దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఒకటి. ఇందులో చదివితే మంచి ప్యాకేజీతో ఉన్నత సంస్థలో కొలువు సాధించవచ్చనే భావన ఉంది. అనుకున్నట్టుగానే తాజాగా ఇందోర్ ఐఐఎంలో ఓ విద్యార్థి ఏకంగా రూ.కోటి వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించారు.
ఐఐఎం ఇందోర్‌లో ఈ-కామర్స్ సంస్థలు ఇటీవల నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థి ఈ ఆఫర్‌ను సాధించారు. ఈ ఏడాది చివరి దశ ప్లేస్‌మెంట్లలో ఇదే అత్యధిక ప్యాకేజీ. ఇందుకు సంబంధించిన వివరాలను ఐఐఎం-ఇందోర్ అధికారి పీటీఐతో పంచుకున్నారు.
ఐఐఎం ఇందోర్‌లో నిర్వహించిన చివరి విడుత ప్లేస్‌మెంట్స్‌లో 150 కంపెనీలు 594 మంది విద్యార్థులకు ఆఫర్లు వచ్చాయి. ఈ ఇంటర్వ్యూల్లో రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం) విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ప్లేస్‌మెంట్ పొందిన విద్యార్థులకు లభించిన ఆఫర్ సగటున రూ.25.68 లక్షల వేతనం అని ఐఐటీ ఇండోర్ తెలిపింది. గరిష్ఠంగా ఓ విద్యార్థికి ఏకంగా ఏటా రూ.కోటి వార్షిక వేతనంతో ఆఫర్ వచ్చిందని చెప్పింది. సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఈ విద్యార్థికి ఉద్యోగం లభించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..!
ప్రస్తుతం ఉద్యోగాల మార్కెట్లో సవాళ్లు ఎదురవుతున్నా ఐఐఎం ఇందోర్ తన పేరు నిలుపుకోవడంతోపాటు అతిపెద్ద కంపెనీలను ఆకర్షించగలిగింది. ఈ ఏడాది కొత్తగా 50కి పైగా కంపెనీలు తమ సంస్థలో ఇంటర్వ్యూలు నిర్వహించాయని ఐఐఎం ఇందోర్ డైరెక్టర్ హిమాంశురాయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment