High salaries
-
రూ.1,600 కోట్లు వేతనం.. సమర్థించుకున్న సీఈవో
టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట భారీగా వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తుంటే కొన్ని సంస్థల సీఈవోలకు మాత్రం కోట్లల్లో వేతనాలు ఉంటున్నాయి. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది. తాజాగా రెడ్డిట్ సీఈవో స్టీవ్ హఫ్‌మన్ వేతనం పట్ల చాలా విమర్శలు వచ్చాయి. దాంతో రెడ్డిట్ సీఈవో స్పందించారు. తన భారీ వేతన ప్యాకేజ్‌ను ఆయన సమర్ధించుకున్నారు. దాదాపు రూ.1600 కోట్ల వేతన ప్యాకేజ్‌ను హఫ్‌మన్ అందుకోవడంపై కోరా, ఎక్స్ వంటి పలు ప్లాట్‌ఫాంలలో యూజర్ల మధ్య హాట్ డిబేట్ సాగింది. ఇంతటి భారీ ప్యాకేజ్ అవసరమా అంటూ యూజర్లు కామెంట్ చేశారు. ఇదీ చదవండి: ‘మళ్లీ డ్రగ్స్ తీసుకున్నాను..’ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి ఈ వివాదంపై రెడ్డిట్ సీఈవో రెడ్డిట్ వేదికగా క్యూ అండ్ ఏ సెషన్లో స్పందించారు. తన సామర్థ్యం ఆధారంగా రెడ్డిట్ బోర్డ్ తన వేతన ప్యాకేజ్‌ను నిర్ధారించిందని స్పష్టం చేశారు. హఫ్‌మన్ వేతనం ఓ ప్రముఖ పబ్లిక్ కార్పొరేషన్ సీఈవో వేతనానికి దీటుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు
ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm) ఏదో ఒక అంశంలో రోజూ వార్తల్లో నిలుస్తోంది. దీని షేరు విలువ రెండు రోజుల్లో 15 శాతం పడిపోయింది. పేటీఎం భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఆ సంస్థ ఉద్యోగులు బయటి అవకాశాల కోసం చూస్తున్నారు. కానీ వారికో చిక్కు వచ్చిపడింది. డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లలో అనతి కాలంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగిన పేటీఎం.. ఉద్యోగులకు మంచి జీతాలు చెల్లించడంలో ప్రసిద్ధి చెందింది. పరిశ్రమ సగటు కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తోంది. అయితే ప్రస్తుత సంక్షోభ సమయంలో ఉద్యోగులు ఆ సంస్థను వీడి ఇతర కంపెనీల వైపు చూస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలు, ఇతర స్టార్టప్‌లు పేటీఎం ఉద్యోగులపై దృష్టి పెట్టాయి. కానీ వారికి జీతాలే సమస్యగా మారాయి. వెనకాడుతున్న స్టార్టప్‌లు రిక్రూట్మెంట్ సర్వీసెస్, జాబ్ సెర్చ్ సంస్థల వర్గాల ప్రకారం, పేటీఎం ఉద్యోగులు పరిశ్రమ ప్రమాణాల కంటే 20-30 శాతం ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పేటీఎం ఉద్యోగుల పాలిట శాపమైందని, దీని కారణంగానే చాలా స్టార్టప్‌లు పేటీఎం ఉద్యోగులను నియమించుకోవడానికి వెనుకాడుతున్నారని ఎకనామిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. పేటీఎం ప్రస్తుతం తమ కార్యకలాపాలపై నియంత్రణాపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందులోని చాలా మంది ఉద్యోగులు తక్కువ జీతమైన పర్వాలేదని ఉద్యోగాలు మారడానికి సిద్ధంగా ఉన్నారని నివేదిక వివరిస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత ఎటువంటి కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, కార్డ్‌లపై తదుపరి డిపాజిట్లు తీసుకోవద్దని, క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్‌లను నిర్వహించవద్దని ఆర్బీఐ జనవరి 31న ఆదేశించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) పేటీఎం బ్రాండ్ అయిన One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కి అనుబంధ సంస్థ. -
యాపిల్ స్టోర్స్‌లో సేల్స్‌పర్సన్‌లకు అదిరిపోయే జీతాలు!
అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ఇటీవల భారత్‌లో రెండు రీటైల్ స్టోర్లను ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ నగరాల్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లలో పనిచేసే సేల్స్ పర్సన్లకు, మేనేజర్లకు యాపిల్ భారీగా చెల్లిస్తోంది. ఈ స్టోర్లలో పనిచేసే వారు ఉన్నత విద్యావంతులు. ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ ఉన్నత కోర్సులు అభ్యసించినవారు. ఇదీ చదవండి: ఐఫోన్ 14పై అక్షయ తృతీయ ఆఫర్.. ఏకంగా రూ.21 వేలు తగ్గింపు! వీరిలో కొందరు కేంబ్రిడ్జ్, గ్రిఫిత్ వంటి విశ్వవిద్యాలయాల్లో చదివినవారూ ఉన్నారు. యూరప్, మిడిల్ ఈస్ట్‌లోని యాపిల్ స్టోర్లలో పని చేస్తున్న కొంతమంది భారతీయులను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ ఉద్యోగులందరికీ రీటైల్ అనుభవం ఉందని ఎకనమిక్స్ టైమ్స్ నివేదించింది. యాపిల్ కంపెనీ ముంబై , న్యూఢిల్లీ స్టోర్లలో 170 మంది సిబ్బంది నియమించింది. వీరికి గ్లోబల్ స్టాండర్డ్స్‌తో శిక్షణ ఇచ్చింది. ముంబై యాపిల్ స్టోర్‌లోని ఉద్యోగులు మొత్తం 25 భాషల్లో మాట్లాడగలరు. అలాగే ఢిల్లీ స్టోర్ సిబ్బంది 15 భాషలు మాట్లాడగలరు. స్టోర్‌కు విచ్చేసే కస్టమర్లతో భాష సమస్య రాకుండా యాపిల్ జాగ్రత్త పడుతోంది. అందుకే దాదాపు అన్ని ప్రముఖ భారతీయ భాషలు మాట్లాడే సిబ్బందిని తమ స్టోర్లలో నియమించింది. తమ స్టోర్లలో పనిచేసే సిబ్బందికి మంచి జీతంతో పాటు బీమా ప్రయోజనాలు, చెల్లింపు సెలవులు, స్టాక్ గ్రాంట్లు, యాపిల్ ఉత్పత్తులపై తగ్గింపులు, విద్య కోసం ఆర్థిక సహాయం వంటి సదుపాయాలు కల్పిస్తోంది. భారతదేశంలో ఆర్గనైజ్డ్ రిటైల్ ఉద్యోగులకు రూ. 25,000 నుంచి రూ. 30,000 దాకా జీతం లభిస్తోంది. అయితే యాపిల్ మాత్రం తమ రిటైల్ ఉద్యోగులకు నెలకు రూ. 1 లక్షకు పైగా చెల్లిస్తోంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
సీఈఓల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న బాడీగార్డ్స్
సినీ ప్రముఖులకు, ప్రముఖ పారిశ్రామికవేత్తలకు, క్రికెటర్లకు సాధారణ ప్రజల మాదిరిగా బయట తిరిగే స్వేచ్ఛ ఉండదు, ఈ కారణంగా తమను తాము కాపాడుకోవడానికి బాడీగార్డ్స్‌ని నియమించుకుంటారు. ఈ బాడీగార్డ్స్ జీతాలు భారతదేశంలో ఉండే కొన్ని కంపెనీల సీఈఓల జీతాలకంటే ఎక్కువ అని తెలుస్తోంది. షారుక్ ఖాన్ బాడీగార్డ్: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో షారుక్ ఖాన్ అతిపెద్ద సూపర్‌స్టార్. అయితే ఈయన సినిమా షూటింగ్, ప్రమోషన్ వంటి వాటికోసం బయట ఎక్కువ తిరగాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో తనకు రక్షణగా రవి సింగ్ అనే బాడీగార్డ్‌ని నియమించుకున్నాడు. ఇండస్ట్రీలో ఎక్కువ జీతం తీసుకునే బాడీగార్డ్‌లలో రవి సింగ్ ఒకరు. ఈయన శాలరీ సంవత్సరానికి రూ. 2 నుంచి రూ. 3 కోట్లు వరకు ఉంటుంది. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్: బాలీవుడ్ టాప్ పెర్ఫార్మర్లలో ఒకరైన సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ 'గుర్మీత్ సింగ్ జాలీ అకా షేరా' సంవత్సరానికి రూ. 2 కోట్లు కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నాడు. ఎక్కువ జీతం తీసుకునే బాడీగార్డ్‌లలో ఈయన ఒకరు. ముంబైలో జస్టిన్ బీబర్ తన సంగీత కచేరీ సమయంలో అతను ఎస్కార్ట్ చేశాడు. అమీర్ ఖాన్ బాడీగార్డ్: ఎన్నో పాపులర్ సినిమాలతో బాలీవుడ్ సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న అమీర్ ఖాన్ కూడా తన బాడీగార్డ్‌కి ఎక్కువ జీతం ఇస్తున్నట్లు సమాచారం. యువరాజ్ ఘోర్పడే (అమీర్ ఖాన్ బాడీగార్డ్) ప్రతి సంవత్సరం 1 నుండి 2.5 కోట్లు సంపాదిస్తున్నాడు. నిజానికి యువరాజ్ బాడీబిల్డర్. అక్షయ్ కుమార్ బాడీగార్డ్: అక్షయ్ కుమార్ బాడీగార్డ్ 'శ్రేయ్‌సే తేలే' సంవత్సరానికి 1 నుంచి 2 కోట్లు సంపాదిస్తూ అత్యధిక శాలరీ తీసుకుంటున్న బాడీగార్డ్‌లలో ఒకరుగా నిలిచారు. దీపికా పదుకొనే బాడీగార్డ్: ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే బాడీగార్డ్ 'జలాల్' పబ్లిక్ ప్లేస్‌లో ఎప్పటికప్పుడు రక్షణ కల్పిస్తూ వారి కుటుంబ సభ్యులలో ఒకరుగా కలిసిపోయారు. ఈయన సంవత్సరాదాయం రూ. 90 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఉంటుంది. -
Neal Mohan: యూట్యూబ్ కొత్త సీఈవో జీతమెంతో తెలుసా?
భారత సంతతికి చెందిన నీల్ మోహన్ ఇప్పుడు యూట్యూబ్ కొత్త సీఈవోగా బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే సుసాన్ వోజ్కికీ స్థానంలో నియమితులైన నీల్మోహన్ భారీ ప్యాకేజీ అందుకోబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారతీయ-అమెరికన్ మోహన్.. సుసాన్ వోజ్కికీ నేతృత్వంలోని అత్యంత సీనియర్ అధికారులలో ఒకరిగా యూట్యూబ్ చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్‌గా పనిచేశారు. సీఈఓగా అర్హుల జాబితాలో చాలామంది ఉన్నా నీల్ మోహన్నే యూట్యూబ్ ఎంపిక చేయడం విశేషం. యూట్యూబ్‌లో ఉన్నత స్థాయిలో పనిచేస్తుండటంతో పాటు అనేక ప్రతిష్టాత్మక సంస్థలలో కూడా మోహన్ పని చేశారు. గూగుల్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన కెరీర్ ప్రారంభంలో మైక్రోసాఫ్ట్‌లో చిన్న ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు. గూగుల్‌లో డిస్ప్లే, వీడియో ప్రకటనల విభాగాన్ని పర్యవేక్షించిన ఆయన యూట్యూబ్, గూగుల్ డిస్ప్లే నెట్వర్క్, యాడ్సెన్స్, యాడ్‌మాబ్, డబుల్ క్లిక్ యాడ్ టెక్ వంటి ఉత్పత్తి సేవల బాధ్యతలు నిర్వహించారు. యూట్యూబ్‌కు రాజీనామా చేసిన వోజ్కికీకి యాజమాన్యం భారీ జీతం ఇచ్చేది. మీడియా నివేదికల ప్రకారం నెలకు సుమారు 3,74,829 యూఎస్ డాలర్ల జీతం తీసుకునేవారు ఆమె. అంటే మన కరెన్సీలో రూ. 3.1 కోట్లు. దీని బట్టే..కొత్త సీఈవో నీల్ మోహన్ జీతం అంతకు మించి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. గతంలో నీల్ మోహన్ ట్విటర్‌కు మారకుండా ఉండేందుకు గూగుల్ నుంచి 100 మిలియన్ డాలర్లు బోనస్‌గా అందుకున్నట్లు తెలిసింది. (ఇదీ చదవండి: యూట్యూబ్ సీఈవోగా భారతీయుడు.. అసలు ఎవరీ నీల్ మోహన్!) -
అమెరికాలో టాప్-20 జాబ్స్...జీతాలు
సాక్షి, హైదరాబాద్ : వాళ్లబ్బాయికి నెలకు యాభైవేలు జీతమట అని నోరెళ్లబెట్టే రోజులు పోయాయి. భారత్‌లో నెలకు లక్షల్లో జీతమంటే తప్ప... పెద్దగా పట్టించుకోని రోజులొచ్చాయి. అమెరికాలో అయితే...చెప్పాల్సిన పనిలేదు. అక్కడి జాబ్ సెర్చ్ ఇంజన్ ‘ఇన్‌డీడ్’ ఈ మధ్య ఓ సర్వే చేసింది. ఏడాదికి లక్ష డాలర్లు (సుమారుగా రూ.65 లక్షలు) లేదా అంతకన్నా ఎక్కువ జీతమొచ్చే ఉద్యోగాల జాబితాను వెల్లడించింది. మెడికల్, టెక్ రంగాల్లో ఇలాంటి ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఆ వివరాలు మీ కోసం... న్యూరాలజిస్ట్ 1.41 కోట్లు సైకియాట్రిస్ట్ 1.26 కోట్లు అనస్తీషియాలజిస్ట్ 1.12 కోట్లు రేడియాలజిస్ట్ 1.09 కోట్లు ఫిజీషియన్ 1.07 కోట్లు డెంటిస్ట్ 1.02 కోట్లు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ 95.69 లక్షలు సర్జన్ 91.49 లక్షలు మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్ 89.18 లక్షలు సేల్స్ వైస్ ప్రెసిడెంట్ 88.18 లక్షలు డేటా సైంటిస్ట్ 87.87 లక్షలు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 83.04 లక్షలు ఆండ్రాయిడ్ డెవలపర్ 78.55 లక్షలు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ 77.79 లక్షలు ఫుల్‌స్టాక్ డెవలపర్ 72.54 లక్షలు యాక్చువరీ 72.39 లక్షలు ట్యాక్స్మేనేజర్ 70.46 లక్షలు ఆర్కిటెక్ట్ 67.58 లక్షలు నర్స్ ప్రాక్టీషనర్. 67.03 లక్షలు -
మహిళా సీఈవోల జీతాలే ఎక్కువ
న్యూయార్క్: ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే, ఎక్కడైనా సరే మగవాళ్లకన్నా ఆడవాళ్లకే జీతాలు తక్కువ ఇస్తారని ఎవరైనా తడుముకోకుండా ఠక్కున చెబుతారు. అందులో నిజం ఎక్కువే ఉండవచ్చు. కానీ పూర్తిగా కాదు. ఎందుకంటే అమెరికాలోని ప్రముఖ కంపెనీల్లో మగ సీఈవోలకన్నా మహిళా సీఈవోలకే జీతాలు ఎక్కువ ఇస్తున్నారని ఈక్విలర్ కంపెనీ ఓ అధ్యయనంలో తేల్చింది. కాకపోతే వంద టాప్ కంపెనీలకుగాను 8 మందే మహిళా సీఈవోలు ఉన్నారు. 500 కంపెనీలను పరిగణలోకి తీసుకుంటే 21 మంది సీఈవోలు మాత్రమే మహిళలు ఉన్నారు. 2015 సంవత్సరానికిగాను కంపెనీ సీఈవోలుగా మహిళలు సరాసరి 2.27 కోట్ల డాలర్లను జీతభత్యాలుగా అందుకోగా మగ సీఈవోలు 1.49 కోట్ల డాలర్లను అందుకున్నారని లెక్కలు తెలియజేస్తున్నాయి. మహిళలు ఎన్నోరంగాల్లో ముందుకు దూసుకుపోతున్నప్పటికీ ఉన్నత స్థానాల్లో వారికి అవకాశాలు ఎక్కువగా రాకపోవడం ఆందోళనకరమైన విషయమేనని అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ సీఈవోల్లో మహిళల శాతం మూడు ఉండగా, అమెరికాలోను, కెనడాలోను అది నాలుగు శాతం, చైనాలో 3.7 శాతం, పాశ్చాత్య యూరప్‌లో 2.3 శాతం, జపాన్‌లో 0.9 శాతం ఉంది. మగవాళ్లకన్నా, మహిళా సీఈవోలకు అత్యధిక జీతాలు చెల్లించడం హర్షణీయమైన విషయమని, సీఈవోల లాంటి ఉన్నత ఉద్యోగాల విషయాల్లో కంపెనీలేవీ ఉద్దేశపూర్వకంగా వ్యత్యాసాన్ని ఏమీ చూపించడం లేదని న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన లీసా లెస్లీ చెప్పారు. ఆడవాళ్లలో నాయకత్వ లోపాలే అందుకు కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రత్యేక శిక్షణల ద్వారా ఈ విషయంలో కూడా మహిళలు పురోభివృద్ధి సాధిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.