జలంధర్: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్‌పీయూ)లో వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లను పంజాబ్ గవర్నర్ వీపీసింగ్ బాద్నోర్ పరిశీలించారు. గవర్నర్ వెంట 40 మందితో కూడిన భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లపై గవర్నర్, ప్రతినిధి బృందం సంతృప్తి వ్యక్తం చేశారని వర్సిటీ వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన పనులపై సూచనలు చేశారని తెలిపాయి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి బాద్నోర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లో 106వ సైన్స్ కాంగ్రెస్ విజ్ఞాన్ జ్యోతి ర్యాలీని నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment