Solar Powered Vehicle
-
సోలార్ పవర్‌తో ఈవీ ఛార్జింగ్.. ఇది కదా మనకు కావాల్సింది
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్యూయెల్ కార్ల మెయింటెనెన్స్ కంటే.. ఈవీల వినియోగానికి ఖర్చు తక్కువే అయినప్పటికీ.. ఛార్జింగ్ టైమ్ అనేది వాహన వినియోగదారులకు ఓ సమస్యగా ఏర్పడింది. ఈ సమస్యకు ఐఐటీ-జోధ్‌పూర్ ఓ చక్కని పరిష్కారం చూపింది. ఇంతకీ ఆ పరిష్కారం ఏంటి? ఛార్జింగ్ సమయాన్ని ఎలా తగ్గిస్తుంది? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ఐఐటీ-జోధ్‌పూర్ ఎలక్ట్రిక్ కార్ల కోసం ఓ స్పెషల్ అడాప్టర్‌ను అభివృద్ధి చేసింది. దీంతో వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను సౌర శక్తిని ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రజలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో రీఛార్జ్ చేసుకునే వ్యవస్థను రూపొందించాలని నరేంద్ర మోదీ గతంలో వెల్లడించిన మాటలను ఐఐటీ-జోధ్‌పూర్ నిజం చేసింది.రూ.1,000 కంటే తక్కువ ధర వద్ద లభించే ఈ అడాప్టర్ సోలార్ ప్యానెల్ కార్యక్రమం విజయవంతమైతే.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు తమ వాహనాలను ఛార్జింగ్ వేసుకోవడానికి ప్రత్యేకంగా వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఐఐటీ జోధ్‌పూర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ తెలిపారు.ఈ అడాప్టర్ అన్ని రకాల వాహనాలలో పని చేస్తుందని, దీనికి సంబంధించిన ప్రోటోటైప్‌ను రూపొందించి విజయవంతంగా పరీక్షించామని, త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని కుమార్ తెలిపారు. కొండలు, మారుమూల ప్రాంతాల్లో కనీస ఛార్జింగ్ సదుపాయాలు లేని ప్రాంతాల్లో కూడా ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది.ఒకవైపు ఛార్జింగ్ అడాప్టర్ సోలార్ ప్యానెల్‌కు, మరోవైపు కంపెనీ అందించిన ఛార్జర్‌కు కనెక్ట్ అవుతుంది. దీంతో అవసరానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా సరఫరా అవుతుందని ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ అన్నారు. అమెరికా, కెనడా, చైనా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నాయని చెప్పారు.ఈ ప్లాన్‌లో సోలార్ సాకెట్‌తో.. సోలార్ ప్యానెల్‌ను వాహనాలలో ఉంచే బాధ్యత ఈవీ కంపెనీలదేనన్నారు. రాబోయే ఐదేళ్లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ఓ సవాలుతో కూడుకున్న పని, కాబట్టి అడాప్టర్ సోలార్ ప్యానెల్ అద్భుతంగా పనిచేస్తుందని నిశాంత్ కుమార్ అన్నారు. -
సోలార్ సీట్లు.. ఇలా కూడా వినియోగించుకోవచ్చా?
సోలార్ ఉత్పత్తులను తయారు చేసే అమెరికన్ కంపెనీ తాజాగా సోలార్ సీటును మార్కెట్లోకి తెచ్చింది. ఆరుబయట పచ్చిక మీద పరుచుకుని సేదదీరడానికి, ఆరుబయట విందు వినోదాలు చేసుకునేటప్పుడు కుర్చీ మీద అమర్చుకోవడానికి వీలుగా ఈ సోలార్ సీటును రూపొందించింది. చలికాలంలో ఎండ సోకుతున్నా, చలి తీవ్రత ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సోలార్ సీటు మీద కూర్చుంటే, దీని వెనుకవైపు ఉన్న సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు ఈ సీటు బ్యాటరీకి చేరుతుంది. దీనిని ఆన్ చేసుకుంటే, ఈ సీటు క్షణాల్లోనే వెచ్చబడుతుంది. బయట ఎంత చల్లని వాతావరణం ఉన్నా, కాస్త ఎండసోకే చోటు ఈ సోలార్ సీటును అమర్చుకుని, కూర్చుంటే చాలు.. చలికాలాన్ని వెచ్చగా ఆస్వాదించవచ్చు. దీని ధర 249 డాలర్లు (రూ.20,763) మాత్రమే! -
‘ఈవీ’ ఏటీఎం.. ఏపీలో 12 సౌర విద్యుత్ చార్జింగ్ కేంద్రాలు
సాక్షి, అమరావతి: విద్యుత్ వాహనాల (ఈవీల) కోసం రాష్ట్రంలో అత్యాధునిక సౌర విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. వాహనాల యజమానులు ఈ సౌర చార్జింగ్ కేంద్రాల్లో కార్డు ద్వారా వారే డబ్బులు చెల్లించి, వారే వాహనానికి చార్జింగ్ పెట్టుకోవచ్చు. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఈ చార్జింగ్ కేంద్రాలకు అనుమతినిచ్చింది. తొలుత అనంతపురం, విజయవాడ, తిరుపతి నగరాల్లో 12 కేంద్రాలకు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. ఈ నగరాల్లో సౌర విద్యుత్ ప్యానళ్లతో చార్జింగ్ కియోస్‌్కలను రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) ఏర్పాటు చేస్తుంది. ఏటీఎం కార్డు ద్వారా డబ్బు చెల్లించి వాహనదారుడే చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) చేస్తుంది. రానున్న కాలం ‘ఈవీ’లదే దేశంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు 2030 నాటికి 30% విద్యుత్ కార్లు, 80 శాతం విద్యుత్ టూ వీలర్లు, 70 శాతం విద్యుత్ కమర్షియల్ వెహికల్స్ ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా 1 గిగా టన్ కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా వేసింది. దీంతోపాటు ఇంధనం దిగుమతులు తగ్గించటం ద్వారా 330 బిలియన్ డాలర్ల ఖర్చు తగ్గుతుంది. రానున్న ఎనిమిదేళ్లల్లో 66 శాతం వాహనదారులు విద్యుత్ వాహనాలనే వాడతారని ఈవీ మార్కెట్‌పై తాజా అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ వినూత్న చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఏడాదిలో 250 కేంద్రాలు దేశంలో 2070 నాటికి ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక ప్రయోజనాల కోసం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లాలని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పెట్రోల్, డీజిల్ చార్జీలు భారంగా ఉన్న దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలకు సహాయం చేయడానికి, స్థిరమైన రవాణాను అభివృద్ధి చేయడానికి రాష్ట్రం అంతటా చార్జింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 110 చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు, నగరాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తెచ్చేందుకు నెడ్‌క్యాప్ ప్రణాళికలు తయారు చేసింది. ప్రైవేట్ భూ యజమానులతో కలిసి 4 వేల లొకేషన్లను గుర్తించింది. రాష్ట్రంలో ఏడాదిలో 250 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వాయిదా పద్థతిలో లక్ష ఈ–వాహనాల పంపిణీతో పాటు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రోత్సాహకాలనిస్తోంది. ఖర్చు తక్కువ విద్యుత్ వాహనాలకు బ్యాటరీ చార్జింగ్, మెయింటెనెన్స్, ఆపరేషన్ ఖర్చులు తక్కువ. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఈవీలు సురక్షితమైనవి కూడా. రాష్ట్రంలో సుమారు 40 వేల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి. వాటితో పాటు భవిష్యత్‌లో పెరగనున్న ఈవీలన్నిటి కోసం చార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నాం. – కె విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
కశ్మీర్.. సోలార్ పవర్.. లగ్జరీ కారు
కశ్మీర్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు పదకొండేళ్లు శ్రమించి సామాన్యులకు లగ్జరీ ఫీచర్లు ఉండే అధునాతన కారును రూపొందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కారు నడిచేందుకు పెట్రోలు, డీజిల్ కాకుండా సౌరశక్తినే వినియోగించుకోవడం మరో విశేషం. కశ్మీర్‌లోని శ్రీనగర్‌కి చెందిన బిలాల్ అహ్మద్ వృత్తిరీత్య గణిత శాస్త్ర బోధకుడు. అయితే చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీపై మక్కువ ఎక్కువ. ముఖ్యంగా లగ్జరీ కార్లు అందులో ఫీచర్లను ఎక్కువగా ఇష్టపడేవాడు. అయితే తనలాంటి సామాన్యులకు లగ్జరీ కార్లు అందుబాటులో లేకపోవడం లోటుగా తోచింది. దీంతో ఇంటర్నెట్లో వీడియోల ద్వారా సమాచారం సేకరిస్తూ సాధారణ కారుకే లగ్జరీ సౌకర్యాలు అమర్చే పనిలో పడ్డాడు. సామాన్యులకు లగ్జరీ ఫీచర్లతో కారును తీసుకురావలే ఆశయంతో 2009 నుంచి బిలాల్ అహ్మద్ పని చేస్తున్నాడు. పదకొండేళ్ల శ్రమ ఫలించి ఇటీవల మోడిఫైడ్ లగ్జరీ ఫీచర్లతో కూడిన కారు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కారులో లగ్జరీ ఫీచర్లకు తోడు మరొకటి ఫీచర్ కూడా జతయ్యింది. అదే సోలార్ పవర్. బడ్జెట్ ధరలో అధునాత కారు కోసం శ్రమించే క్రమంలో సోలార్ పవర్‌తో కారును తయారు చేసేందుకు బిలాల్ శ్రమించాడు. సౌర శక్తి కోసం కారుకు నలువైపులా సోలార్ ప్యానెళ్లు అమర్చాడు. అదే విధంగా పైకి తెరుచుకునే డోర్లు ఈ కారుకు కొత్త లుక్ తీసుకువచ్చాయి. Valleys first Solar car A Kashmiri mathematician teacher Bilal Ahmed innovated a solar car pic.twitter.com/F6BAx2JVFN — Basit Zargar (باسط) (@basiitzargar) June 20, 2022 చదవండి: ఎలక్ట్రిక్ బైక్ మంటలు, లెక్కలు తేలాల్సిందే: కంపెనీలకు నోటీసులు -
ప్రపంచంలో తొలి సోలార్ పవర్ కారు.. విశేషాలు ఇవే
జమానా అంతా పెట్రోల్/డీజిల్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ కార్ల గురించి ఆలోచిస్తుంటూ నెదర్లాండ్స్‌కి చెందిన ఓ కంపెనీ మరో అడుగు ముందుకు వేసి సోలార్ కారుకి రూపకల్పన చేసింది. సరికొత్తగా డిజైన్ చేసిన ఈ సోలార్ కారు పైసా ఖర్చు లేకుండా అదనపు మైలేజీని అందిస్తుంది. ఈ కారుకి లైట్‌ఇయర్ జీరోగా పేరు పెట్టారు. ప్రస్తుతం మేజర్ కార్‌మేకర్ కంపెనీలో ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి పెట్టారు. సరికొత్త మోడల్స్‌ని మార్కెట్లోకి తెస్తున్నారు. అయితే ఇంటి బయట ఛార్జింగ్ స్టేషన్ల సమస్య ఇప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్‌ను వేధిస్తూనే ఉంది. దీంతో ఈవీ వెహికల్స్‌కి అదనపు మైలేజీ అందివ్వడం ద్వారా ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడే అవకాశం తగ్గించాలనే కాన్సెప్టుతో ఈ సోలార్ ఎలక్ట్రిక్ కారుని డిజైన్ చేశారు. ఫస్ట్ ఈవీనే లైట్ ఇయర్ జీరో కారు స్వహతాగా ఎలక్ట్రిక్ కారు. 60 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. సింగిల్ ఛార్జ్‌తో 625 కి.మీ మైలేజీ అందిస్తుంది. పది సెకన్లలో వంది కి.మీ వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 160 కి.మీలు. అయితే అన్ని ఈవీ కార్లకు ఉండే ఛార్జింగ్ సమస్యను అధిగమించేందుకు దీనికి సోలార్ పవర్‌ను జత చేశారు. గత ఆరేళ్లుగా ఈ కాన్సెప్టుపై పని చేయగా తొలి కారుకి ఇప్పుడు తుది రూపం వచ్చింది. సోలార్ బెనిఫిట్స్ లైట్‌ఇయర్ జీరో బాడీలో రెండు చదరపు మీటర్ల అధునాత సోలార్ ప్యానెళ్లను అమర్చారు. వీటి సాయంతో బ్యాటరీలు ఛార్జింగ్ అవుతాయి. ఫలితంగా అదనంగా కనీసం 50 కి.మీ మైలేజీ లభిస్తుంది. ఇలా వచ్చే అదనపు మైలేజీకి కనీస ఖర్చు కూడా ఉండకపోవడం విశేషం. బయటకు వెళితే ఛార్జింగ్ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ధర ఎంతంటే లైట్ ఇయర్ జీరో కారు ధరను 2,50,00 డాలర్లుగా నిర్ణయించారు. తొలి ఏడాది 974 యూనిట్ల కార్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటికి యూరప్ మార్కెట్లో సింహభాగం తామే ఆక్రమిస్తామని లైట్ ఇయర్ జీరో మేకర్స్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: టెస్లాలో ఉంటే సేఫ్! కావాంటే మీరే చూడండి -
విద్యార్థుల వినూత్న కృషి
బొబ్బిలి రూరల్ : ఇంజినీరింగ్ విద్యార్థుల అద్భుత కృషితో సోలార్ పవర్డ్ వెహికల్ తయారైంది. ఈ వెహికల్‌ను రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని మంగళవారం మండలంలో కోమటపల్లి తాండ్ర పాపారాయ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభించారు. ఈ వాహనంపై మంత్రి మృణాళిని, ఆమె భర్త గణపతిరావు, జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి, మున్సిపల్ చైర్పర్సన్ తూముల అచ్యుతవల్లి ప్రయాణించారు. ప్రస్తుతం సోలార్, బ్యాటరీతో నడిచే ఈ వాహనం సోలార్‌తో నడిచే విధంగా రూపు దిద్దడానికి ఏర్పాట్లు చేçస్తున్నారు. రూ.1,50,000లతో తయారైన ఈ వాహనానికి ఒకసారి చార్జి చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఎనిమిది మంది ప్రయాణించే ఈ వాహనంపై ప్రయాణించడానికి కిలోమీటరుకు 25పైసలు ఖర్చు కానుండగా, బ్యాటరీ నాలుగేళ్లు పని చేస్తుంది. దీనిని ట్రిపుల్ఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచ్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు వంగపండు త్రివేణి, ఆర్.భరత్, జగదీష్, దిలీప్, కిషోర్, దిలీప్, విజయ్, వంశీ,ఆర్. శివసాయి, బాబు, ఎస్.శివ, సాయిరాం, కె.శ్రీనివాసరావు తయారుచేయగా, వీరికి ప్రిన్సిపాల్ డాక్టర్ జాషువాజయప్రసాద్, హెచ్వోడీలు బి.వెంకటరమణ, పి.కృపారావు, ఎన్.గణేష్ సహకరించారు.