ఆటో డ్రైవర్‌కు కలిసి వచ్చిన అదృష్టం | Impressed by Scorpio look-alike auto, Anand Mahindra gifts Kerala man a Supro mini truck | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌కు కలిసి వచ్చిన అదృష్టం

Published Thu, May 4 2017 12:28 PM | Last Updated on Sat, Sep 15 2018 7:55 PM

ఆటో డ్రైవర్‌కు కలిసి వచ్చిన అదృష్టం - Sakshi

ఆటో డ్రైవర్‌కు కలిసి వచ్చిన అదృష్టం

కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి అన్నట్టు ఓ ఆటో డ్రైవర్‌ ఏకంగా మహీంద్రా స్కార్పియో  ఎస్‌యూవీ  మోడల్‌ను అనుకరించి ఓ బంపర్‌ ఆఫర్‌  కొట్టేశాడు.   స్కార్పియో  వాహనాన్ని త్రీ వీలర్‌ ఆటోగా తయారు చేసి ఏకంగా  పారిశ్రామిక వేత్త  మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మనసు దోచాడు. ప్రతిఫలంగా ఒక సరికొత్త మహేంద్రా ఫోర్‌ వీలర్‌ కారును అందుకున్నాడు. కేరళకు చెందిన సునీల్‌ మహీంద్ర కంపెనీనుంచి ‘మహీంద్ర సుప్రో మినీ ట్రక్‌’ను అందుకున్నాడు.

వివరాల్లోకి వెళితే కొద్ది రోజుల క్రితం మార్చి 19  అనిల్‌ ఫణిక్కర్‌  మహీంద్రా స్కార్పియో మోడల్‌లో ఉన్న ఓఆటో ఫోటోను  ట్విట్టర్‌ లో షేర్‌ చేశారు.  భారతీయ రోడ్లపై స్కార్పియో ఎంత పాపులరో   తెలుపుతూ ఆనంద్‌ మహీంద్రకు ట్యాగ్‌ చేశారు. దీనికి   ఆనంద్ మహీంద్ర  స్పందించారు. సదరు ఆటో రిక్షా యజమానిని కనుక్కోవాలని  ట్వీట్‌ చేశారు. మహీంద్రా మ్యూజియం కోసం ఆ రిక్షాను తాను తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు  దాని స్థానంలో బహుమతిగా అతనికి  ఓ బ్రాండ్‌ న్యూ వాహనాన్ని  ఇస్తానని ప్రకటించారు.

మహేంద్ర టీం  కేరళకు చెందిన సునీల్‌ని  గుర్తించిందని ఆనంద్‌  మహీంద్ర  ట్విట్టర్‌ ద్వారా  బుధవారం వెల్లడించారు.  అతనికి కొత్త వాహనం అందించినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement