reddit website
-
రూ.1,600 కోట్లు వేతనం.. సమర్థించుకున్న సీఈవో
టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట భారీగా వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తుంటే కొన్ని సంస్థల సీఈవోలకు మాత్రం కోట్లల్లో వేతనాలు ఉంటున్నాయి. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది. తాజాగా రెడ్డిట్ సీఈవో స్టీవ్ హఫ్‌మన్ వేతనం పట్ల చాలా విమర్శలు వచ్చాయి. దాంతో రెడ్డిట్ సీఈవో స్పందించారు. తన భారీ వేతన ప్యాకేజ్‌ను ఆయన సమర్ధించుకున్నారు. దాదాపు రూ.1600 కోట్ల వేతన ప్యాకేజ్‌ను హఫ్‌మన్ అందుకోవడంపై కోరా, ఎక్స్ వంటి పలు ప్లాట్‌ఫాంలలో యూజర్ల మధ్య హాట్ డిబేట్ సాగింది. ఇంతటి భారీ ప్యాకేజ్ అవసరమా అంటూ యూజర్లు కామెంట్ చేశారు. ఇదీ చదవండి: ‘మళ్లీ డ్రగ్స్ తీసుకున్నాను..’ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి ఈ వివాదంపై రెడ్డిట్ సీఈవో రెడ్డిట్ వేదికగా క్యూ అండ్ ఏ సెషన్లో స్పందించారు. తన సామర్థ్యం ఆధారంగా రెడ్డిట్ బోర్డ్ తన వేతన ప్యాకేజ్‌ను నిర్ధారించిందని స్పష్టం చేశారు. హఫ్‌మన్ వేతనం ఓ ప్రముఖ పబ్లిక్ కార్పొరేషన్ సీఈవో వేతనానికి దీటుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఉద్యోగులను తొలగిస్తున్న సోషల్‌మీడియా వెబ్సైట్ కారణాలివే!
ప్రముఖ సోషల్‌మీడియా వెబ్సైట్ రెడిట్ తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. ఖర్చులను తగ్గించే లక్ష్యంతో పునర్నిర్మించే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ సుమారు 90 మంది ఉద్యోగులను తొలగిస్తోంది . అంతేకాదు రానున్న సంవత్సరాల్లో హైరింగ్‌ను ప్రణాళికలను వెనక్కి తీసుకుంటోంది. కంపెనీ స్టీవ్ హఫ్ఫ్మాన్ ఈ సందేశాన్ని ఉద్యోగులకు అంతర్గత ఇమెయిల్‌లో తెలియజేశారు. సంవత్సరం మొదటి అర్ధ భాగంలో కంపెనీ పనితీరుపై విశ్వాసం వ్యక్తం చేశారు .2024 చివరి నాటికి కంపెనీ ప్రణాళికలను సమీక్షించనున్నామనీ, రీస్ట్రక్చర్ నిర్ణయం ఫలితం మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. ఇది ఇకపై కూడా కొనసాగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేవారు. (ఆన్లైన్ ఫ్రాడ్: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్ డైరెక్టర్ లబోదిబో) నివేదిక ప్రకారం దాదాపు 5శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది.300 మంది అదనపు ఉద్యోగులను నియమించుకోవాలని భావించింది, కానీ ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 100కి తగ్గించేసినట్టు సమాచారం. ప్రస్తుతం కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 2,000 మంది ఉద్యోగులున్నారు. ఇదీ చదవండి: ఐవోఎస్ 17 అదిరిపోయే అప్డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం -
80 డేగలకు విమాన టికెట్లు!
దుబాయ్: 80 డేగలను తనతోపాటు విమానంలో తీసుకెళ్లడానికి సౌదీ యువరాజు వాటికోసం ప్రత్యేకంగా టికెట్లను కొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమం రెడ్డిట్ వెబ్సైట్లో ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. విమానాల్లో కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించే తన స్నేహితుడు తనకు ఈ ఫొటోను పంపినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. కళ్లకు గంతలు కట్టిన డేగలను విమానంలోని సీట్లకు కట్టేసినట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. డేగ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) జాతీయ పక్షి. ఇక్కడ విమానాల్లో వాటిని తీసుకెళ్లడానికి సాధారణంగానే అనుమతిస్తారు. -
ఆమె 'పొందు' కోసం అంతులేని అబద్ధాలు
అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు అసత్యాలాడటం అబ్బాయిలకు అలవాటే. అయితే ఇప్పుడా అబద్ధాల'ఆట'.. శృతిమించుతోంది. ఆమెతో పొందు కోసం మగాళ్లు వేసే గప్పాలకు అంతులేకుండాపోతోంది. ప్రఖ్యాత రిడ్డిట్ వెబ్ సైట్ లో తాజాగా నిర్వహించిన సర్వేలో మగువల్ని బుట్టలోపడేసేందుకు తాము ఎంతలేసి అబద్ధాలాడింది వెల్లడించారు ప్లేబాయ్ కి బాబాయిల్లాంటి కొందరు పురుషులు. ఆ 'హంటర్'లలో చాలామంది తమ వయసు, పేరు, చేసే ఉద్యోగం, ఉండే ప్రదేశాలపై అబద్ధాలాడితే ఇంకొందరు మాత్రం ఇంకాస్త ముందుకెళ్లి 'నేను బ్యాట్ మ్యాట్ ని.. మా నాన్న శ్రీమంతుడు.. నా ఎత్తు ఆరడుగులు..' అని గొప్పలు చెప్పుకున్నారట. ఇంకొందరేమో, తాము యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న శాంతి యోధులమని, వ్యోమగాములమని చెప్పుకున్నారు. వీళ్లిలా ఇంతలేసి అబద్ధాలు చెప్పినప్పటికీ.. పాపం అమ్మాయిలు వాటిని నమ్మేసి తమ సర్వస్వాన్ని అర్పించేసుకున్నారట. ఎంతైనా అబద్ధాల పవరే పవర్. అన్నట్లు ఈ సర్వేలో తేలినటి (మగాళ్లు ఆడవాళ్లకు చెప్పినవాటిలో) అత్యుత్తమ అబద్ధం.. ఏంటో తెలుసా?...'ఐ లవ్ యూ'