సోలార్‌ సీట్లు.. ఇలా కూడా వినియోగించుకోవచ్చా? | Did You Know How To Gosun Solar Powered Heated Seat | Sakshi
Sakshi News home page

సోలార్‌ సీట్లు.. ఇలా కూడా వినియోగించుకోవచ్చా?

Published Sun, Dec 24 2023 2:19 PM | Last Updated on Sun, Dec 24 2023 2:21 PM

Did You Know How To Gosun Solar Powered Heated Seat - Sakshi

సోలార్‌ ఉత్పత్తులను తయారు చేసే అమెరికన్‌ కంపెనీ తాజాగా సోలార్‌ సీటును మార్కెట్‌లోకి తెచ్చింది. ఆరుబయట పచ్చిక మీద పరుచుకుని సేదదీరడానికి, ఆరుబయట విందు వినోదాలు చేసుకునేటప్పుడు కుర్చీ మీద అమర్చుకోవడానికి వీలుగా ఈ సోలార్‌ సీటును రూపొందించింది.

చలికాలంలో ఎండ సోకుతున్నా, చలి తీవ్రత ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సోలార్‌ సీటు మీద కూర్చుంటే, దీని వెనుకవైపు ఉన్న సోలార్‌ ప్యానెల్‌ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు ఈ సీటు బ్యాటరీకి చేరుతుంది. దీనిని ఆన్‌ చేసుకుంటే, ఈ సీటు క్షణాల్లోనే వెచ్చబడుతుంది.

బయట ఎంత చల్లని వాతావరణం ఉన్నా, కాస్త ఎండసోకే చోటు ఈ సోలార్‌ సీటును అమర్చుకుని, కూర్చుంటే చాలు.. చలికాలాన్ని వెచ్చగా ఆస్వాదించవచ్చు. దీని ధర 249 డాలర్లు (రూ.20,763) మాత్రమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement