సినీ ప్రముఖులకు, ప్రముఖ పారిశ్రామికవేత్తలకు, క్రికెటర్లకు సాధారణ ప్రజల మాదిరిగా బయట తిరిగే స్వేచ్ఛ ఉండదు, ఈ కారణంగా తమను తాము కాపాడుకోవడానికి బాడీగార్డ్స్‌ని నియమించుకుంటారు. ఈ బాడీగార్డ్స్ జీతాలు భారతదేశంలో ఉండే కొన్ని కంపెనీల సీఈఓల జీతాలకంటే ఎక్కువ అని తెలుస్తోంది.
షారుక్ ఖాన్ బాడీగార్డ్:
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో షారుక్ ఖాన్ అతిపెద్ద సూపర్‌స్టార్. అయితే ఈయన సినిమా షూటింగ్, ప్రమోషన్ వంటి వాటికోసం బయట ఎక్కువ తిరగాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో తనకు రక్షణగా రవి సింగ్ అనే బాడీగార్డ్‌ని నియమించుకున్నాడు. ఇండస్ట్రీలో ఎక్కువ జీతం తీసుకునే బాడీగార్డ్‌లలో రవి సింగ్ ఒకరు. ఈయన శాలరీ సంవత్సరానికి రూ. 2 నుంచి రూ. 3 కోట్లు వరకు ఉంటుంది.
సల్మాన్ ఖాన్ బాడీగార్డ్:
బాలీవుడ్ టాప్ పెర్ఫార్మర్లలో ఒకరైన సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ 'గుర్మీత్ సింగ్ జాలీ అకా షేరా' సంవత్సరానికి రూ. 2 కోట్లు కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నాడు. ఎక్కువ జీతం తీసుకునే బాడీగార్డ్‌లలో ఈయన ఒకరు. ముంబైలో జస్టిన్ బీబర్ తన సంగీత కచేరీ సమయంలో అతను ఎస్కార్ట్ చేశాడు.
అమీర్ ఖాన్ బాడీగార్డ్:
ఎన్నో పాపులర్ సినిమాలతో బాలీవుడ్ సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న అమీర్ ఖాన్ కూడా తన బాడీగార్డ్‌కి ఎక్కువ జీతం ఇస్తున్నట్లు సమాచారం. యువరాజ్ ఘోర్పడే (అమీర్ ఖాన్ బాడీగార్డ్) ప్రతి సంవత్సరం 1 నుండి 2.5 కోట్లు సంపాదిస్తున్నాడు. నిజానికి యువరాజ్ బాడీబిల్డర్.
అక్షయ్ కుమార్ బాడీగార్డ్:
అక్షయ్ కుమార్ బాడీగార్డ్ 'శ్రేయ్‌సే తేలే' సంవత్సరానికి 1 నుంచి 2 కోట్లు సంపాదిస్తూ అత్యధిక శాలరీ తీసుకుంటున్న బాడీగార్డ్‌లలో ఒకరుగా నిలిచారు.
దీపికా పదుకొనే బాడీగార్డ్:
ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే బాడీగార్డ్ 'జలాల్' పబ్లిక్ ప్లేస్‌లో ఎప్పటికప్పుడు రక్షణ కల్పిస్తూ వారి కుటుంబ సభ్యులలో ఒకరుగా కలిసిపోయారు. ఈయన సంవత్సరాదాయం రూ. 90 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment