పటికే 60 మెగావాట్లకు సమానమైన ప్రాజెక్టులను పూర్తి చేసింది. మరో 120 మెగావాట్ల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. -
సొంతంగా రీచార్జ్ చేసుకునే సోలార్ బ్యాటరీ!
వాషింగ్టన్: కాంతిని, గాలిని ఉపయోగించుకుని తనంతట తానే రీచార్జ్ చేసుకునే సౌరవిద్యుత్ బ్యాటరీని తొలిసారిగా అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధిపర్చారు. బ్యాటరీని, సోలార్ సెల్‌ను కలిపి ఒకే హైబ్రిడ్ పరికరంలో అమర్చడం ద్వారా ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు దీనిని రూపొందించారు.