ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు ఐఫోన్‌లను తయారీ చేసి సరఫరా చేసే ఫాక్స్‌కాన్ టెక్నాలజీ సంస్థ భారత్ రెండు మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 500 మిలియన్ల పెట్టుబడి పెట్టే యోచనలో ఉందంటూ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
ఫాక్స్‌కాన్ ఈ తయారీ యూనిట్లను కర్ణాటకలో నిర్మించనుండగా..ఒక ఫ్యాక్టరీ ఐఫోన్‌ల తయారీ, రెండో ఫ్యాక్టరీలో యాపిల్‌కు విడిభాగాలు ఉత్పత్తి చేయనుందని నివేదిక పేర్కొంది. అయితే, ఏ రాష్ట్రంలో ఫ్యాక్టరీలను నిర్మించాలనే అంశంపై ఫాక్స్‌కాన్ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ప్రాంతం ఎక్కడనేది నిర్ణయించలేదు. ఈ వారంలో ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన అనువైన ప్రాంతంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో కర్నాటకలో ఫాక్స్ కాన్ యూనిట్ కోసం 80 బిలియన్ రూపాయల ($972.88 మిలియన్లు) పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది.
చైనా కంటే భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ కంపెనీ సిద్ధమైంది. తమిళనాడులో ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల తయారీ కేంద్రంలో 16 బిలియన్లను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది. తద్వారా 6,000 మందికి ఉపాధి కలగనుంది.
కాగా, ఫాక్స్ కాన్ తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని కాంచీపురం జిల్లాలో నిర్మించనుందని తెలుస్తోంది. దీనిపై ఫాక్స్‌కాన్, తమిళనాడు ప్రభుత్వాలు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
ఇదీ చదవండి : చైనాను వద్దనుకొని వచ్చేస్తోంది?.. భారత్‌లో ఫాక్స్‌కాన్ 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులు
Comments
Please login to add a commentAdd a comment