చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు కష్టాలు మొదలయ్యాయి. తయారీ, సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో తన తయారీ ఉత్పత్తుల్ని చైనా నుంచి వెలుపలికి మార్చాలని తయారీ దారులకు యాపిల్ సంస్థ సమాచారం ఇచ్చింది.
చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ వైపు దృష్టి పెట్టింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద రెండో కంపెనీగా ఉన్న యాపిల్ నిర్ణయంతో తయారీ సంస్థలు భారత్‌లో తయారీ యూనిట‍్ల నెలకొల్పేందుకు సిద్ధమయ్యాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరిపిన యాపిల్.. 2024 ఆర్ధిక సంవత్సరం నాటి కల్లా 1,20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందంటూ స్టాఫింగ్ సంస్థ టీమ్ లీజ్ సర్వీస్ ఎకనమిక్స్ టైమ్స్‌కు తెలిపింది.
అందులో 40 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించనుండగా.. ఆర్ధిక సంవత్సరం 2026 నాటికి 3 లక్షల మందిని విధుల్లోకి తీసుకోనుంది. వారిలో లక్షమంది ప్రత్యక్షంగా, 2 లక్షల మంది పరోక్షంగా లబ్ధపొందనున్నారు. ఈ సందర్భంగా 36 నెలల్లో ప్లాంట్లు, ఫ్యాక్టరీల ఏర్పాటుతో మరో లక్షమందిని యాపిల్ నియమించుకోనుందని టీమ్ లీజ్ సీఈవో కార్తిక్ నారాయణ్ వెల్లడించారు.
ఐటీ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటన
గత వారం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ..యాపిల్ సంస్థ కర్ణాటక కేంద్రంగా 300 ఎకరాల్లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను స్థాపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో లక్షల మందికి యాపిల్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రణాళికల్ని సిద్ధం చేయడంతో.. యాపిల్ త్వరలో చైనాకు గుడ్‌బై చెప్పి భారత్‌కు తరలించే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి.
చదవండి👉 ‘హార్ట్ ఎటాక్’ను గుర్తించే యాపిల్ వాచ్ సిరీస్ 8పై భారీ డిస్కౌంట్లు!
Comments
Please login to add a commentAdd a comment