ఆమె 'పొందు' కోసం అంతులేని అబద్ధాలు | Men reveal the biggest LIES they’ve told to get a woman into bed | Sakshi
Sakshi News home page

ఆమె 'పొందు' కోసం అంతులేని అబద్ధాలు

Published Mon, Feb 8 2016 5:35 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

ఆమె 'పొందు' కోసం అంతులేని అబద్ధాలు

ఆమె 'పొందు' కోసం అంతులేని అబద్ధాలు

అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు అసత్యాలాడటం అబ్బాయిలకు అలవాటే. అయితే ఇప్పుడా అబద్ధాల'ఆట'.. శృతిమించుతోంది. ఆమెతో పొందు కోసం మగాళ్లు వేసే గప్పాలకు అంతులేకుండాపోతోంది. ప్రఖ్యాత రిడ్డిట్ వెబ్ సైట్ లో తాజాగా నిర్వహించిన సర్వేలో మగువల్ని బుట్టలోపడేసేందుకు తాము ఎంతలేసి అబద్ధాలాడింది వెల్లడించారు ప్లేబాయ్ కి బాబాయిల్లాంటి కొందరు పురుషులు.

ఆ 'హంటర్'లలో చాలామంది తమ వయసు, పేరు, చేసే ఉద్యోగం, ఉండే ప్రదేశాలపై అబద్ధాలాడితే ఇంకొందరు మాత్రం ఇంకాస్త ముందుకెళ్లి 'నేను బ్యాట్ మ్యాట్ ని.. మా నాన్న శ్రీమంతుడు.. నా ఎత్తు ఆరడుగులు..' అని గొప్పలు చెప్పుకున్నారట. ఇంకొందరేమో, తాము యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న శాంతి యోధులమని, వ్యోమగాములమని చెప్పుకున్నారు.

వీళ్లిలా ఇంతలేసి అబద్ధాలు చెప్పినప్పటికీ.. పాపం అమ్మాయిలు వాటిని నమ్మేసి తమ సర్వస్వాన్ని అర్పించేసుకున్నారట. ఎంతైనా అబద్ధాల పవరే పవర్. అన్నట్లు ఈ సర్వేలో తేలినటి (మగాళ్లు ఆడవాళ్లకు చెప్పినవాటిలో) అత్యుత్తమ అబద్ధం.. ఏంటో తెలుసా?...'ఐ లవ్ యూ'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement