Driverless bus
-
ఎక్కడంటే అక్కడ ఆపాలంటూ!
రాయచూర్ వెళ్లే నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సు ఇమ్లీబన్‌లో బయలుదేరింది.. బస్సు కిక్కిరిసిపోయి ఉంది.. బహదూర్‌పుర రాగానే తాము దిగుతామని, బస్సు ఆపాలంటూ ముగ్గురు మహిళలు డ్రైవర్ వద్దకు వచ్చి నిలబడ్డారు. అలా మరికొంత దూరం వెళ్లాక, మరో ఇద్దరు మహిళలు బస్సు ఆపాలంటూ అడిగారు. వాస్తవానికి ఆ బస్సు ఎక్కడా ఆగకుండా రాయచూరుకు వెళ్లాల్సి ఉండగా, ఇలా మహిళల వాదనలు, డిమాండ్లతో పదిహేను చోట్ల ఆపాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాక, ఆర్టీసీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. తాము ఎక్కడ ఆపమంటే బస్సును అక్కడ ఆపాలంటూ ఒత్తిడి చేసు్తన్నారు. ఆ బస్సులకు స్టాప్ లేని చోట్ల, సాధారణ పాయింట్ల వద్ద ఆపాలంటూ డ్రైవర్, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగుతున్నారు. ఫలితంగా ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆర్డినరీ బస్సుల్లాగా చాలా చోట్ల ఆగుతూ వెళ్లాల్సి వస్తోంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో, ఓ మహిళ నుంచి టికెట్ రుసుము వసూలు చేశారంటూ ఆ మహిళ తాలూకు వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సదరు మహిళ తరపున పురుష వ్యక్తి టికెట్ తీసుకోవటంతో, మహిళ కూడా ఉందన్న విషయం తెలియక కండక్టర్ జీరో టికెట్‌కు బదులు సాధారణ టికెట్ ఇచ్చాడు. ఫిర్యాదు నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి ఆ కండక్టర్‌పై చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఇప్పుడు కొందరు మహిళలు తాము కోరిన చోట బస్సు ఆపకుంటే ఫిర్యాదు చేస్తామని డ్రైవర్, కండక్టర్లను బెదిరిస్తున్నారు. దీంతో బస్సులను వారు ఆపుతున్నారు. మరోవైపు ఇతర ప్రయాణికుల అభ్యంతరం ఎక్కడపడితే అక్కడ బస్సులను ఆపేస్తుండటంతో ఇతర ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురై కండక్టర్లు, డ్రైవర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇలా రెండు వైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో భరించలేక సిబ్బంది శుక్రవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆయన నిర్వహించిన గూగుల్‌మీట్‌లో ఈమేరకు మొర పెట్టుకున్నారు. దీనికి సజ్జనార్ స్పందించారు. ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దు: సజ్జనార్ ఇకపై ఎక్స్‌ప్రెస్ బస్సులను నిర్ధారిత స్టాపుల్లో మాత్రమే ఆపాల ని, తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లోనే వెళ్లాలని సజ్జనార్ సూచించారు. స్టాపు లేనిచోట ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దని స్పష్టం చేశారు. -
సౌరశక్తితో నడిచే డ్రైవర్‌లెస్ బస్
ఫగ్వాడా (రాజస్థాన్): డ్రైవర్ లేకుండా నడిచే (స్వయంచాలిత) వాహనాల అభివృద్ధి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఊపందుకుంది. ఇందులో గూగుల్ ముందు వరుసలో ఉంది. డ్రైవర్‌లెస్ కారును రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది గూగుల్. కానీ వీటి వాడకం మాత్రం ఇంకా అధికారికంగా అందుబాటులోకి రాలేదు. ఇప్పటి వరకు రూపొందించిన అన్ని డ్రైవర్‌లెస్ వెహికిల్స్ డీజిల్ లేదా పెట్రోల్‌తో నడిచేవే. అయితే తొలిసారి సౌరశక్తితో నడిచే డ్రైవర్‌లెస్ వాహనాన్ని రూపొందించారు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు. ఒక్కసారి చార్జి చేస్తే ఈ బస్సు 70 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తొలి నమూనా సిద్ధమైన ఈ వాహనానికి రూ.15 లక్షలే ఖర్చు కావడం విశేషం. రాజస్థాన్‌లోని ఫగ్వాడాలోగల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన 300 మంది విద్యార్థులు, 50 మంది అధ్యాపకులు సమిష్టిగా దీనిని తయారు చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని వర్క్‌షాప్‌లోనే దీనికి ప్రాణం పోశారు. 2014లో డ్రైవర్ లేని గోల్ఫ్‌కార్ట్ తయారు చేశామని, ఇప్పుడు ఒకడుగు ముందుకువేసి సౌరశక్తితో నడిచే డ్రైవర్ లెస్ బస్సును సిద్ధం చేశామని ప్రాజెక్ట్ లీడర్ మణిదీప్ సింగ్ చెప్పారు. -
డ్రైవర్ అక్కర్లేని సోలార్ బస్
సాక్షి, హైదరాబాద్: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) విద్యార్థులు దేశంలోనే తొలి డ్రైవర్ రహిత, సౌరశక్తితో నడిచే బస్‌కు రూపకల్పన చేశారు. వర్సిటీలో జనవరి 3 నుంచి జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ బస్సు లో తొలిసారిగా ప్రయాణిస్తారని యూనివర్సిటీ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తెలిపారు. త్వరలోనే ఈ బస్‌ను వాణిజ్య వినియోగంలోకి కూడా తెస్తామ న్నారు. దీన్ని రూపొందించేందుకు విద్యార్థులు ప్రత్యేకంగా వెహికల్ టు వెహికల్ (విటువి) టెక్నాలజీని వినియోగించారని, దీనివల్ల అల్ట్రా సోనిక్, ఇన్ఫ్రారెడ్ సంకేతాల ఆధారంగా, జీపీఎస్, బ్లూటూత్ ద్వా రా నేవిగేషన్ ప్రక్రియ సాగు తుందని తెలిపారు. సౌరశక్తి, బ్యాటరీ ఇంజిన్‌తో నడిచే ఈ బస్ విలువ సాధారణ బస్‌లతో పోలిస్తే రూ.6 లక్షలు అధికమని పేర్కొన్నారు. బస్సు సామర్థ్యం ఆధారంగా 10 నుంచి 30 మంది వరకు ప్రయాణించవచ్చని, 30 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని వివరించారు. -
డ్రైవర్ లేని బస్సు వచ్చేసింది..
బీజింగ్: డ్రైవర్‌లేని బస్సు వచ్చేసింది. చైనాలో ఈ బస్సును విజయవంతంగా పరీక్షించారు. గత ఆగస్టులో హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్‌ఝౌ సిటీ-కైఫెంగ్ సింటీ ఇంటర్ సిటీ రోడ్డులో 32.6 కిలో మీటర్లు దూరం మేర సురక్షితంగా ప్రయాణించింది. యుటాంగ్ బస్ కంపెనీ లిమిటెడ్ రూపొందించిన ఈ డ్రైవర్ రహిత బస్సు అన్ని పరీక్షల్లో విజయవంతమైంది. ఇంటర్ సిటీ రోడ్డుపై ఆటోమేటిక్‌గా లేన్స్ మార్చుకోవడం.. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగడం.. వాహనాలను ఓవర్టేక్ చేయడం వంటి పరీక్షలను పూర్తి చేసింది. బస్సులో రెండు కెమెరాలు, నాలుగు లేజర్ రాడార్లు, మిల్లీమీటర్ వేవ్ రాడార్ సెట్, నావిగేషన్ సిస్టమ్‌ను అమర్చారు. వీటి సాయంతో బస్సు నడుస్తుంది. యుటాంగ్ కంపెనీ మూడేళ్ల క్రితం డ్రైవర్ రహిత బస్సును తయారు చేయడానికి పరిశోధనలు మొదలుపెట్టింది. ఈ బస్సును వాడుకలో తీసుకురావాలంటే సాంకేతికను మరింత అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ మద్దతు అవసరమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.