జమానా అంతా పెట్రోల్/డీజిల్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ కార్ల గురించి ఆలోచిస్తుంటూ నెదర్లాండ్స్‌కి చెందిన ఓ కంపెనీ మరో అడుగు ముందుకు వేసి సోలార్ కారుకి రూపకల్పన చేసింది. సరికొత్తగా డిజైన్ చేసిన ఈ సోలార్ కారు పైసా ఖర్చు లేకుండా అదనపు మైలేజీని అందిస్తుంది. ఈ కారుకి లైట్‌ఇయర్ జీరోగా పేరు పెట్టారు.
ప్రస్తుతం మేజర్ కార్‌మేకర్ కంపెనీలో ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి పెట్టారు. సరికొత్త మోడల్స్‌ని మార్కెట్‌లోకి తెస్తున్నారు. అయితే ఇంటి బయట ఛార్జింగ్ స్టేషన్ల సమస్య ఇప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్‌ను వేధిస్తూనే ఉంది. దీంతో ఈవీ వెహికల్స్‌కి అదనపు మైలేజీ అందివ్వడం ద్వారా ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడే అవకాశం తగ్గించాలనే కాన్సెప్టుతో ఈ సోలార్ ఎలక్ట్రిక్ కారుని డిజైన్ చేశారు.
ఫస్ట్ ఈవీనే
లైట్ ఇయర్ జీరో కారు స్వహతాగా ఎలక్ట్రిక్ కారు. 60 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. సింగిల్ ఛార్జ్‌తో 625 కి.మీ మైలేజీ అందిస్తుంది. పది సెకన్లలో వంది కి.మీ వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 160 కి.మీలు. అయితే అన్ని ఈవీ కార్లకు ఉండే ఛార్జింగ్ సమస్యను అధిగమించేందుకు దీనికి సోలార్ పవర్‌ను జత చేశారు. గత ఆరేళ్లుగా ఈ కాన్సెప్టుపై పని చేయగా తొలి కారుకి ఇప్పుడు తుది రూపం వచ్చింది.
సోలార్ బెనిఫిట్స్
లైట్‌ఇయర్ జీరో బాడీలో రెండు చదరపు మీటర్ల అధునాత సోలార్ ప్యానెళ్లను అమర్చారు. వీటి సాయంతో బ్యాటరీలు ఛార్జింగ్ అవుతాయి. ఫలితంగా అదనంగా కనీసం 50 కి.మీ మైలేజీ లభిస్తుంది. ఇలా వచ్చే అదనపు మైలేజీకి కనీస ఖర్చు కూడా ఉండకపోవడం విశేషం. బయటకు వెళితే ఛార్జింగ్ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.
ధర ఎంతంటే
లైట్ ఇయర్ జీరో కారు ధరను 2,50,00 డాలర్లుగా నిర్ణయించారు. తొలి ఏడాది 974 యూనిట్ల కార్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటికి యూరప్ మార్కెట్‌లో సింహభాగం తామే ఆక్రమిస్తామని లైట్ ఇయర్ జీరో మేకర్స్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment