సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం ఓ గొర్రెల కాపరి వినూత్నంగా ఆలోచించాడు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన హుస్సేనప్ప తన గొర్రెలను మేత కోసం నల్లమల అటవీప్రాంతానికి తీసుకెళ్తుంటాడు. అయితే అడవిలో విద్యుత్ సౌకర్యం ఉండదు కాబట్టి సెల్‌ఫోన్ చార్జింగ్ సమస్యగా మారింది. దీనికితోడు రాత్రిపూట గొర్రెల మందకు లైటింగ్ కూడా ఉండటం లేదు.
దీనిపై ఆలోచించిన హుస్సేనప్ప పరిష్కారమార్గం కనుగొన్నాడు. ఓ సోలార్ ప్లేటు, బ్యాటరీని కొనుగోలు చేసి, గొర్రెల మంద వెంట బియ్యం, ఇతర వంట సామగ్రి తీసుకెళ్లే గాడిదపై ఏర్పాటు చేశాడు. దీనిద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌తో సెల్‌ఫోన్ చార్జింగ్‌తో పాటు మందకు లైటింగ్ ఏర్పాటు చేశాడు. హుస్సేనప్ప గురువారం మందతో పాటు జడ్చర్ల మీదుగా వెళుతుండగా.. గాడిదపైనున్న సోలార్‌ప్లేట్లు ఆకర్షించాయి.
– జడ్చర్ల
Comments
Please login to add a commentAdd a comment