బొబ్బిలి రూరల్ : ఇంజినీరింగ్ విద్యార్థుల అద్భుత కృషితో సోలార్ పవర్డ్ వెహికల్ తయారైంది. ఈ వెహికల్‌ను రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని మంగళవారం మండలంలో కోమటపల్లి తాండ్ర పాపారాయ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభించారు. ఈ వాహనంపై మంత్రి మృణాళిని, ఆమె భర్త గణపతిరావు, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి ప్రయాణించారు. ప్రస్తుతం సోలార్, బ్యాటరీతో నడిచే ఈ వాహనం సోలార్‌తో నడిచే విధంగా రూపు దిద్దడానికి ఏర్పాట్లు చేçస్తున్నారు. రూ.1,50,000లతో తయారైన ఈ వాహనానికి ఒకసారి చార్జి చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
ఎనిమిది మంది ప్రయాణించే ఈ వాహనంపై ప్రయాణించడానికి కిలోమీటరుకు 25పైసలు ఖర్చు కానుండగా, బ్యాటరీ నాలుగేళ్లు పని చేస్తుంది. దీనిని ట్రిపుల్‌ఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచ్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు వంగపండు త్రివేణి, ఆర్.భరత్, జగదీష్, దిలీప్, కిషోర్, దిలీప్, విజయ్, వంశీ,ఆర్. శివసాయి, బాబు, ఎస్.శివ, సాయిరాం, కె.శ్రీనివాసరావు తయారుచేయగా, వీరికి ప్రిన్సిపాల్ డాక్టర్ జాషువాజయప్రసాద్, హెచ్‌వోడీలు బి.వెంకటరమణ, పి.కృపారావు, ఎన్.గణేష్ సహకరించారు.
విద్యార్థుల వినూత్న కృషి
Published Wed, Mar 8 2017 3:08 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
Advertisement