సోలార్ పవర్‌తో ఈవీ ఛార్జింగ్.. ఇది కదా మనకు కావాల్సింది | IIT Jodhpur New Innovation For Electric Vehicles | Sakshi
Sakshi News home page

సోలార్ పవర్‌తో ఈవీ ఛార్జింగ్.. ఇది కదా మనకు కావాల్సింది

Published Sat, Jun 8 2024 10:32 AM | Last Updated on Sat, Jun 8 2024 11:09 AM

IIT Jodhpur New Innovation For Electric Vehicles

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్యూయెల్ కార్ల మెయింటెనెన్స్ కంటే.. ఈవీల వినియోగానికి ఖర్చు తక్కువే అయినప్పటికీ.. ఛార్జింగ్ టైమ్ అనేది వాహన వినియోగదారులకు ఓ సమస్యగా ఏర్పడింది. ఈ సమస్యకు ఐఐటీ-జోధ్‌పూర్ ఓ చక్కని పరిష్కారం చూపింది. ఇంతకీ ఆ పరిష్కారం ఏంటి? ఛార్జింగ్ సమయాన్ని ఎలా తగ్గిస్తుంది? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..

ఐఐటీ-జోధ్‌పూర్ ఎలక్ట్రిక్ కార్ల కోసం ఓ స్పెషల్ అడాప్టర్‌ను అభివృద్ధి చేసింది. దీంతో వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను సౌర శక్తిని ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రజలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో రీఛార్జ్ చేసుకునే వ్యవస్థను రూపొందించాలని నరేంద్ర మోదీ గతంలో వెల్లడించిన మాటలను ఐఐటీ-జోధ్‌పూర్ నిజం చేసింది.

రూ.1,000 కంటే తక్కువ ధర వద్ద లభించే ఈ అడాప్టర్ సోలార్ ప్యానెల్ కార్యక్రమం విజయవంతమైతే.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు తమ వాహనాలను ఛార్జింగ్ వేసుకోవడానికి ప్రత్యేకంగా వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఐఐటీ జోధ్‌పూర్‌ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ తెలిపారు.

ఈ అడాప్టర్ అన్ని రకాల వాహనాలలో పని చేస్తుందని, దీనికి సంబంధించిన ప్రోటోటైప్‌ను రూపొందించి విజయవంతంగా పరీక్షించామని, త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని కుమార్ తెలిపారు. కొండలు, మారుమూల ప్రాంతాల్లో కనీస ఛార్జింగ్ సదుపాయాలు లేని ప్రాంతాల్లో కూడా ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది.

ఒకవైపు ఛార్జింగ్ అడాప్టర్ సోలార్ ప్యానెల్‌కు, మరోవైపు కంపెనీ అందించిన ఛార్జర్‌కు కనెక్ట్ అవుతుంది. దీంతో అవసరానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా సరఫరా అవుతుందని ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ అన్నారు. అమెరికా, కెనడా, చైనా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నాయని చెప్పారు.

ఈ ప్లాన్‌లో సోలార్ సాకెట్‌తో.. సోలార్ ప్యానెల్‌ను వాహనాలలో ఉంచే బాధ్యత ఈవీ కంపెనీలదేనన్నారు. రాబోయే ఐదేళ్లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ఓ సవాలుతో కూడుకున్న పని, కాబట్టి అడాప్టర్ సోలార్ ప్యానెల్‌ అద్భుతంగా పనిచేస్తుందని నిశాంత్ కుమార్ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement