ఎంపాక్స్‌ క్లేడ్‌ 1బీ తొలి కేసు | India first Mpox clad 1 case in Kerala | Sakshi
Sakshi News home page

ఎంపాక్స్‌ క్లేడ్‌ 1బీ తొలి కేసు

Published Tue, Sep 24 2024 4:55 AM | Last Updated on Tue, Sep 24 2024 4:55 AM

India first Mpox clad 1 case in Kerala

కేరళ కేసులో నిర్ధారణ

న్యూఢిల్లీ: ప్రపంచంలో ‘ఆరోగ్య అత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్‌1’ వేరియంట్‌ ఎంపాక్స్‌ వైరస్‌ భారత్‌లోకి అడుగుపెట్టింది. క్లేడ్‌ 1బీ పాజిటివ్‌ కేసు భారత్‌లో నమోదైందని సోమవారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి కేరళకు తిరిగొచి్చన 38 ఏళ్ల వ్యక్తిలో క్లేడ్‌ 1బీ వైరస్‌ను గుర్తించామని అధికారులు ప్రకటించారు. మలప్పురం జిల్లాకు చెందిన ఈ రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. క్లేడ్‌ 1బీ వేరియంట్‌ కేసులు విజృంభించడతో ఆగస్ట్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించడం తెల్సిందే. విదేశాల నుంచి వస్తూ ఎంపాక్స్‌ రకం వ్యాధి లక్షణాలతో బాధపడేవారు తక్షణం ఆరోగ్య శాఖకు వివరాలు తెలపాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ సూచించారు.  

కోలుకున్న ‘క్లేడ్‌2’ రోగి  
క్లేడ్‌2 వేరియంట్‌తో ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 26 ఏళ్ల రోగి కోలుకుని శనివారం డిశ్చార్జ్‌ అయ్యాడని ఆస్పత్రి వర్గాలు సోమవారం వెల్లడించాయి. హరియాణాలోని హిసార్‌కు చెందిన ఈ వ్యక్తి సెపె్టంబర్‌ ఎనిమిదో తేదీన ఆస్పత్రిలో చేరడం తెల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement