టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట భారీగా వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తుంటే కొన్ని సంస్థల సీఈవోలకు మాత్రం కోట్లల్లో వేతనాలు ఉంటున్నాయి. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది. తాజాగా రెడ్డిట్ సీఈవో స్టీవ్ హఫ్‌మన్ వేతనం పట్ల చాలా విమర్శలు వచ్చాయి.
దాంతో రెడ్డిట్ సీఈవో స్పందించారు. తన భారీ వేతన ప్యాకేజ్‌ను ఆయన సమర్ధించుకున్నారు. దాదాపు రూ.1600 కోట్ల వేతన ప్యాకేజ్‌ను హఫ్‌మన్ అందుకోవడంపై కోరా, ఎక్స్ వంటి పలు ప్లాట్‌ఫాంలలో యూజర్ల మధ్య హాట్ డిబేట్ సాగింది. ఇంతటి భారీ ప్యాకేజ్ అవసరమా అంటూ యూజర్లు కామెంట్ చేశారు.
ఇదీ చదవండి: ‘మళ్లీ డ్రగ్స్ తీసుకున్నాను..’ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి
ఈ వివాదంపై రెడ్డిట్ సీఈవో రెడ్డిట్ వేదికగా క్యూ అండ్ ఏ సెషన్‌లో స్పందించారు. తన సామర్థ్యం ఆధారంగా రెడ్డిట్ బోర్డ్ తన వేతన ప్యాకేజ్‌ను నిర్ధారించిందని స్పష్టం చేశారు. హఫ్‌మన్ వేతనం ఓ ప్రముఖ పబ్లిక్ కార్పొరేషన్ సీఈవో వేతనానికి దీటుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment