దిగ్గజ మొబైల్స్ తయారీ సంస్థ యాపిల్.. చైనాకు గుడ్ బై చెప్పనుందా..? ఐఫోన్స్ తయారీ హబ్ గా భారత్ వైపు చూస్తోందా..? అంటే అవుననే అంటున్నారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్. ప్రస్తుతం దేశంలో యాపిల్ ఉత్పత్తుల తయారీ 5-7 శాతంగా ఉంది. దీన్ని 25 శాతానికి పెంచాలని అనుకుంటోందట యాపిల్ సంస్థ. సోమవారం జరిగిన వాణిజ్య సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్. పోటీ ప్రపంచంలో తయారీ రంగానికి భారత్ గమ్యస్థానమన‍్నారు పియూష్.
కాలిఫోర్నియాకు చెందిన యాపిల్.. 2017లో విస్ట్రాన్ ద్వారా, ఆ తర్వాత ఫాక్స్‌కాన్‌తో కలిసి దేశంలో ఐఫోన్స్ ను తయారు చేస్తోంది. ఇటీవలే దేశీయంగా తయారైన 14 సిరీస్ ఐఫోన్స్ ను కూడా విడుదల చేసింది.
ఇన్నాళ్లు యాపిల్ సంస్థకు అతిపెద్ద తయారీ కేంద్రంగా ఉంది చైనా. అయితే.. కరోనా విజృంభణ, ఆంక్షలు, లాక్ డౌన్స్ బీజింగ్-వాషింగ్టన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు వంటి కారణాలతో చైనాకు గుడ్ బై చెప్పాలనుకుంటోంది యాపిల్ సంస్థ. 2025 నాటికి చైనా వెలుపల 25 శాతం ఉత్పత్తులను తయారు చేయాలని యాపిల్ సంస్థ నిర్ణయించుకున్నట్లు ఆర్థిక విశ్లేషకులు జేపీ మోర్గాన్ వెల్లడించారు. ప్రస్తుతం ఇది 5 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment