Foxconn plant
-
రూ.8,357 కోట్లతో అసెంబ్లింగ్ యూనిట్!
స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే మాడ్యుళ్ల అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్ సంస్థ యోచిస్తోంది. తమిళనాడులో ప్రారంభించాలనుకుంటున్న ఈ యూనిట్ ఏర్పాటు కోసం సుమారు ఒక బిలియన్ డాలర్లు(రూ.8,357 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు.ఫాక్స్‌కాన్ ఇప్పటికే తమిళనాడులో యాపిల్ ఐఫోన్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటిని దేశీయంగా వాడడంతోపాటు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తాజాగా ప్రతిపాదించిన యూనిట్ అందుబాటులోకి వస్తే చైనా వంటి దేశాల నుంచి అసెంబ్లింగ్ చేసిన డిస్ప్లే మాడ్యూల్స్‌ను దిగుమతి చేసుకునే బదులుగా స్థానికంగానే వీటిని ఉత్పత్తి చేయవచ్చు. దాంతో ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు పేర్కొన్నారు. ఈ యూనిట్ ఎలక్ట్రానిక్ అసెంబ్లీ, తయారీలో ఫాక్స్‌కాన్‌కు విలువ జోడిస్తుందని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ అసెంబ్లింగ్‌లో దాదాపు 5 శాతం రెవెన్యూ ఉత్పత్తి అయితే, డిస్ప్లే అసెంబ్లింగ్‌లో అదనంగా మరో 2-3 శాతం రెవెన్యూ ఉత్పత్తి అవుతుందని నిపుణులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?ఫాక్స్‌కాన్ భారత్‌లో గూగుల్ పిక్సెల్ ఫోన్లను కూడా అసెంబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు ఇరు కంపెనీల మధ్య కొంతకాలంగా చర్యలు సాగుతున్నాయి. డిస్ప్లే మాడ్యూళ్లలో ప్రధానంగా 60-65% విడిభాగాలు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. దక్షిణ కొరియా 20-25% సరఫరా చేస్తోంది. స్థానికంగా డిస్ప్లే అసెంబ్లింగ్ యూనిట్ ప్రారంభమైతే దిగుమతులు తగ్గి స్థానిక అవసరాలు తీర్చుకునే వెసులుబాటు ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
భారత్‌లో ఐప్యాడ్ తయారీ..?
భారత్‌లో యాపిల్ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఫాక్స్‌కాన్ తన కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు యూనిట్లో యాపిల్ ఐఫోన్లను తయారుచేస్తున్న కంపెనీ త్వరలో ఐప్యాడ్లను కూడా అసెంబుల్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ మేరకు త్వరలో కంపెనీ నుంచి ప్రకటన విడుదల కావొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు.యాపిల్ భారత్‌లో మరిన్ని ఉత్పత్తులను తయారుచేసేందుకు ఆసక్తిగా ఉందని గతంలోనే ప్రకటించింది. ఇప్పటికే ముంబయి, దిల్లీలో ప్రత్యేకంగా యాపిల్ అవుట్లెట్లను ప్రారంభించింది. తమిళనాడులో ఫాక్స్‌కాన్ ద్వారా ఐఫోన్లను తయారు చేస్తోంది. ఆ యూనిట్‌లోని పరికరాల్లో కొన్నింటిని అప్‌గ్రేడ్ చేసి ఐప్యాడ్లను తయారు చేయవచ్చని నిపుణులు సూచించినట్లు తెలిసింది. అందుకు సంస్థ కూడా ఆమోదం తెలిపిందని కొందరు అధికారులు చెప్పారు. త్వరలో దీనిపై కంపెనీ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. యాపిల్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పూర్తిగా చైనాపైనే ఆధారపడకుండా విభిన్న ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఐప్యాడ్ తయారీలో కొంత భాగాన్ని గత సంవత్సరం వియత్నాంకు మళ్లించారు.తమిళనాడులో కొత్త యూనిట్ కోసం భారత్‌కు చెందిన ఓ సంస్థ రూ.1,200 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఫాక్స్‌కాన్ ఫిబ్రవరిలో ప్రకటించింది. బడ్జెట్ 2024-25లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీను 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. దాంతో దేశీయ తయారీకి ప్రోత్సహం లభించనుంది. యాపిల్ సంస్థ ఫాక్స్‌కాన్ ద్వారా భారత్‌లో ఐప్యాడ్ల ఉత్పత్తి ప్రారంభిస్తే స్థానికంగా మరింత మంది ఉపాధి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు అంతర్జాతీయంగా భారత్‌లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) వల్ల కూడా దేశీయ తయారీని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!ట్రెండ్‌ఫోర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ బోయ్స్ ఫ్యాన్ మాట్లాడుతూ..‘భారత్‌లో ఐప్యాడ్ ఉత్పత్తిని చేపట్టడం వల్ల సప్లై-చైన్ డిమాండ్‌ను భర్తీ చేయవచ్చు. దేశీయంగా యాపిల్ ఉత్పతులకు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఐప్యాడ్ ఎగుమతులు 49 మిలియన్ల(4.9 కోట్లు)కు చేరుకుంటాయని అంచనా’ అని తెలిపారు. -
వివాహిత మహిళలకు నో జాబ్..
-
వివాహితులకు ‘నోజాబ్’ అంటూ ఫాక్స్‌కాన్‌పై ప్రచారం.. ఎందుకంటే?
చెన్నై: వివాహితులకు ‘నోజాబ్’ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ ఖండించింది. తాము నియమించుకున్న ఉద్యోగుల్లో 25 తం మంది వివాహుతలైన మహిళలే ఉన్నారని స్పష్టం చేసింది.తమిళనాడులోని చెన్నై కేంద్రంగా ఫాక్స్‌కాన్ సంస్థ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్లను తయారు చేస్తుంది. అయితే ఇటీవల ఐఫోన్ తయారీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో మరికొంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. కానీ దీనిపై ప్రచారం మరోలా జరిగినట్లు తెలుస్తోంది. ఫాక్స్‌కాన్ యాజమాన్యం వివాహితులైన మహిళల్ని నియమించుకోవడం లేదనే పుకార్లు షికార్లు చేశాయి. ఈ ప్రచారంతో అప్రమత్తమైన కేంద్రం ఫాక్స్‌కాన్‌లో జరిగిన నియామకాలపై వెంటనే తమకు సమగ్ర సమాచారాన్ని అందించాలని తమిళనాడు కార్మిక శాఖకు ఆదేశాలు జారీచేసింది. ఉద్యోగుల నియామకంపై ఫాక్స్‌కాన్ వివరణ ఇచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాలు ఆధారంగా తమ ఐఫోన్ తయారీ ఫ్లాంట్‌లో కొత్తగా ఉద్యోగుల నియామకం జరిగిందని, వారిలో 25 శాతం మంది వివాహిత మహిళలేనని ఫాక్స్‌కాన్ ప్రతినిధులు చెప్పారు. ఉద్యోగం రాలేదని అసత్య ప్రచారం చేశారని, ఇలాంటి నిరాధారమైన ప్రచారంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ తయారీ రంగాన్ని దెబ్బతీస్తున్నాయని వారు తెలిపారు.ఇదిలా ఉంటే, ఫాక్స్ కాన్ ఫ్లాంట్‌లో పని చేయడానికి వివాహిత మహిళలను అనుమతించకపోవడంపై పలు మీడియా సంస్థలు (అందులో పీటీఐ) ఆరా తీయగా ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం 70 శాతం మంది మహిళలు, 30 శాతం మంది పురుషులు ఉన్నారు. తమిళనాడు ప్లాంట్ దేశంలో మహిళలు అత్యధికంగా ఉపాధి పొందుతున్న మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌గా పేరు సంపాదించింది. ఇందులో ప్రస్తుతం ఉపాధి పొందుతున్న సిబ్బంది సంఖ్య 45,000 దాటినట్లు ఫాక్స్‌కాన్ ప్రతినిధులు వెల్లడించారు. పలు జాతీయ మీడియా కథనాలు సైతం.. ఫాక్స్ కాన్‌లో ఉద్యోగం రాలేదన్న కారణంతో 5 నుంచి 10 మంది ఈ అసత్య ప్రచారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. -
ఐఫోన్ ప్లాంట్‌లో వివాహితలకు ‘నో జాబ్’.. రంగంలోకి దిగిన కేంద్రం
దేశంలో ఐఫోన్లు, ఇతర యాపిల్ ఉత్పత్తులు తయారు చేసే ఫాక్స్‌కాన్ ప్లాంటులో ఉద్యోగాలకు వివాహిత మహిళలను తిరస్కరించిందని రాయిటర్స్ ఓ సంచలన కథనం వెలువరించింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.1976 నాటి సమాన వేతన చట్టాన్ని ఉటంకిస్తూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, ఉద్యోగ నియామకాల్లో పురుషులు, మహిళల మధ్య ఎటువంటి వివక్ష చేయరాదని చట్టం స్పష్టంగా నిర్దేశిస్తుందని పేర్కొంది. చైన్నై సమీపంలోని ఐఫోన్ ఫ్యాక్టరీలో ఈ వివక్ష కొనసాగుతోందని రాయిటర్స్ బయటపెట్టిన నేపథ్యంలో తమిళనాడు కార్మిక శాఖ నుంచి వివరణాత్మక నివేదికను కోరినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రభుత్వ ప్రకటనపై యాపిల్, ఫాక్స్‌కాన్ యాజమాన్యాలు వెంటనే స్పందించలేదు.రాయిటర్స్ మంగళవారం ప్రచురించిన పరిశోధనాత్మక కథనంలో ఫాక్స్‌కాన్ తమిళనాడులోని చెన్నై సమీపంలోని తన ప్రధాన ఐఫోన్ ప్లాంటులో ఉద్యోగాల కోసం వివాహిత మహిళలను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారని కనుగొంది. పెళ్లైన మహిళలు ఎక్కువ కుటుంబ బాధ్యతలు కలిగి ఉంటారనే కారణంతోనే వారిని క్రమపద్ధతిలో మినహాయిస్తున్నట్లు రాయిటర్స్ గుర్తించింది. రాయిటర్స్ ఇంటర్వ్యూ చేసిన ఫాక్స్‌కాన్ నియామక ఏజెంట్లు, హెచ్ఆర్ వర్గాలు ఇదే విషయాన్ని చెప్పారు. కుటుంబ బాధ్యతలు, గర్భం, అధిక గైర్హాజరును ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో వివాహిత మహిళలను నియమించకపోవడానికి కారణాలుగా పేర్కొన్నారు. -
రూ. 300 కోట్లతో 300 ఎకరాలు! కర్ణాటకలో ఫాక్స్‌కాన్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే?
గత కొంతకాలంగా ఫాక్స్‌కాన్ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి యోచిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ సంస్థ ఇప్పుడు బెంగళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలో రూ. 300కోట్ల పెట్టుబడితో 300 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యాపిల్ కాంట్రాక్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో దీని కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీ బెంగళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలోని దేవనహళ్లి వద్ద 300 ఎకరాల భూమిని సొంతం చేసుకుంది. ఫాక్స్‌కాన్ హాన్ హై టెక్నాలజీ కోసం ఈ స్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి యాపిల్ కంపెనీకి ఫాక్స్‌కాన్ అనేది అతి పెద్ద సప్లయర్. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తరువాత ఈ స్ధలం కంపెనీ స్వాధీనం చేసుకోనున్నట్లు గతంలో కర్నాటక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కమీషనర్ గుంజన్ కృష్ణ చెప్పారు. ఇక ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. కావున సంస్థ భూమిని త్వరలోనే స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలా? ఒక్క నిముషం.. ఇవి తెలుసుకోండి!) కర్నాటక రాష్ట్రంలో రూ. 8 వేల కోట్లతో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం ఫాక్స్‌కాన్‌తో మార్చి 20 వ తేదీన అక్కడి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫెసిలిటీలో సుమారు 50 వేల మందికి ఉపాథి లభిస్తుందని అంచనా. అంతే కాకుండా రానున్న మరో పది సంవత్సరాల్లో మరిన్ని ఉద్యోగాలు ఇందులో లభించే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఇక తెలంగాణాలో కూడా ఫాక్స్‌కాన్ భూమిని కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్‌లోని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిఎస్ఐఐసి) పార్క్‌లో సుమారు 186 ఎకరాలను రూ.196 కోట్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లుగా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎలక్ట్రిక్ విభాగంలో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు!
ఎలక్టాన్రిక్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ’ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్’ సంస్థ సౌత్ తైవాన్‌లో ఎలక్ట్రిక్ విభాగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఫాక్స్‌కాన్ తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ కోసం రాబోయే మూడేళ్లలో తైవాన్‌లో 820 మిలియన్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే సౌత్ తైవాన్ Kaohsiung Cityలో ఫాక్స్‌కాన్ ఎలక్ట్రిక్ బస్సులు, ఈవీ బ్యాటరీలు తయారు చేసే ప్లాంట్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో ఫాక్స్‌కాన్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధులు తెలిపారు. కాగా, ఫాక్స్ కాన్ సంస్థ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన ఐఫోన్లను తయారు చేసే ప్రధాన ఉత్పత్తి దారుల్లో ఒకటిగా నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఇదే సంస్థ ఐఫోన్ల తయారీ యూనిట్లును నెలకొల్పేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. -
భారత్‌లో యాపిల్.. 3లక్షల మందికి ఉద్యోగాలు
చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు కష్టాలు మొదలయ్యాయి. తయారీ, సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో తన తయారీ ఉత్పత్తుల్ని చైనా నుంచి వెలుపలికి మార్చాలని తయారీ దారులకు యాపిల్ సంస్థ సమాచారం ఇచ్చింది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ వైపు దృష్టి పెట్టింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద రెండో కంపెనీగా ఉన్న యాపిల్ నిర్ణయంతో తయారీ సంస్థలు భారత్‌లో తయారీ యూనిట్ల నెలకొల్పేందుకు సిద్ధమయ్యాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరిపిన యాపిల్.. 2024 ఆర్ధిక సంవత్సరం నాటి కల్లా 1,20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందంటూ స్టాఫింగ్ సంస్థ టీమ్ లీజ్ సర్వీస్ ఎకనమిక్స్ టైమ్స్‌కు తెలిపింది. అందులో 40 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించనుండగా.. ఆర్ధిక సంవత్సరం 2026 నాటికి 3 లక్షల మందిని విధుల్లోకి తీసుకోనుంది. వారిలో లక్షమంది ప్రత్యక్షంగా, 2 లక్షల మంది పరోక్షంగా లబ్ధపొందనున్నారు. ఈ సందర్భంగా 36 నెలల్లో ప్లాంట్లు, ఫ్యాక్టరీల ఏర్పాటుతో మరో లక్షమందిని యాపిల్ నియమించుకోనుందని టీమ్ లీజ్ సీఈవో కార్తిక్ నారాయణ్ వెల్లడించారు. ఐటీ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటన గత వారం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ..యాపిల్ సంస్థ కర్ణాటక కేంద్రంగా 300 ఎకరాల్లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను స్థాపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో లక్షల మందికి యాపిల్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రణాళికల్ని సిద్ధం చేయడంతో.. యాపిల్ త్వరలో చైనాకు గుడ్‌బై చెప్పి భారత్‌కు తరలించే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. చదవండి👉 ‘హార్ట్ ఎటాక్’ను గుర్తించే యాపిల్ వాచ్ సిరీస్ 8పై భారీ డిస్కౌంట్లు! -
గుడ్ న్యూస్ చెప్పిన పియూష్ గోయల్.. చైనాకు యాపిల్ షాక్..!
దిగ్గజ మొబైల్స్ తయారీ సంస్థ యాపిల్.. చైనాకు గుడ్ బై చెప్పనుందా..? ఐఫోన్స్ తయారీ హబ్ గా భారత్ వైపు చూస్తోందా..? అంటే అవుననే అంటున్నారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్. ప్రస్తుతం దేశంలో యాపిల్ ఉత్పత్తుల తయారీ 5-7 శాతంగా ఉంది. దీన్ని 25 శాతానికి పెంచాలని అనుకుంటోందట యాపిల్ సంస్థ. సోమవారం జరిగిన వాణిజ్య సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్. పోటీ ప్రపంచంలో తయారీ రంగానికి భారత్ గమ్యస్థానమన్నారు పియూష్. కాలిఫోర్నియాకు చెందిన యాపిల్.. 2017లో విస్ట్రాన్ ద్వారా, ఆ తర్వాత ఫాక్స్‌కాన్‌తో కలిసి దేశంలో ఐఫోన్స్ ను తయారు చేస్తోంది. ఇటీవలే దేశీయంగా తయారైన 14 సిరీస్ ఐఫోన్స్ ను కూడా విడుదల చేసింది. ఇన్నాళ్లు యాపిల్ సంస్థకు అతిపెద్ద తయారీ కేంద్రంగా ఉంది చైనా. అయితే.. కరోనా విజృంభణ, ఆంక్షలు, లాక్ డౌన్స్ బీజింగ్-వాషింగ్టన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు వంటి కారణాలతో చైనాకు గుడ్ బై చెప్పాలనుకుంటోంది యాపిల్ సంస్థ. 2025 నాటికి చైనా వెలుపల 25 శాతం ఉత్పత్తులను తయారు చేయాలని యాపిల్ సంస్థ నిర్ణయించుకున్నట్లు ఆర్థిక విశ్లేషకులు జేపీ మోర్గాన్ వెల్లడించారు. ప్రస్తుతం ఇది 5 శాతంగా ఉంది. -
అయ్యయ్యో ఐఫోన్14: ఫాక్స్‌కాన్‌కు భారీ షాక్, 20వేలమంది పరార్!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ల ఉత్పత్తిదారు భారీ చిక్కుల్లో పడింది. చైనాలోని ఫాక్స్‌కాన్ జెంగ్జౌ ప్లాంట్ మరిన్ని కష్టాల్లో కూరుకుపోతోంది. ఒకవైపు మళ్లీ రికార్డు స్థాయిలో విజృంభిస్తున్న కరోనా, లాక్డౌన్, ఆంక్షలకు తోడు 20వేల మందికి పైగా ఉద్యోగులు కంపెనీనుంచి పారిపోవడంతో ఐఫోన్ల ఉత్పత్తి అగమ్యగోచరంలో పడింది. దీంతో యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురు కానుంది. పైగా వీరంతా దాదాపు కొత్తవారే.. అధిక జీతాలు, బోనస్‌లో ఆఫర్ చేసిన తీసుకున్న వారే కావడం గమనార్హం. 10వేల యువాన్లను (1,396డాలర్లను) తీసుకొని గందరగోళంలో ఉన్న ప్లాంట్‌ను విడిచి పెట్టాలనుకునే ఉద్యోగులకు ఆఫర్ చేసిన తర్వాత ఈపరిణామం చోసుకుంది. ఇప్పటికే ఐఫోన్ల ఉత్పత్తి క్షీణించవచ్చనే అంచానల మధ్య తాజా సంఘటనతో నవంబరు షిప్‌మెంట్స్ 30 శాతానికి పైగా పడిపోతాయనే వార్తలపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఫాక్స్‌కాన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. సంవత్సరాంతపు సెలవుల సీజన్‌కు ముందు ఎలక్ట్రానిక్స్ తయారీదారులు సాధారణంగా బిజీగా ఉండాల్సిన తరుణంలో ఈ పరిణామాలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తిపై భారీ ప్రభావం చూపిస్తాయని ప్రధానంగా యాపిల్ లాంటి సంస్థలకు తీవ్ర దెబ్బ అని మార్కెట్ నిపుణులుఅంచనా వేస్తున్నారు. అలాగే తాజాగా ఉద్యోగుల నిష్క్రణలుతో నవంబర్ చివరి నాటికి పూర్తి ఉత్పత్తిని పునఃప్రారంభించాలనే కంపెనీ లక్క్క్ష్యానికి ఇది విఘాతమేనని పేర్కొన్నారు. ప్రప్రపంచవ్యాప్తంగా 70శాతం ఐఫోన్ షిప్మెంట్లను ఇక్కడినుంచే ఉత్పత్తి చేస్తోంది. ఫాక్స్‌కాన్ ఈ నెల ప్రారంభంలో బోనస్‌లు, అధిక జీతాలను అందజేస్తూ హైరింగ్ డ్రైవ్‌ను ప్రారంభించింది. అయినా ఫలితం దక్కడం లేదు. మరోవైపు ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో జీరో కోవిడ్ పేరుతో విధించిన ఆంక్షలు ఉద్యోగుల్లో అసహనాన్ని రగిలించాయి. దీంతో విసుగెత్తిన ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగడంతో హింస చెలరేగింది. సరైన వసతులు కల్పించడంలేదని, జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫాక్స్‌కాన్ కంపెనీ క్షమాపణలు కూడా తెలిపిన సంగతి తెలిసిందే. -
యాపిల్ గుడ్‌న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: ఐఫోన్ తయారీదారు యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు అన్ని టెక్ దిగ్గజాలన్నీ ఉద్కోగులకు ఉద్వాసన పలుకుతున్న తరుణంలో ఇండియాలోని ఫ్యాక్టరీలో వర్క్‌ఫోర్స్‌ను నాలుగు రెట్లు పెంచాలని యోచిస్తోంది. ట్విటర్, మెటా, మైక్రోసాఫ్ట్,లాంటి దిగ్గజాలు వేలమందిని ఉద్యోగులను తొలగించాయి. తాజాగా అమెజాన్ అదే బాటలో ఉన్న నేపథ్యంలో యాపిల్ నిర్ణయం విశేషంగా నిలిచింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదీ చదవండి: అమెజాన్‌లో పింక్ స్లిప్స్ కలకలం, వేలమందిపై వేటు! చైనాలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ అయిన జెంగ్జౌ ప్లాంట్ వద్ద కఠిన ఆంక్షలు కొనసాగుతోంది. దీంతో అక్కడ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ప్రీమియం ఐఫోన్ 14 మోడళ్ల షిప్మెంట్లను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ డిమాండ్‌ను నెరవేర్చే యోచనలో యాపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్ ఇండియాలోని ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగులను పెంచుకోనుంది. రానున్న రెండేళ్లలో ఇక్కడి ఉద్యోగుల సంఖ్యను నాలుగు రెట్లు పెంచాలని భావిస్తోంది. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని తన ప్లాంట్‌లో వచ్చే రెండేళ్లలో మరో 53వేల మంది కార్మికులను చేర్చుకోవడం ద్వారా వర్క్‌ఫోర్స్‌ను 70వేలకి పెంచాలని యోచిస్తోందని పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాలు వెల్లడించాయి. (ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?) 2019లో తమిళనాడులోని యాపిల్ ఐఫోన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించింది. క్రమంగా ఉత్పత్తిని పెంచుకుంటూ ఈ ఏడాది ఐఫోన్14 ఉత్పత్తిని షురూ చేసింది. అయితే 2 లక్షల కార్మికులున్న జెంగ్జౌ ప్లాంట్‌తో పోలిస్తే ఇది చిన్నదే అయిన్పటికీ చైనా తరువాత ఇది చాలా ప్రధానమైంది. అయతే తాజావార్తలపై ఫాక్స్‌కాన్, యాపిల్ స్పందించేందుకు నిరాకరించాయి. (క్లిక్:StockMarketClosing: బుల్ ర్యాలీ, జోష్‌కు ఐదు కారణాలు) -
యాపిల్: వివాదాస్పద ఐఫోన్ ప్లాంట్ మళ్లీ ఓపెన్
యాపిల్ కంపెనీ సప్లయిర్‌గా ఉన్న ఫాక్స్‌కాన్, తమిళనాడులోని వివాదాస్పద ప్లాంట్‌ను తిరిగి తెరిచేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. జనవరి 12న ఈ ప్లాంట్‌లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుందని స్థానిక ప్రజాప్రతినిధితో పాటు అధికారులు సైతం ప్రకటించడం విశేషం. శ్రీ పెరుంబుదూర్‌లో ఉన్న ఈ ఐఫోన్ అసెంబ్లింగ్ సెంటర్ బయట ఉన్న ఓ వసతి గృహంలో ఆహారం కల్తీ కావడంతో సుమారు 159 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై రోడ్డెక్కిన ఉద్యోగులు భారీ ఎత్తున్న ఆందోళన చేపట్టగా.. ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఫాక్స్‌కాన్‌ను హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాదు ప్రమాణాలకు తగ్గట్లు వసతి గృహాలు లేవనే ఆరోపణల్ని సైతం ఒప్పుకుంది. 2021 డిసెంబర్ 18న ఈ ఘటన జరగ్గా.. డిసెంబర్ 30నే తిరిగి ప్లాంట్‌ను తెరవాల్సి ఉంది. అయితే ప్రమాణాలు మెరుగుపర్చడం అనే కారణంతో నిర్ణయాన్ని మరికొంత కాలం వాయిదా వేసింది ఫాక్స్‌కాన్. ఈ లోపు యాజమాన్యాన్ని మార్చడంతో పాటు ఉద్యోగులకు, కార్మికులకు మూతపడిన కాలానికి జీతాలు సైతం చెల్లించింది. ఇదీ చదవండి: ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందా? ‘ప్లాన్-బి’ ఉందిగా! -
నిర్లక్ష్యంగా ఉంటామంటే చూస్తూ ఊరుకోం.. యాపిల్ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఉద్యోగులకు ఆహార, వసతి సదుపాయాల్లో లోపాలపై వివాదం నేపథ్యంలో ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌కు చెందిన తమిళనాడు ప్లాంటును ప్రొబేషన్‌లో (పరిశీలన) ఉంచినట్లు టెక్ దిగ్గజం యాపిల్ వెల్లడించింది. కఠినమైన ప్రమాణాలను అమలుపర్చిన తర్వాతే యూనిట్ తిరిగి తెరుచుకునేలా చూస్తామని పేర్కొంది. ‘మా సరఫరాదారులకు పరిశ్రమలోనే అత్యుత్తమ ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇందుకోసం మేము తరచూ వాటి పనితీరును మదింపు చేస్తుంటాం. ఇదే క్రమంలో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంటులో నిర్వహించిన తనిఖీల్లో ఉద్యోగుల డార్మిటరీలు, డైనింగ్ రూమ్‌లు మా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. దీంతో ప్లాంటును ప్రొబేషన్‌లో ఉంచాం. సరఫరాదారు వేగవంతంగా దిద్దుబాటు చర్యలు తీసుకునేలా చూస్తున్నాం‘ అని యాపిల్ ప్రతినిధి తెలిపారు. మరోవైపు, అత్యుత్తమ ప్రమాణాలు పాటించే దిశగా స్థానిక మేనేజ్మెంట్ బృందాన్ని, వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యకలాపాలు పునఃప్రారంభించడానికి పట్టే కాలావధిలో ఉద్యోగులకు యథాప్రకారం వేతనాల చెల్లింపు కొనసాగుతుందని తెలిపింది. ఉద్యోగుల ఆందోళన యాపిల్‌కు ఫాక్స్‌కాన్ ఐఫోన్లను తయారు చేసి అందిస్తోంది. కంపెనీకి శ్రీపెరంబుదూర్‌లో ఉన్న ప్లాంటు ఉద్యోగులకు సంబంధించిన డార్మిటరీలో విషాహార ఉదంతం చోటుచేసుకోవడంతో సిబ్బంది ఇటీవల ఆందోళనలకు దిగారు. దీంతో ప్లాంటు మూతబడింది. ఆహారం, వసతి విషయంలో ఆందోళన వ్యక్తమవడంతో యాపిల్ స్వంతంగా ఆడిటర్లను పంపించి, పరిశీలించింది. ఫాక్స్‌కాన్ దిద్దుబాటు చర్యలతో డిసెంబర్ 30 నాటికి ప్లాంటు తిరిగి తెరుచుకుంటుందనే అంచనాలు నెలకొన్నప్పటికీ.. తాజా పరిణామంతో ఈ విషయంలో మరింత జాప్యం జరగవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చదవండి:ఒక్కొక్కరికి రూ.కోటిన్నర దాకా బోనస్!.. వలసలను అడ్డుకునేందుకు టెక్ దిగ్గజాల పాట్లు -
భారత్‌లో ఐఫోన్ 11 తయారీ
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా తమ ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్లను తమిళనాడులోని ఫాక్స్‌కాన్ ప్లాంటులో ప్రారంభించింది. భారత్‌లో తయారవుతున్న ఐఫోన్ మోడల్స్‌లో ఇది అయిదోది. ‘2020లో ఐఫోన్ 11, 2019లో ఐఫోన్ 7.. ఎక్స్ఆర్, 2018లో ఐఫోన్ 6ఎస్, 2017లో ఐఫోన్ ఎస్ఈ. దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ వ్యవస్థను నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన తీరుకు ఇదే నిదర్శనం‘ అంటూ కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ .. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో ఫాక్సా్కన్ గత కొన్ని నెలలుగా ఐఫోన్ 11ని అసెంబుల్ చేస్తోందని, గత నెల నుంచి ఇవి మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ ఎక్స్ఆర్ ఫోన్లను కూడా ఫాక్స్‌కాన్ తయారు చేస్తుండగా, విస్ట్రాన్ సంస్థ ఐఫోన్ 7 స్మార్ట్ఫోన్లను తయారు చేస్తోందని వివరించాయి. -
ఫాక్స్‌కాన్- భారీ పెట్టుబడి, ఉద్యోగాల బాట!
తైవాన్‌లోని తైపీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఫాక్స్‌కాన్ దేశీయంగా బిలియన్ డాలర్ల(రూ. 7500 కోట్లు)ను ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రధానంగా కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ సేవలను అందిస్తుంటుంది. కంపెనీ కస్లమర్లలో యూఎస్ టెక్ దిగ్గజం యాపిల్‌ను ప్రధానంగా పేర్కొనవచ్చు. యాపిల్ తయారీ ఐఫోన్ల అసెంబ్లింగ్‌ను చేపడుతుంటుంది. ఇటీవల యూఎస్, చైనా మధ్య తలెత్తిన వాణిజ్య వివాదాలు, కరోనా వైరస్ తదితర సవాళ్ల నేపథ్యంలో దేశీయంగా తయారీని విస్తరించాలని ఫాక్స్‌కాన్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు ప్రధానంగా యాపిల్ నుంచి ఒత్తిడి(బిజినెస్) పెరుగుతుండటంతో తాజా ప్రణాళికలకు తెరతీసినట్లు తెలియజేశాయి. అయితే కస్లమర్ల విషయాలకు సంబంధించి మాట్లడబోమని ఫాక్స్‌కాన్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ఐఫోన్ XR ప్లాంటులో ఇప్పటికే చెన్పైలోని శ్రీపెరంబూర్ ప్లాంటులో యాపిల్ ఎక్స్ఆర్ మోడల్ ఐఫోన్లను ఫాక్స్‌కాన్ తయారు చేస్తోంది. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా మరిన్ని మోడళ్ల ఐఫోన్లను రూపొందించాలని భావిస్తోంది. తద్వారా చైనాలో ఫాక్స్‌కాన్ చేపడుతున్న ఐఫోన్ తయారీ కార్యకలాపాలను కొంతమేర దేశీయంగా తరలించే యోచనలో ఉన్నట్లు అంచనా. వెరసి ఇక్కడ అదనంగా 6,000 మందికి ఉపాధి కల్పించవలసి ఉంటుందని విశ్లేషకులు తెలియజేశారు. ఇప్పటికే దేశీయంగా స్టార్ట్ ఫోన్ల విక్రయాలలో యాపిల్ ఐఫోన్లు 1 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఏపీలోనూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ప్లాంటు ద్వారా చైనా కంపెనీ షియోమీ కార్ప్‌సహా పలు ఇతర కంపెనీల స్మార్ట్ ఫోన్లను ఫాక్స్‌కాన్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. మరోవైపు బెంగళూరు ప్లాంటులో యాపిల్ ఐఫోన్లలో కొన్ని మోడళ్లను అసెంబ్లింగ్ చేస్తున్న తైవాన్ కంపెనీ విస్ట్రన్ కార్ప్ సైతం ఫాక్స్‌కాన్ తరహా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా యాపిల్ కంపెనీకి చెందిన ఇతర ప్రొడక్టుల తయారీని సైతం చేపట్టాలని యోచిస్తున్నట్లు సంబంధితవర్గాలు వెల్లడించాయి. మేకిన్ ఇండియా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సాహించేందుకు గత నెలలో కేంద్ర ప్రభుత్వం 6.65 బిలియన్ డాలర్ల(రూ. 50,000 కోట్లు) విలువైన ప్రణాళికను ప్రకటించింది. దీనిలో భాగంగా దేశీయంగా స్మార్ట్ ఫోన్ తయారీ కార్యకలాపాలు ప్రారంభిస్తే గ్లోబల్ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించనుంది. వెరసి ప్రధాని మోడీ ప్రకటించిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి మరింత మద్దతు లభించనుంది. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగ కల్పనకు దారి ఏర్పడుతుందని పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
ఏపీలో ఫాక్స్‌కాన్ మరిన్ని పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ ఇండియా శ్రీ సిటీలోని యూనిట్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం శ్రీ సిటీ యూనిట్ ద్వారా సుమారుగా 15 వేల మంది మహిళలకు ఉపాధి కలి్పస్తున్నామని, త్వరలోనే ఈ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఫాక్స్‌కాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జోష్ ఫాల్గర్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైన తరువాత రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. స్థానికులకు ఉపాధి కలి్పంచే విధంగా వారందరికీ వృత్తిపరమైన శిక్షణ ఇచ్చామని, ప్రస్తుతం నెలకు 35 లక్షలకు పైగా మొబైల్స్‌ను విక్రయిస్తున్నట్లు తెలిపారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌లో భాగస్వామ్యం కండి ఎల్రక్టానిక్స్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా రాష్ట్రాన్ని ఎల్రక్టానిక్ హబ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారముంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించడానికి మానవ వనరులను అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ కార్యక్రమంలో ఫాక్స్‌కాన్ భాగస్వామ్యం కావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. ఉత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయడానికి అత్యుత్తమ ప్రమాణాలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కలి్పంచడమే దీని ఉద్దేశమని వెల్లడించారు. -
ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్
సాక్షి, చెన్నై: ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై కన్నేసిన స్మార్ట్‌ఫోన్ మేకర్ ఆపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 నాటికి భారతదేశంలో టాప్ ఎండ్ ఐఫోన్లను తయారీని ప్రారంభించనుంది. ఇందుకోసం భారీ పెట్టుబడులను పెట్టనుంది. తైవాన్ ఎలక్ట్రిక్ దిగ్గజం ఫాక్స్‌కాన్ స్థానిక యూనిట్ ద్వారా ఖరీదైన ఐఫోన్లను అసెంబ్లింగ్ చేయనుంది. ముఖ్యంగా ఐ ఫోన్ ఎక్స్, ఎక్స్ ఎస్, మాక్స్, ఎక్స్ఆర్ లాంటి అతి ఖరీదైన స్మార్ట్ఫోన్లను రూపొందించనుంది. తమిళనాడులో శ్రీపెరంబూర్ ప్లాంట్‌లో ఐఫోన్ ఎక్స్ అసెంబ్లింగ్‌ను సాధ్యమైనంత( వచ్చే ఏడాది ప్రారంభం నుంచి) తొందరగా ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌లోనే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో ఈ యాపిల్ ఫోన్ల అసెంబ్లింగ్‌ను మొదలుపెడ్తామని ఫాక్స్‌కాన్ వెల్లడించింది. సుమారు రూ.2500 కోట్ల పెట్టుబడులను ఆపిల్ పెడుతోంది. మరోవైపు కొత్త విస్తరణ నేపధ్యంలో భారీగా ఉద్యోగవకాశాలు లభిస్తాయని తమిళనాడు ప్రభుత్వం ఆశిస్తోంది. సుమారు 25వేలకు పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి సంపత్ రాయిటర్స్‌తో చెప్పారు. అయితే ఈ వార్తలపై స్పందించడానికి ఆపిల్ ప్రతినిధి తిరస్కరించారు. కాగా విస్ట్రన్ కార్పోరేషన్ ద్వారా బెంగళూరులో ఐ ఫోన్ ఎస్ఈ, ఆర్ఎస్ మోడల్స్ మాత్రమే దేశంలో ఎసంబుల్డ్ చేస్తోంది ఆపిల్ కంపెనీ. అలాగే చెన్నై ప్లాంట్‌లో గతంలో నోకియా ఫోన్లను తయారు చేసిన ఫాక్స్‌కాన్ ప్రభుత్వంతో వచ్చిన విబేధాల కారణంగా 2014లో ఉత్పత్తిని నిలిపివేసింది. రూ.21 వేల కోట్ల పన్ను వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో తాజాగా ఆ ప్లాంట్‌లో ఆపరేషన్స్ మొదలుపెట్టినట్టు సమాచారం. -
శ్రీసిటీలో జియోనీ ఫోన్ల తయారీ
- ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపిన కంపెనీ - తయారీకి మూడేళ్లలో రూ.330 కోట్ల వ్యయం - జియోనీ ఇండియా ఎండీ అరవింద్ వోరా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న జియోనీ ‘మేక్ ఇన్ ఇండియా’ బాటపట్టింది. మొబైల్స్ తయారీ సంస్థలైన ఫాక్స్‌కాన్, డిక్సన్ టెక్నాలజీస్‌తో చేతులు కలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంటుతోపాటు డిక్సన్‌కు చెందిన నోయిడా ప్లాంటులో ఫోన్లు తయారు కానున్నాయి. అక్టోబరులో మేక్ ఇన్ ఇండియా తొలి ఉత్పాదన మార్కెట్లోకి రానుంది. ఫాక్స్‌కాన్ శ్రీసిటీ ప్లాంటులో మూడు అసెంబ్లీ లైన్స్ ఉన్నాయి. తయారీ సామర్థ్యం నెలకు 5 లక్షల యూనిట్లు. డిక్సన్ నోయిడా ప్లాంటులో 9 అసెంబ్లీ లైన్స్ ఉన్నాయి. తయారీ సామర్థ్యం నెలకు 7 లక్షల యూనిట్లు. రెండు ప్లాంట్ల వద్ద జియోనీ ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. వచ్చే మూడేళ్లలో తయారీకి రూ.330 కోట్లు ఖర్చు చేస్తామని జియోనీ ఇండియా ఎండీ అరవింద్ రజనీష్ వోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భారత్ నుంచి విదేశాలకు: చైనాలోని సొంత ప్లాంటులో తయారైన ఫోన్లను జియోనీ దిగుమతి చేస్తోంది. ఇక నుంచి జియోనీ ఎఫ్ సిరీస్, పీ సిరీస్ స్మార్ట్ఫోన్లను ఫాక్స్‌కాన్ శ్రీసిటీ ప్లాంటులో తయారు చేస్తుంది. ఇతర స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లను డిక్సన్ ఉత్పత్తి చేయనుంది. దేశీయంగా తయారీ చేపట్టడం ద్వారా త్వరితగతిన కొత్త మోడళ్లను ఆవిష్కరించేందుకు కంపెనీకి వీలవుతుంది. అలాగే దిగుమతి సుంకాలు ఆదా అవుతాయి. ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంతో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. చైనా వెలుపల తయారీ కేంద్రంగా భారత్‌ను నిలుపుతామని జియోనీ ప్రెసిడెంట్ విలియం లూ పేర్కొన్నారు. నెలకు ఒక మోడల్: భారత్ మార్కెట్లో నెలకు ఒక మోడల్‌ను విడుదల చేయాలని నిర్ణయించినట్టు అరవింద్ తెలిపారు.రూ.8,000 ఆపైన ధరలో వచ్చేవన్నీ 4జీ మోడళ్లని తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ ఫోన్లను విక్రయిస్తామని వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌తోపాటు ఇతర ఇ-కామర్స్ కంపెనీలతో కంపెనీ చర్చలు జరుపుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,750 కోట్ల ఆదాయాన్ని జియోనీ ఇండియా ఆర్జించింది. ఈ ఏడాది రూ.6,000 కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది.