ఔను! నేను ఉగ్రవాదినే! | Yes, I am a terrorist, texts missing Kerala man | Sakshi
Sakshi News home page

ఔను! నేను ఉగ్రవాదినే!

Published Sun, Jul 17 2016 8:14 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

ఔను! నేను ఉగ్రవాదినే!

ఔను! నేను ఉగ్రవాదినే!

కోజికోడ్: 'ప్రజలు నన్ను ఉగ్రవాది అని పిలువొచ్చు. అల్లా చూపిన మార్గంలో పోరాడటం ఉగ్రవాదమే అయితే.. అవును నేను ఉగ్రవాదినే' అంటూ ఓ కేరళ యువకుడు మెసేజ్ పంపాడు. కేరళకు చెందిన 15 మంది యువకులు గతకొద్దిరోజులుగా కనిపించకుండా పోయారు. ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ లో వారు చేరినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా కనిపించకుండాపోయిన వారిలో మహమ్మద్ మర్వాన్ ఒకడు. అతను తాజాగా టెలిగ్రామ్ యాప్ లో ఒక మెసేజ్ పెట్టాడు.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధీనంలో ఉన్న పశ్చిమాసియా నుంచి తాను ఈ మెసేజ్ పంపినట్టు యువకుడు తెలుపగా.. ఈ విషయాన్ని ఇంకా నిఘా సంస్థలు ధ్రువీకరించలేదు. కశ్మీర్, గుజరాత్, ముజఫర్ నగర్ లో ముస్లింల మరణాలపై ఐఎస్ చేపట్టిన పని పూర్తయిన తర్వాత తాను తిరిగి వస్తానని మర్వాన్ పేర్కొన్నాడు. అమెరికా, రష్యా దళాల దాడుల్లో ముస్లింలు, ముస్లిం చిన్నారులు బలైపోతున్నారని, ముస్లిం సమాజంపై దాడులు జరుగుతుంటే తాను ఇంట్లో సుఖంగా ఎలా ఉండగలనని అతడు అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement