న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత్‌లో రూ.20,000 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. తమిళనాడులో వచ్చే 10 ఏళ్లలో ఈ మొత్తాన్ని దశలవారీగా వెచ్చించనున్నట్టు తెలిపింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ అభివృద్ధి, వాహనాల ప్లాట్‌ఫామ్స్ ఆధునీకరణకు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది.
దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా తమిళనాడు ప్లాంటును ఈవీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. 1,78,000 యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు హ్యుందాయ్ తెలిపింది.
అయిదేళ్ల వ్యవధిలో ప్రధాన రహదార్లలోని కీలక ప్రదేశాలలో 100 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. హ్యుందాయ్ వార్షిక తయారీ సామర్థ్యం 8.5 లక్షల యూనిట్లకు పెంచాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment