ఎలక్టాన్రిక్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ’ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్’ సంస్థ సౌత్ తైవాన్‌లో ఎలక్ట్రిక్ విభాగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
ఫాక్స్‌కాన్ తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ కోసం రాబోయే మూడేళ్లలో తైవాన్‌లో 820 మిలియన్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే సౌత్ తైవాన్ Kaohsiung Cityలో ఫాక్స్‌కాన్ ఎలక్ట్రిక్ బస్సులు, ఈవీ బ్యాటరీలు తయారు చేసే ప్లాంట్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో ఫాక్స్‌కాన్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధులు తెలిపారు.
కాగా, ఫాక్స్ కాన్ సంస్థ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన ఐఫోన్‌లను తయారు చేసే ప్రధాన ఉత్పత్తి దారుల్లో ఒకటిగా నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఇదే సంస్థ ఐఫోన్‌ల తయారీ యూనిట్లును నెలకొల్పేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment