Kerala man
-
సవతి కుమార్తెపై అత్యాచారం.. 141 ఏళ్ల జైలు శిక్ష
మలప్పురం: మైనర్ అయిన సవతి కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ కోర్టు 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో చట్టం, ఐపీసీ, జువెనైల్ జస్టిస్ చట్టం కింద వివిధ నేరాలకు గాను దోషి ఏక కాలంలో ఈ శిక్ష అనుభవించాలంటూ మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి అష్రాఫ్ ఏఎం నవంబర్ 29వ తేదీన తీర్పు వెలువరించారు. అయితే, దోషి 40 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అతడికి విధించిన శిక్షల్లో ఇదే అత్యధికమని ఆయన ఆ తీర్పులో పేర్కొన్నారు. అదేవిధంగా, బాధితురాలికి పరిహారంగా రూ.7.85 లక్షలు చెల్లించాలని కూడా దోషిని ఆదేశించారు. బాలికపై ఆమె తల్లి ఇంట్లో లేని సమయాల్లో 2017 నుంచి సవతి తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు అధికారి ఒకరు తెలిపార -
ఎంపాక్స్ క్లేడ్ 1బీ తొలి కేసు
న్యూఢిల్లీ: ప్రపంచంలో ‘ఆరోగ్య అత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్1’ వేరియంట్ ఎంపాక్స్ వైరస్ భారత్‌లోకి అడుగుపెట్టింది. క్లేడ్ 1బీ పాజిటివ్ కేసు భారత్‌లో నమోదైందని సోమవారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళకు తిరిగొచి్చన 38 ఏళ్ల వ్యక్తిలో క్లేడ్ 1బీ వైరస్‌ను గుర్తించామని అధికారులు ప్రకటించారు. మలప్పురం జిల్లాకు చెందిన ఈ రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. క్లేడ్ 1బీ వేరియంట్ కేసులు విజృంభించడతో ఆగస్ట్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం తెల్సిందే. విదేశాల నుంచి వస్తూ ఎంపాక్స్ రకం వ్యాధి లక్షణాలతో బాధపడేవారు తక్షణం ఆరోగ్య శాఖకు వివరాలు తెలపాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సూచించారు. కోలుకున్న ‘క్లేడ్2’ రోగి క్లేడ్2 వేరియంట్‌తో ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 26 ఏళ్ల రోగి కోలుకుని శనివారం డిశ్చార్జ్ అయ్యాడని ఆస్పత్రి వర్గాలు సోమవారం వెల్లడించాయి. హరియాణాలోని హిసార్‌కు చెందిన ఈ వ్యక్తి సెపె్టంబర్ ఎనిమిదో తేదీన ఆస్పత్రిలో చేరడం తెల్సిందే. -
లెబనాన్ పేజర్ల పేలుళ్లలో కేరళ టెక్కీ ప్రమేయం?
హెజ్బొల్లా లక్ష్యంగా జరిగిన పేజర్ల పేలుళ్ల కేసులో.. కేరళకు చెందిన ఓ టెక్కీని బల్గేరియా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నార్వేలో స్థిరపడిన అతనికి.. బల్గేరియాలో ఓ కంపెనీ ఉంది. అక్కడి నుంచే పేజర్ల సప్లై జరిగిందని, పేలుడు పదార్థాలను ఇక్కడే అమర్చి ఉంటారన్న అనుమానాల నడుమ మూడు రోజులపాటు అతన్ని విచారించారు. వయనాడ్‌కు చెందిన రిన్సన్ జోస్(37).. నార్వేలో స్థిరపడ్డాడు. రెండేళ్ల కిందట బల్గేరియాలో నోర్టా గ్లోబల్ లిమిటెడ్ అనే కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు చేశాడు. అయితే.. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ సభ్యులకు ఇతని కంపెనీ నుంచే పేజర్లు వెళ్లాయని తొలుత అధికారులు అనుమానించారు. ఈ అనుమానాలకు అతని కదలికలు కూడా మరింత బలం చేకూర్చాయి. దీంతో.. బల్గేరియా దర్యాప్తు సంస్థ డీఏఎన్ఎస్, ఆ దేశ విదేశాంగ సహకారంతో జోస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది. చివరకు.. పేలుళ్లకు సంబంధించిన పేజర్లకు, ఇతని కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని గుర్తించారు. అంతేకాదు.. లెబనాన్ పేలుళ్లలోని పేజర్లు అసలు బల్గేరియా నుంచే వెళ్లలేదని ప్రకటించారు.‘‘లెబనాన్ పేజర్ల పేలుళ్లకు నోర్టా గ్లోబల్ లిమిటెడ్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఈ కంపెనీ యాజమానితో పేజర్లకు సంబంధించి లావాదేవీలు(ట్రాన్జాక్షన్స్) జరిగాయన్న వాదనలోనూ నిజం లేదు’’ అని డీఏఎన్ఎస్ ప్రకటించింది. మరోవైపు ఓస్లో(నార్వే) పోలీసులు సైతం ప్రాథమిక విచారణలో జోస్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చాయి.ఇదీ చదవండి: పేరు వేరే అయినా.. పేజర్ వీళ్లదేసెప్టెంబర్ 17వ తేదీన లెబనాన్‌లో జరిగిన పేజర్ల పేలుళ్లలో 12 మంది మరణించగా.. వేల మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటుందని, పేజర్లలో పేలుడు పదార్థాలను అమర్చి ఉంటుందని లెబనాన్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో..తైవాన్‌కు చెందిన పేజర్ల కంపెనీ గోల్డ్ అపోలో పైనా అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే.. పేలుడుకు గురైన ఏఆర్-924 పేజర్లకు తమకు సంబంధం లేదని తైవాన్ కంపెనీ స్పష్టం చేసింది. హంగేరీ బుడాపెస్ట్‌కు చెందిన ఓ కంపెనీ దగ్గర వాటి తయారీ ట్రేడ్ మార్క్ ఉందని తేలింది. అయినప్పటికీ నార్వే, బల్గేరియా వైపే దర్యాప్తు అధికారుల దృష్టి మళ్లింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన రిన్సన్ జోస్.. కొంతకాలం లండన్‌లోనూ పని చేశాడు. ఆపై సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకున్నాడు. అతని భార్య కూడా ఓస్లోలోనే ఉంది. తాజా పరిణామాలతో కేరళలోని జోస్ కుటుంబం ఆందోళనకు గురైంది. అతన్ని ఇరికించే కుట్ర జరిగిందని ఆరోపణలు చేసింది. మూడు రోజులపాటు అధికారులు అతన్ని కనీసం ఫోన్లో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని భార్య మీడియా వద్ద వాపోయింది. అయితే లెబనాన్ పేలుళ్ల కేసు నుంచి క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ అతన్ని ఇంకా అధికారులు విడుదల చేయలేదని సమాచారం. -
రాహుల్ డీఎన్ఏపై కేరళ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
కేరళలో ‘ఇండియా’ కూటమి సభ్యులైన కాంగ్రెస్, సీపీఎం మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత వేడెక్కింది. తాజాగా సీపీఎం మద్దుతు ఉన్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పీవీ అన్వర్.. రాహుల్ గాంధీ డీఎన్ఏను పరిశీలించాలి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మలప్పురంలోని ఎడతనట్టుకరలో జరిగిన సీపీఎం ఎన్నికల ప్రచార సభలో అన్వర్ ప్రసంగిస్తూ, “రాహుల్‌కు గాంధీ పేరును వాడుకునే హక్కు లేదు. అత్యంత నీచ స్థాయికి దిగజారిపోయాడు. అతను నెహ్రూ కుటుంబంలోనే పుట్టారా? నాకు సందేహాలు ఉన్నాయి. అతని డీఎన్ఏను పరీక్షించాలి” అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై రాహుల్ చేసిన హేళనపై విమర్శలు చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్వర్ వ్యాఖ్యలను మంగళవారం సీఎం విజయన్ కూడా సమర్థించారు. రాహుల్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ఎదుటివారి నుంచి తగిన సమాధానం వస్తుందని గ్రహించాలని హితవు పలికారు. గత వారం కేరళలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ “ఇద్దరు ముఖ్యమంత్రులు జైలులో ఉన్నారు. కేరళ ముఖ్యమంత్రికి ఇలా జరగకపోతే ఎలా? నేను బీజేపీపై 24 గంటలూ విమర్శలు చేస్తులంటే కేరళ ముఖ్యమంత్రి మాత్రం నాపై 24 గంటలూ విమర్శలు చేస్తున్నారు. ఇది కొంచెం అయోమయంగా ఉంది” అని వ్యాఖ్యానించారు. విజయన్ కుమార్తె వీణా ఐటీ సంస్థలో జరిగిన అక్రమ చెల్లింపుల కుంభకోణం, త్రిసూర్‌లోని సహకార బ్యాంకులో జరిగిన మరో కుంభకోణంపై కేంద్ర ఏజెన్సీల దర్యాప్తుల కారణంగానే సీఎం విజయన్ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి బదులిస్తూ “మీ నానమ్మ (ఇందిరా గాంధీ మమ్మల్ని ఒకటిన్నర సంవత్సరాలు (ఎమర్జెన్సీ సమయంలో) జైలులో పెట్టింది రాహుల్” అని సీఎం విజయన్ గుర్తు చేశారు. -
The Goat Life: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను
సౌదీలో రెండేళ్ల పాటు 700 గొర్రెలను ఒంటరిగా మేపాడు. మరో మనిషితో మాట్లాడలేదు. మరో మాట వినలేదు. ఇసుకతో స్నానం ఇసుకే దాహం ఇసుక తప్ప మరేం కనిపించని ఒంటరితనం. బానిస బతుకు. కాని బతికి దేశం తిరిగి వచ్చాడు. 1995లో అతని జీవితం నవలగా వెలువడి మలయాళంలో సెన్సేషన్ సృష్టించింది. ప్రస్తుతం 138వ ప్రచురణకు వచ్చింది. అతని జీవితం ఆధారంగానే ‘గోట్ లైఫ్’ సినిమా తాజాగా విడుదలైంది. కేరళకు చెందిన నజీబ్ సంఘర్షణ ఇది. కేరళలోని అలెప్పి దగ్గరి చిన్న ఊరికి చెందిన నజీబ్ కోరుకుంది ఒక్కటే. సౌదీకి వెళ్లి ఏదో ఒక పని చేసి కుటుంబానికి నాలుగు డబ్బులు పంపాలన్నదే. ఆ రోజుల్లో కేరళ నుంచే కాదు దక్షిణాది రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు చాలామంది పని కోసం వలస వెళ్లేవారు. నజీబ్ కూడా సౌదీకి వెళ్లాలనుకున్నాడు. ఏజెంట్ అతనికి ఒక మాల్లో సేల్స్‌మ్యాన్‌గా పని ఉంటుందని పంపాడు. అలా నజీబ్ సౌదీలో అడుగు పెట్టాడు. అది 1993వ సంవత్సరం. రెండు రోజుల తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో దిగాక నజీబ్ రెండు రోజుల పాటు ప్రయాణిస్తూనే ఉన్నాడు... అప్పుడు గాని అర్థం కాలేదు తాను మోసపోయానని. ఎడారి లోపల అతణ్ణి అరబ్ షేక్‌కు అప్పజె΄్పారు. ఆ షేక్ అక్కడే ఒక షెడ్డు వేసుకుని ఉండేవాడు. నజీబ్‌కు 700 గొర్రెలను కాచే పని అప్పజె΄్పాడు. వేరే బట్టలు ఇవ్వలేదు. స్నానానికి నీళ్లు ఇవ్వలేదు. బతకడానికి మాత్రం ముతక రొట్టెలు పడేసేవాడు. ఆ రొట్టెల్ని గొర్రెపాలలో తడిపి కొద్దిగా తినేవాడు నజీబ్. యజమాని, అతని తమ్ముడు ఈ ఇద్దరు మాత్రమే నజీబ్‌కు కనిపించేవారు. వారి అరబిక్ భాష తప్ప మరో భాష వినలేదు. మరో మనిషిని చూడలేదు. ‘నేను ఏడ్చినప్పుడల్లా వారు కొట్టేవారు’ అంటాడు నజీబ్. భ్రాంతులు నజీబ్‌కు ఎడారిలో ఉండి భ్రాంతులు మొదలయ్యాయి. అతడు గొర్రెల మధ్య ఉండి ఉండి తాను కూడా ఒక గొర్రెనేమో అనుకునేవాడు. రెండేళ్ల పాటు ఇలాగే జరిగింది. ఒకరోజు ఆ అన్నదమ్ములిద్దరూ పెళ్లి ఉందని వెళ్లారు. ఆ అదను కోసమే చూస్తున్న నజీబ్ ఎడారిలో పరిగెత్తడం మొదలుపెట్టాడు. దారి లేదు.. గమ్యమూ తెలియదు. పరిగెట్టడమే. ఒకటిన్నర రోజు తర్వాత మరో మలయాళి కనిపించి దారి చె΄్పాడు. అతడు కూడా తనలాంటి పరిస్థితిలో ఉన్నవాడే. చివరకు ఒక రోడ్డు కనిపించి రియాద్ చేరాడు. అక్కడి మలయాళీలు నజీబ్‌ను కాపాడారు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోతే తగిన పత్రాలు లేనందున 10 రోజులు జైల్లో పెట్టి ఇండియా పంపారు. నవల సినిమాగా నజీబ్ తిరిగి వచ్చాక కోలుకొని బెహ్రయిన్ వెళ్లాడు ఈసారి పనికి. అక్కడ పని చేస్తున్న రచయిత బెన్యమిన్‌కు నజీబ్‌తో పరిచయమైంది. నజీబ్ జీవితాన్ని బెన్యమిన్ నవలగా ‘ఆడు జీవితం’ (గొర్రె బతుకు) పేరుతో రాసి 2008లో వెలువరించాడు. అది సంచలనంగా మారింది. ఇప్పటికి వందకు పైగా ఎడిషన్స్ వచ్చాయి. 8 భాషల్లో అనువాదమైంది. ఆ నవల ్రపాశస్త్యం సినిమా రంగాన్ని ఆకర్షించింది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ‘ఆడు జీవితం’ పేరుతో నటించి మొన్న మార్చి 28న విడుదల చేశాడు. తెలుగులో గోట్‌లైఫ్ పేరుతో అనువాదమైంది. వాస్తవిక సినిమాగా ఇప్పటికే గోట్‌లైఫ్ ప్రశంసలు పొందుతోంది. -
ఫ్యామిలీ కోసం సొంతంగా విమానం తయారు చేశాడు!
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ సమయం ఎంతో భారంగా గడిచింది. కొంత మంది మాత్రం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని రకరకాల వ్యాపకాలతో తమ సృజనకు పదునుపెట్టుకున్నారు. కేరళకు చెందిన ఎన్నారై అశోక్ అలిసెరిల్ తమరాక్షన్ అయితే ఏకంగా చిన్నపాటి విమానాన్నే తయారు చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తాను సొంతంగా తయారు చేసిన ఫోర్ సీటర్ విమానంలో కుటుంబంతో కలిసి యూరప్ యాత్ర చేస్తున్నాడు అశోక్. కేరళలోని అలప్పుజా ప్రాంతానికి చెందిన ఆయన లండన్‌లో స్థిరపడ్డాడు. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి 2006 యూకే వచ్చిన అశోక్ ప్రస్తుతం ఫోర్డ్ మోటార్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 18 నెలలు శ్రమించి.. కరోనా సమయంలో విధించిన లాక్డౌన్ విధించడంతో విమాన తయారీకి ఉపక్రమించాడు. దాదాపు 18 నెలలు శ్రమించి ‘స్లింగ్ టీఎస్ఐ’ మోడల్లో చిన్న విమానాన్ని తయారు చేశాడు. తన చిన్న కూతురు దియా పేరు కలిసొచ్చేలా విమానానికి ‘జి-దియా’ అని నామకరణం చేశాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. కేరళ మాజీ ఎమ్మెల్యే ఏవీ తమరాక్షన్ కుమారుడైన అశోక్‌కు పైలట్ లైసెన్స్ కూడా ఉంది. దీంతో కుటుంబంతో కలిసి తన విమానంలో ఇప్పటివరకు జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ దేశాలను చుట్టేసి వచ్చాడు. విమానాన్ని ఎలా తయారు చేశానంటే.. ‘2018లో పైలట్ లైసెన్స్ పొందిన తర్వాత ప్రయాణాల కోసం రెండు సీట్ల విమానాలను అద్దెకు తీసుకునేవాడిని. నా ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్లడానికి నాలుగు సీట్ల విమానం అవసరం. కానీ అవి చాలా అరుదుగా దొరుకుతాయి. జోహన్నెస్‌బర్గ్(దక్షిణాఫ్రికా)కు చెందిన స్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ 2018లో టీఎస్ఐ మోడల్ విమానాన్ని తయారు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో ఒకసారి నేను స్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీని కూడా సందర్శించాను. ఆ తర్వాత నా సొంత విమాన తయారీకి అవసరమైన వస్తువులను ఆర్డర్‌పై అక్కడి నుంచి తెప్పించాను. లాక్‌డౌన్‌తో సమయం దొరకడంతో విమాన తయారీపై దృష్టి పెట్టాన’ని అశోక్ వివరించాడు. విమాన తయారీకి దాదాపు రూ.1.8 కోట్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. కలల విమానంలో గగన విహారంతో వార్తల్లోకి ఎక్కారు అశోక్ అలిసెరిల్ తమరాక్షన్. అతడిని గురించి విన్నవారంతా ‘సూపర్’ అంటూ మెచ్చుకుంటున్నారు. (క్లిక్: స్పైస్‌జెట్‌కు షాక్.. ఆంక్షలు విధించిన డీజీసీఏ) -
రంజిత్ స్ఫూర్తిగాథ.. నైట్‌వాచ్‌మెన్ నుంచి ఐఐఎం..
కాసర్గడ్: ఐఐఎం రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న రంజిత్ రామచంద్రన్‌ది స్ఫూర్తిదాయక చరిత్ర. నైట్‌వాచ్‌మన్‌గా పనిచేసి, ఆ తరువాత ఐఐటీలో చదువుకుని, ప్రస్తుతం ఐఐఎం రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి చేరారు. ఈ వివరాలను ఫేస్బుక్ పోస్ట్‌లో ఆయన వివరించారు. కూలిపోయే దశలో ఉన్న టార్పాలిన్‌తో కప్పిన తన చిన్న గుడిసె ఫొటోను కూడా అందులో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు ఫేస్బుక్లో 37 వేల లైక్స్ వచ్చాయి. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ కూడా రంజిత్‌కు అభినందనలు తెలిపారు. కాసర్గడ్లోని పనతుర్‌లో ఉన్న ఒక టెలిఫోన్ ఎక్ఛ్సేంజ్‌లో రంజిత్ నైట్ వాచ్‌మన్‌గా పనిచేశారు. అలా చేస్తూనే పీఎస్ కాలేజ్ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఐఐటీ మద్రాస్‌లో సీటు సంపాదించారు. తనకు మలయాళం మాత్రమే తెలియడం, ఆంగ్లం రాకపోవడంతో అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి పీహెచ్డీ కోర్సు వదిలేద్దామనుకున్నారు. కానీ గైడ్ డాక్టర్ సుభాష్ సహకారంతో కోర్సు పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరారు. పేదరికంతో పాఠశాల విద్యను మధ్యలోనే వదిలేశానని, తన తండ్రి టైలర్ కాగా, తల్లి ఉపాధి కూలీ అని ఆ పోస్ట్‌లో రంజిత్ తెలిపారు. -
జాక్‌పాట్.. రాత్రికిరాత్రే కోటీశ్వరుడు
లండన్: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. యూకేలోని భారత సంతతి చెందిన ఓ వ్యక్తికి అనుకోకండా అదృష్టం తలుపు తట్టింది. లోట్టోలాండ్ నుంచి 3.3 కోట్ల రూపాయల జాక్‌పాట్ కోట్టి రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. వివరాల ప్రకారం.. కేరళకు చెందిన షాజీ మథ్యూ అనే వ్యక్తి కటుంబంతో కలిసి యూకేలో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో అతడు సరదాగా అట్లాంటిస్ కాసియోఅండర్ వాటర్ థీమ్ ఆన్లైన్ స్లాట్ గేమ్ ఆడాడు. కొద్ది రోజులకు అతడికి లాట్టోలాండ్ నుంచి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో అతడు డబ్బులు గెలుచుకున్నట్లు ఉంది. అయితే మొదట అతడికి నమ్మకం కలగలేదు. ఆ తర్వాత డబ్బులు గెలుచుకున్నట్లు లోట్టోలాండ్ నుంచి కాల్ వచ్చింది. అది ప్రాంక్ కాల్ నుకున్నాడు. చివరికి ఈ ప్రాసెస్ మొదలు పెట్టగా అతడు రూ. 3.3 కోట్లు గెలుచుకున్నాడు. (చదవండి: జాక్‌పాట్ అంటే నీదే తమ్ముడు) దీనిపై షాజీ ఓ ఇంటర్వ్యూలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ‘జీవితంలో స్థిరపడటానికి సరిపోయే డబ్బు వచ్చింది. ఇప్పటికి నమ్మలేకపోతున్న. మొదట ఆ డబ్బు మూడున్నర లక్షలు అనుకున్నాను. అందులో మొత్తం ఎనిమిది అంకేల డిజిట్ ఉందని, ఆ మొత్తం అక్షరాలు మూడున్నర కోట్లని వారు చెప్పేవరకు కూడా నేను గుర్తించలేదు. అప్పటి వరకు నేను అది మూడున్నర లక్షలే అనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ డబ్బుతో ఏం చేస్తావని అడగ్గా.. త్వరలో అతడి వివాహ వార్షికొత్సవం ఉందని, సంతోషంగా కుటుంబంతో కలిసి పెళ్లిరోజును వేడుకలా చేసుకుంటానన్నాడు. ఆ తర్వాత తన భార్యతో జాయింట్ అకౌండ్ తీసుకుని అందులో ఈ డబ్బును దాస్తానని, ఇందులో కొంత మొత్తాన్ని తమ పిల్లల పైచదువుకు, ఇంటి నిర్మాణం ఖర్చు చేస్తానని చెప్పాడు. ఇక మరికొంత డబ్బును అనాథాశ్రమానికి ఇస్తానన్నాడు. కాగా లోట్టోలాండ్ అట్లాంటిస్ కాసియో ఆన్‌లైన గేమ్ లాటరీని ఆసియాలో 2013లో ప్రారంభించారు. (చదవండి: ఆ యాచకులు రాత్రికి రాత్రే లక్షాధికారులయ్యారు!) -
పోలీసుల ప్రచారం.. బిత్తరపోయాడు
సాక్షి, తిరువనంతపురం/జైపూర్: ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తూ చర్చనీయాంశంగా మారింది కీకీ ఛాలెంజ్. పోలీసులు మాత్రం అది ప్రమాదకరమైందంటూ ఆంక్షలు విధించేస్తున్నా.. యువత అవేం పట్టించుకోకుండా సవాల్‌గా తీసుకుని మరీ ఊగిపోతోంది. అయితే ఈ ఛాలెంజ్‌కు అడ్డుకట్ట వేసే క్రమంలో జైపూర్ పోలీసులు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘ఇన్ లవింగ్ మెమోరీ ఆఫ్ కేకే.. కీకీ ఛాలెంజ్‌లో షీగ్గీ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు’ అంటూ దండేసి ఉన్న ఓ యువకుడి ఫోటో జైపూర్ పోలీసులు ట్విటర్ ఖాతాలో ఉంచారు. ‘ఛాలెంజ్ చేసి ప్రాణాలు తీసుకోకండి’ అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ యాడ్‌ను కొచ్చి(కేరళ)కి చెందిన జవహార్ సుభాష్ చంద్ర(30) చూసి బిత్తర పోయాడు. అందుకు కారణం ఆ ఫోటోలో ఉంది అతనే కాబట్టే. సోషల్ మీడియాలో విస్తృతంగా ఆ ఫోటో వైరల్ కావటంతో ఏం జరిగిందోనన్న కంగారుతో బంధువులు అతనికి ఫోన్ కాల్స్ చేయటం ప్రారంభించారంట. మీడియా ముందుకు వచ్చిన జవహార్ ఈ విషయాన్ని చెబుతూ వాపోతున్నాడు. (కీకీ విన్నర్స్ ‘తెలంగాణ’ కుర్రాళ్లే...) ఫోటో ఎలా దొరికిందంటే.. ఎక్కడో కొచ్చిలో ఉంటున్న అతని ఫోటో జైపూర్ పోలీసులకు ఎలా దొరికిందంటే.. 2008లో జవహార్ మోడలింగ్ చేసేవాడు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్ అయిన జవహార్ అంకుల్.. అతన్ని ఫోటోలు తీసి వాటిని షట్టర్‌స్టాక్‌లో ఉంచారు. ఆ సైట్ నుంచి ఫోటోలను కొనుగోలు చేసిన పోలీసులు ఇప్పుడు ఇలా యాడ్ ఇచ్చారన్న మాట. ‘ఇదొక ప్రచార కార్యక్రమం. ప్రజలకు మంచి చేయాలనే ప్రయత్నం. లీగల్‌గానే అతని ఫోటోను కొనగోలు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో యాడ్‌ను వెనక్కి తీసుకోం. అతను అభ్యంతరం వ్యక్తం చేసినా సరే’ అని కమిషనర్ సంజయ్ అగర్వాల్ స్పష్టం చేశారు. (దొంగతనం చేసి మరీ...) -
స్వదేశానికి వస్తుండగా.. కోట్లు వచ్చిపడ్డాయ్!
అబుదబీ : అదృష్టం అంటే అతడిదే. పొట్టకూటి కోసం వెళ్లిన పరాయి దేశాన్ని శాశ్వతం వదిలి స్వదేశానికి వచ్చేస్తున్న వేళ లాటరీ రూపంలో అదృష్టం వీడ్కోలు పలికింది. ఏకంగా రూ.13.5 కోట్లు వచ్చి ఒళ్లో పడ్డాయి! ఈ లక్కీమేన్ కేరళ వాసి టోజో మాథ్యూ(30). అబుదబీలో సివిల్ సూపర్వైజర్గా పనిచేసిన ఆయన దుబాయిని వదిలి స్వదేశానికి వచ్చేస్తుండగా అదృష్ట దేవత కరుణించింది. అబుదబీ విమానాశ్రయంలో ఆయన కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెలవారీ బిగ్ టికెట్ రాఫెల్ డ్రాలో దాదాపు రూ. 13.1 కోట్లు(7 మిలియన్ల దిర్హమ్లు) గెల్చుకున్నట్టు‘ ఖలీజ్ టైమ్స్’ వెల్లడించింది. ‘భారత్‌కు పయనమవుతూ జూన్ 24న అబుదబీ విమానాశ్రయంలో టికెట్ కొన్నాను. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న నా భార్యతో కలిసుండాలన్న ఉద్దేశంతో దుబాయ్‌ను వదిలిపెట్టాలనుకున్నా. లాటరీలో భారీ మొత్తంలో డబ్బు వచ్చిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కేరళలో సొంత ఇల్లు కట్టుకోవాలన్నది నా చిరకాల స్వప్నం. ఈ లాటరీతో నా కల తీరనుంద’ని టోజో మాథ్యూ సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం తీసిన డ్రాలో ఆయనతో మరో 9 మంది లాటరీ గెలుచుకున్నారు. విజేతల్లో ఐదుగురు భారతీయులు ఉండటం విశేషం. -
షాకింగ్ లైవ్ స్ట్రీమింగ్.. వ్యక్తి అరెస్టు!
సాక్షి, కొచ్చి: చేతిలో స్మార్ట్‌ఫోన్.. అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఏదైనా ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం లభిస్తోంది. అయితే, ఈ టెక్నాలజీని దుర్వినియోగపరిచేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా కేరళలో ఓ యువకుడు మహిళతో శృంగారాన్ని నెరుపుతూ.. దానిని ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తనపై అత్యాచారం చేశాడని పేర్కొంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానిక మీడియా, పోలీసుల కథనాల ప్రకారం వివరాలివి.. 23 ఏళ్ల లినుకు ఇడుక్కీలోని ఓ వస్త్రాల దుకాణంలో పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. వివాహిత అయిన ఆమెకు ఓ చిన్నారి ఉంది. అయితే, భర్తకు దూరంగా ఉంటోంది. ఇద్దరూ ఆరు నెలలుగా సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన లిను తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో అతను మహిళతో శృంగారాన్ని జరుపుతున్న ఘటనను ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఈ వీడియో స్థానికంగా వైరల్‌గా మారిపోయింది. ఇద్దరు పరస్పర సమ్మతితో శృంగారంలో పాల్గొన్నప్పటికీ.. అతను ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సంగతి ఆమెకు తెలిసి ఉండకపోవచ్చునని పోలీసులు అంటున్నారు. లైకుల కోసమే తాను లైవ్ స్ట్రీమింగ్ చేశానని..ఈ విషయం ఆమెకు తెలుసనని లిను ఆరోపిస్తున్నాడు. అతని ఫోన్లో ఇద్దరూ సాన్నిహితంగా గడుపుతున్న వీడియోలు మరికొన్ని దొరికాయని పోలీసులు అంటున్నారు. మహిళపై ప్రతీకారం తీర్చుకోవడానికో, కోపం ప్రదర్శించడానికో అతను ఇలా ప్రత్యక్ష ప్రసారం చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనడంతో మహిళ పెట్టిన రేప్ కేసు మాత్రం నిలబడదని అంటున్నారు. -
వైద్యశాస్త్రంలో మరో అద్భుతం
చెన్నై: ఎవరైనా దూకుడుగా ప్రవర్తిస్తే ‘ఎదిరించడానికి నీకు ఎన్ని గుండెలు’ అంటూ నిలదీస్తారు. ఎందుకంటే ఎవరికైనా ఉండేది ఒకటే గుండె కనుక. అయితే, ఇక కేరళకు చెందిన ఆ వ్యక్తిని మాత్రం అలా బెదిరించడానికి ఏమాత్రం వీల్లేదు. ఆయనకు కుడి, ఎడమలో రెండు గుండెలు ఉండటమే ఇందుకు కారణం. ఆ వివరాలిలా ఉన్నాయి... గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కేరళకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి చికిత్స కోసం తమిళనాడు కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రి కోవాయ్ మెడికల్ సెంటర్లో చేరాడు. పరీక్షించిన వైద్యులు గుండె పనితీరు మరీ దారుణంగా ఉన్నట్లు గుర్తించి ప్రాణాలు నిలబెట్టాలంటే మరో గుండెను అమర్చక తప్పదని నిర్ణయించారు. అదే ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్‌కు గురైన ఒక మహిళ గుండెను అమర్చాలని భావించారు. అయితే ఆమె గుండె పనితీరు కూడా అంత సంతృప్తికరంగా లేదని, కేవలం పదిశాతం మాత్రం పనిచేస్తున్నట్లు గుర్తించారు. కేరళకు చెందిన వ్యక్తి శరీరంలోని గుండెను తొలగించకుండా మహిళ నుండి సేకరించిన గుండెను కుడివైపున అమర్చాలని వైద్యలు తీర్మానించారు. డాక్టర్ ప్రశాంత్ వైజయంత్ నేతృత్వంలోని వైద్యుల బృందం సుమారు నాలుగు గంటలపాటూ శ్రమించి ఆపరేషన్‌ను రెండు రోజుల క్రితం సమర్దవంతంగా పూర్తిచేశారు. ప్రస్తుతం అతని శరీరంలోని రెండు గుండెలు సహజరీతిలో పనిచేస్తున్నాయి. రెండు గుండెల నుండి చప్పుళ్లు వినపడుతున్నాయి. భారతదేశంలో రెండు గుండెలు కలిగిన తొలి వ్యక్తిగా వైద్యులు నిర్దారించారు. అయితే పేషెంట్ వివరాలను డాక్టర్ ప్రశాంత్ బృందం గోప్యంగా ఉంచింది. -
ఆటో డ్రైవర్‌కు కలిసి వచ్చిన అదృష్టం
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్టు ఓ ఆటో డ్రైవర్ ఏకంగా మహీంద్రా స్కార్పియో ఎస్యూవీ మోడల్‌ను అనుకరించి ఓ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. స్కార్పియో వాహనాన్ని త్రీ వీలర్ ఆటోగా తయారు చేసి ఏకంగా పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మనసు దోచాడు. ప్రతిఫలంగా ఒక సరికొత్త మహేంద్రా ఫోర్ వీలర్ కారును అందుకున్నాడు. కేరళకు చెందిన సునీల్ మహీంద్ర కంపెనీనుంచి ‘మహీంద్ర సుప్రో మినీ ట్రక్’ను అందుకున్నాడు. వివరాల్లోకి వెళితే కొద్ది రోజుల క్రితం మార్చి 19 అనిల్ ఫణిక్కర్ మహీంద్రా స్కార్పియో మోడల్లో ఉన్న ఓఆటో ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. భారతీయ రోడ్లపై స్కార్పియో ఎంత పాపులరో తెలుపుతూ ఆనంద్ మహీంద్రకు ట్యాగ్ చేశారు. దీనికి ఆనంద్ మహీంద్ర స్పందించారు. సదరు ఆటో రిక్షా యజమానిని కనుక్కోవాలని ట్వీట్ చేశారు. మహీంద్రా మ్యూజియం కోసం ఆ రిక్షాను తాను తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు దాని స్థానంలో బహుమతిగా అతనికి ఓ బ్రాండ్ న్యూ వాహనాన్ని ఇస్తానని ప్రకటించారు. మహేంద్ర టీం కేరళకు చెందిన సునీల్‌ని గుర్తించిందని ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ ద్వారా బుధవారం వెల్లడించారు. అతనికి కొత్త వాహనం అందించినట్టు తెలిపారు. Here's Sunil, the proud owner of the 3 wheeler 'Scorpio', now a happy owner of a 4 wheeler. All thanks to you twitterati! (2/2) pic.twitter.com/5nb12j2dnj — anand mahindra (@anandmahindra) May 3, 2017 -
‘నా భుజంపై వేరొకరి చేయి తప్పుకాదు’
తిరువనంతపురం: ప్రేమికుల దినోత్సవం రోజు వేధింపులకు గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంటి ముందు ఉరేసుకొని కనిపించాడు. వీడియోలు తీసి తమను అవమానించడమే కాకుండా పోలీసులు నుంచి కూడా విపరీతమైన వేధింపుల ప్రశ్నలు రావడం వల్లే అతడు ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని పలక్కాడ్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ప్రేమికుల దినోత్సవం రోజు కొల్లాం బీచ్‌కు వెళ్లాడు. అక్కడ టాయిలెట్స్ వంటివి లేవు. దీంతో తన ప్రియురాలు అక్కడే ఉన్న ఓ చెట్ల పొదల్లోకి వెళ్లి వ్యక్తిగత కారణాలతో వెళ్లగా ఆ రోజు ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకించే స్వచ్చంద సంస్థ అంటూ చెప్పుకొచ్చిన కొంతమంది యువకులు ఆ యువతిని వేధించారు. ఇది గమనించిన ఆమె ప్రేమికుడు వారిని అడ్డుకోగా అతడిపై చేయి చేసుకున్నారు. అసలు పొదల్లో ఏం పని అంటూ అడ్డగోలుగా మాట్లాడారు. వారిద్దరిని కలిపి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి నానా రచ్చ చేశారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా అల్లరి చేసిన వారిని అరెస్టు చేశారు. అయితే, అంతకుముందు బాధితులను హింసించే తీరుగా ప్రశ్నించారు. ఈ విషయం అక్కడ ఇక్కడా తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేరుగా గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈలోగా బాధిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం అనుమానం రేకెత్తిస్తోంది. ఇలాంటి నేరాలను ఏమాత్రం ఉపేక్షించరాదని మండిపడ్డారు. మరోపక్క, పోలీసులు కూడా దారుణాలకు దిగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రేమికుల రోజు అయిపోయిన వారం రోజుల తర్వాత రాజా(24), స్వప్న(23)(పేర్లు మార్చాం) అనే ఇద్దరిని తిరువనంతపురం పార్క్‌లో పోలీసులు వేధించినట్లు తెలుస్తోంది. వారిద్దరు చనువుగా ఉన్నారని వేధించి, ప్రశ్నించి, వారికి పెద్ద మొత్తంలో ఫైన్ వేశారంట. దీనిపై స్వయంగా స్వప్ననే మీడియాకు చెబుతూ ‘వేరొకరి చేయి నా భుజంపై ఉండటం తప్పుకాదు.. చిన్నచిన్నవాటికే పోలీసులు ఇలా కేసులు పెడతామని బెదిరించే చర్యలు ఆగిపోవాలి. ఇలాంటి పనులకు ముగింపు పలకాలి’ అని చెప్పింది. -
అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలివ్వకుండా..
కోజికోడ్: మతవిశ్వాసాల పేరుతో ఓ వ్యక్తి అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇవ్వకుండా 24 గంటలు అడ్డుకున్న ఘటన కేరళలో జరిగింది. అబు బక్ర్ అనే వ్యక్తి భార్య కోజికోడ్‌లోని ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే, మసీదులో ఐదు ప్రార్థనలు (ఆజాన్) పూర్తయ్యేవరకు శిశువుకు మొదటి ఆహారం అందివ్వకూడదంటూ అతడు అడ్డుకున్నాడు. అతని తీరుపై వైద్యులు, పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. 24 గంటలపాటు తల్లిపాలు ఇవ్వకుంటే శిశువు ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశముందని చెప్పారు. దీంతో వాదనకు దిగిన అతను తన భార్య, శిశువును తీసుకొని ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్లారనే సమాచారం తెలియరాలేదు. ‘ఐదు అజాన్లు వినేవరకు అతను తన కొడుకుకు తల్లిపాలు ఇవ్వనివ్వబోనని అడ్డుకున్నాడు’ అని ఆస్పత్రి వైద్యుడు సాజి సీకే తెలిపారు. ‘ఇలా చేయడం వల్ల శిశువు ప్రాణాలు తీవ్ర ప్రమాదంలో పడే అవకాశమందని చెప్పినా అతను వినిపించుకోలేదు. నవజాత శిశువుకు ప్రతిరెండుగంటలకు ఒకసారి తల్లిపాలు, లేదా పాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల శిశువుకు ఎలాంటి ప్రాణాపాయ ముప్పు వాటిల్లకుండా చూడొచ్చు’ అని ఆయన తెలిపారు. భార్యను శిశువును తీసుకొని వెళ్లతున్న అతనిని ఒప్పించేందుకు వైద్యులు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, సిటీ మెడికల్ కాలేజీకి వెళుతున్నానంటూ అతను గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లిపోయాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
అదృష్టం తన్నుకొస్తే ఇలాగే ఉంటుంది!
అదృష్టం రాసిపెట్టి ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. విమానం దాదాపు కూలిపోయినంత పనై.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడమే ఒక అదృష్టం అయితే.. అంత పెద్ద ప్రమాదం తప్పిన ఆరు రోజులకే ఆరున్నర కోట్ల రూపాయల లాటరీ దక్కడం అంటే ఇంకెంత అదృష్టం అవుతుంది!! కేరళకు చెందిన మహ్మద్ బషీర్ అబ్దుల్ ఖాదర్ (62)కు సరిగ్గా ఇలాగే జరిగింది. కొచ్చి నుంచి వెళ్లి దుబాయ్ విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయిన విమానం నుంచి బయటపడిన 300 మంది ప్రయాణికుల్లో ఆయనొకరు. దుబాయ్ విమానాశ్రయంలో ఆయన కొన్న లాటరీ టికెట్‌కు ఏకంగా రూ. 6.67 కోట్ల రూపాయల బంపర్ బహుమతి దక్కింది. ఈద్ సందర్భంగా తన సొంత ఊరు తిరువనంతపురం వెళ్తూ.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఆయనా టికెట్ కొన్నారు. కారు డీలర్ గ్రూపులో ఫ్లీట్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న ఖదర్ ఎప్పుడు భారతదేశం వస్తున్నా ఓ టికెట్ కొనడం అలవాటు. అలా ఇప్పటికి 17 టికెట్లు కొన్నారు. ఆయన డిసెంబర్లో రిటైర్ కావాల్సి ఉంది. దాంతో మహా అయితే ఇంకొక్కసారి మాత్రమే ఆయన టికెట్ కొనగలిగేవారు. ఈలోపు అదృష్టం తన్నుకొచ్చి.. ఇటు ప్రాణాపాయం తప్పడంతో పాటు అటు భారీ మొత్తం కూడా కలిసొచ్చింది. దుబాయ్‌లో 37 ఏళ్లుగా ఉంటున్నానని, ఇక ఇది తనకు స్వదేశం లాగే అనిపిస్తోందని.. విమాన ప్రమాదం నుంచి తప్పుకొన్నందుకు దేవుడు తనకు రెండో జన్మ ఇచ్చినట్లు అనిపిస్తోందని ఖదర్ చెప్పారు. మంచి పనులు చేయడానికే తనకు ఇలా బతుకునిచ్చాడని అన్నారు. అవసరంలో ఉన్నవాళ్లకు సాయం చేసే తరహా ఉద్యోగం ఏదైనా ఉంటే రిటైర్ అయిన తర్వాత భారతదేశంలో చూసుకుంటానని తెలిపారు. ఖదర్‌కు నెలకు రూ. 1.45 లక్షల జీతం వస్తుంది. కానీ, పుట్టిన 13వ రోజునే కింద పడిపోయి పక్షవాతం బారిన పడిన తన 21 ఏళ్ల కుమారుడి చికిత్స కోసం చాలా ఖర్చవుతోంది. అతడికి ఆపరేషన్ కోసం కొన్నాళ్ల క్రితం తాను రూ. 18 లక్షల అప్పు చేశానని, ఎలాగోలా దాన్ని తీర్చగలిగానని చెప్పారు. జీతం డబ్బులతోనే తన కూతురి పెళ్లి కూడా చేశారు. -
ఔను! నేను ఉగ్రవాదినే!
కోజికోడ్: 'ప్రజలు నన్ను ఉగ్రవాది అని పిలువొచ్చు. అల్లా చూపిన మార్గంలో పోరాడటం ఉగ్రవాదమే అయితే.. అవును నేను ఉగ్రవాదినే' అంటూ ఓ కేరళ యువకుడు మెసేజ్ పంపాడు. కేరళకు చెందిన 15 మంది యువకులు గతకొద్దిరోజులుగా కనిపించకుండా పోయారు. ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ లో వారు చేరినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా కనిపించకుండాపోయిన వారిలో మహమ్మద్ మర్వాన్ ఒకడు. అతను తాజాగా టెలిగ్రామ్ యాప్ లో ఒక మెసేజ్ పెట్టాడు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధీనంలో ఉన్న పశ్చిమాసియా నుంచి తాను ఈ మెసేజ్ పంపినట్టు యువకుడు తెలుపగా.. ఈ విషయాన్ని ఇంకా నిఘా సంస్థలు ధ్రువీకరించలేదు. కశ్మీర్, గుజరాత్, ముజఫర్ నగర్ లో ముస్లింల మరణాలపై ఐఎస్ చేపట్టిన పని పూర్తయిన తర్వాత తాను తిరిగి వస్తానని మర్వాన్ పేర్కొన్నాడు. అమెరికా, రష్యా దళాల దాడుల్లో ముస్లింలు, ముస్లిం చిన్నారులు బలైపోతున్నారని, ముస్లిం సమాజంపై దాడులు జరుగుతుంటే తాను ఇంట్లో సుఖంగా ఎలా ఉండగలనని అతడు అన్నాడు. -
అందాన్ని ఇవ్వలేని సబ్బు.. పరిహారం ఇచ్చింది
తిరువనంతపురం: మా ప్రొడక్ట్ వాడి అందంగా మారండి అంటూ ఉదరగొట్టే యాడ్లను రోజూ చూస్తూనే ఉంటాం. అవి అన్ని వట్టి మాటలే అనే విషయం మనకూ తెలుసు. కానీ, ఓ యాడ్‌ను సీరయస్‌గా తీసుకున్నచాతూ అనే శిల్పి ఏకంగా ఓ సబ్బును సంవత్సరం పాటూ వాడాడు. అయినా అతను ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో విసిగిపోయిన అతను ఏకంగా ఆ యాడ్‌లో నటించిన మలయాళ మెగాస్టార్ మమ్మూట్టీ, సదరు సంస్థపై 2015 సెప్టెంబర్‌లో వాయానంద్లోని వినియోగదారుల కోర్టులో కేసు పెట్టాడు. దీంతో చాతూకు, ఇందులేఖ సంస్థ రూ.30,000లు పరిహారంగా ఇవ్వడానికి అంగీకరించింది. సమాజంలో ఎంతో పలుకుబడి ప్రభావం ఉన్న మమ్మూట్టీ నటించిన ఇందులేఖ సబ్బు యాడ్‌ను చూసి ఆ సబ్బును వాడానని కానీ, కొంచెం కూడా మార్పు రాలేదని చాతూ తెలిపాడు. ఇందులేఖ సబ్బు ట్యాగ్‌లైన్- 'సౌందర్యం నిన్గలే తేడి వరుం' (అందం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది) అనే విషయాన్ని కూడా కోర్టు వాదనల సందర్భంగా సంస్థ ప్రతినిధులను ప్రశ్నించింది. దీంతో కేసుపై ఏమీ వాదించకుండానే ఆ వ్యక్తికి పరిహారం చెల్లించడానికి ఆ సంస్థ అంగీకరించింది.