Apple Store Employees in India Are Highly Qualified and Well Paid - Sakshi
Sakshi News home page

యాపిల్‌ స్టోర్స్‌లో సేల్స్‌పర్సన్‌లకు అదిరిపోయే జీతాలు! వారి క్వాలిఫికేషన్లు ఏంటో తెలుసా? 

Published Sun, Apr 23 2023 11:18 AM | Last Updated on Sun, Apr 23 2023 12:13 PM

Apple store employees in India are highly qualified and well paid - Sakshi

అమెరికన్‌ మల్టీనేషనల్‌ టెక్నాలజీ కంపెనీ యాపిల్‌ ఇటీవల భారత్‌లో రెండు రీటైల్‌ స్టోర్లను ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ నగరాల్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లలో పనిచేసే సేల్స్‌ పర్సన్‌లకు, మేనేజర్‌లకు యాపిల్‌ భారీగా చెల్లిస్తోంది. ఈ స్టోర్లలో పనిచేసే వారు ఉన్నత విద్యావంతులు. ఎంఎస్‌సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్‌ ఉన్నత కోర్సులు అభ్యసించినవారు. 

ఇదీ చదవండి: ఐఫోన్‌ 14పై అక్షయ తృతీయ ఆఫర్‌.. ఏకంగా రూ.21 వేలు తగ్గింపు!

వీరిలో కొందరు కేంబ్రిడ్జ్, గ్రిఫిత్ వంటి విశ్వవిద్యాలయాల్లో చదివినవారూ ఉన్నారు. యూరప్, మిడిల్ ఈస్ట్‌లోని యాపిల్ స్టోర్‌లలో పని చేస్తున్న కొంతమంది భారతీయులను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ ఉద్యోగులందరికీ రీటైల్ అనుభవం ఉందని ఎకనమిక్స్‌ టైమ్స్‌ నివేదించింది.

యాపిల్‌ కంపెనీ ముంబై , న్యూఢిల్లీ స్టోర్లలో 170 మంది సిబ్బంది నియమించింది. వీరికి గ్లోబల్ స్టాండర్డ్స్‌తో శిక్షణ ఇచ్చింది. ముంబై యాపిల్ స్టోర్‌లోని ఉద్యోగులు మొత్తం 25 భాషల్లో మాట్లాడగలరు. అలాగే  ఢిల్లీ స్టోర్‌ సిబ్బంది 15 భాషలు మాట్లాడగలరు. స్టోర్‌కు విచ్చేసే కస్టమర్లతో భాష సమస్య రాకుండా యాపిల్‌ జాగ్రత్త పడుతోంది. అందుకే దాదాపు అన్ని ప్రముఖ భారతీయ భాషలు మాట్లాడే సిబ్బందిని తమ స్టోర్లలో నియమించింది.

 

తమ స్టోర్లలో పనిచేసే సిబ్బందికి మంచి జీతంతో పాటు బీమా ప్రయోజనాలు, చెల్లింపు సెలవులు, స్టాక్ గ్రాంట్లు, యాపిల్‌ ఉత్పత్తులపై తగ్గింపులు, విద్య కోసం ఆర్థిక సహాయం వంటి సదుపాయాలు కల్పిస్తోంది. భారతదేశంలో ఆర్గనైజ్డ్ రిటైల్ ఉద్యోగులకు రూ. 25,000 నుంచి రూ. 30,000 దాకా జీతం లభిస్తోంది. అయితే యాపిల్‌ మాత్రం తమ రిటైల్‌ ఉద్యోగులకు నెలకు రూ. 1 లక్షకు పైగా చెల్లిస్తోంది.

ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్‌! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement