80 డేగలకు విమాన టికెట్లు! | flight tickets for 80 hawks! | Sakshi
Sakshi News home page

80 డేగలకు విమాన టికెట్లు!

Published Wed, Feb 1 2017 8:37 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

80 డేగలకు విమాన టికెట్లు!

80 డేగలకు విమాన టికెట్లు!

దుబాయ్‌: 80 డేగలను తనతోపాటు విమానంలో తీసుకెళ్లడానికి సౌదీ యువరాజు వాటికోసం ప్రత్యేకంగా టికెట్లను కొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమం రెడ్డిట్‌ వెబ్‌సైట్‌లో ఒక వ్యక్తి పోస్ట్‌ చేశాడు. విమానాల్లో కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించే తన స్నేహితుడు తనకు ఈ ఫొటోను పంపినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు.

కళ్లకు గంతలు కట్టిన డేగలను విమానంలోని సీట్లకు కట్టేసినట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. డేగ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) జాతీయ పక్షి. ఇక్కడ విమానాల్లో వాటిని తీసుకెళ్లడానికి సాధారణంగానే అనుమతిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement