జీన్స్‌ తొడుక్కుని స్క్వాటింగ్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌ న్యూస్‌ | Squatting in skinny jeans can lead to nerve damage study | Sakshi
Sakshi News home page

జీన్స్‌ తొడుక్కుని స్క్వాటింగ్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌ న్యూస్‌

Published Sat, Jan 11 2025 5:40 PM | Last Updated on Sat, Jan 11 2025 6:28 PM

Squatting in skinny jeans can lead to nerve damage study

ఆధునిక కాలంలో జీన్స్‌ ప్యాంట్లు లేనిదే కాలం గడవదు.  ట్రెండ్‌కు,ఫ్యాషన్‌కు తగ్గట్టు అనేక రకాల జీన్స్‌ ప్యాంట్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. మహిళలతో పోల్చితే పురుషులే  ఎక్కువగా జీన్‌  ప్యాంట్లను వినియోగిస్తారు.  ఆఫీసులకు, బయటికి వెళ్లినప్పుడు, పార్టీలకు ఇలా ఏదైనా జీన్స్‌  ప్యాంట్లకే ప్రాధాన్యత ఉంటుంది.   అన్ని వయసుల వారికి ఫిట్ అయ్యే జీన్స్ అనేవి చాలా పాపులర్. అనేక రకాల మోడల్స్‌లో ఇవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.  వీటిని ధరించడం వలన చాలా కంఫర్ట్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.  వీటిని ఉతుక్కోవడం ఈజీ కావడం కూడా వీటికి ఆదరణ  ఎక్కువ. కానీ జీన్స్‌పాంట్లు వేసుకున్నపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

జీన్స్‌ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్‌  ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం (సక్లముక్లం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీన్స్‌  ప్యాంట్‌ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే  ఒక్కోసారి జీన్స్‌ ప్యాంట్లతో బాసిపట్లు వేసుకుని కూర్చునేవారు పైకి లేవగానే నడవలేని పరిస్థితి వచ్చేందుకూ  అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇక వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్‌ అస్సలు తొడుక్కోవద్దనీ, వాటిని తొడిగి ‘స్క్వాటింగ్‌’ ఎక్సర్‌సైజ్‌ చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్‌ ఆఫ్‌ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్‌ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. అవే కాకుండా బాగా బిగుతుగా ఉండే జీన్స్‌ వల్ల పురుషుల్లో స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గే అవకాశముందని కూడా మరికొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

జీన్స్ ప్యాంట్లు బాగా టైట్‍గా ఉండే జీన్స్ ప్యాంట్ ధరించి పడుకుంటే చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీంతో దురదలు, చర్మంపై ర్యాషెస్, దద్దుర్లు వస్తాయి. రక్తప్రసరణకు కష్టం : జీన్స్ ప్యాంట్ బిగుతుగా ఉండటంతో రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. దీంతో కొన్ని అవయవాలకు రక్తం సరిగా అందదు. జీన్స్ ప్యాంట్ ధరించి నిద్రించడం వల్ల శరీరంలోని వేడీ పెరుగుతుంది. పేగుల కదలికకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement