చెన్నై: వివాహితులకు ‘నోజాబ్’ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ ఖండించింది. తాము నియమించుకున్న ఉద్యోగుల్లో 25 తం మంది వివాహుతలైన మహిళలే ఉన్నారని స్పష్టం చేసింది.
తమిళనాడులోని చెన్నై కేంద్రంగా ఫాక్స్‌కాన్ సంస్థ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్‌లను తయారు చేస్తుంది. అయితే ఇటీవల ఐఫోన్ తయారీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌లో మరికొంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. కానీ దీనిపై ప్రచారం మరోలా జరిగినట్లు తెలుస్తోంది. ఫాక్స్‌కాన్ యాజమాన్యం వివాహితులైన మహిళల్ని నియమించుకోవడం లేదనే పుకార్లు షికార్లు చేశాయి. ఈ ప్రచారంతో అప్రమత్తమైన కేంద్రం ఫాక్స్‌కాన్‌లో జరిగిన నియామకాలపై వెంటనే తమకు సమగ్ర సమాచారాన్ని అందించాలని తమిళనాడు కార్మిక శాఖకు ఆదేశాలు జారీచేసింది.
ఉద్యోగుల నియామకంపై ఫాక్స్‌కాన్ వివరణ ఇచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాలు ఆధారంగా తమ ఐఫోన్ తయారీ ఫ్లాంట్‌లో కొత్తగా ఉద్యోగుల నియామకం జరిగిందని, వారిలో 25 శాతం మంది వివాహిత మహిళలేనని ఫాక్స్‌కాన్ ప్రతినిధులు చెప్పారు. ఉద్యోగం రాలేదని అసత్య ప్రచారం చేశారని, ఇలాంటి నిరాధారమైన ప్రచారంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ తయారీ రంగాన్ని దెబ్బతీస్తున్నాయని వారు తెలిపారు.
ఇదిలా ఉంటే, ఫాక్స్ కాన్ ఫ్లాంట్‌లో పని చేయడానికి వివాహిత మహిళలను అనుమతించకపోవడంపై పలు మీడియా సంస్థలు (అందులో పీటీఐ) ఆరా తీయగా ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం 70 శాతం మంది మహిళలు, 30 శాతం మంది పురుషులు ఉన్నారు. తమిళనాడు ప్లాంట్ దేశంలో మహిళలు అత్యధికంగా ఉపాధి పొందుతున్న మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌గా పేరు సంపాదించింది. ఇందులో ప్రస్తుతం ఉపాధి పొందుతున్న సిబ్బంది సంఖ్య 45,000 దాటినట్లు ఫాక్స్‌కాన్ ప్రతినిధులు వెల్లడించారు.
పలు జాతీయ మీడియా కథనాలు సైతం.. ఫాక్స్ కాన్‌లో ఉద్యోగం రాలేదన్న కారణంతో 5 నుంచి 10 మంది ఈ అసత్య ప్రచారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment