ఏదైనా ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవడం, సంబంధిత సంస్థల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం కామన్. మన ప్రొఫైల్ నచ్చకపోయినా, వారి రిక్వైర్‌మెంట్‌కు తగినట్టుగా లేకపోయినా జాబ్ రాదు. అయితే చాలావరకు ఐటీ కంపెనీలు మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు సారీ అనే మెయిల్స్ కూడా చూశాం. తాజాగా సిలికాన్ వ్యాలీకంపెనీ చేసిన పని ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. రెడ్డిట్ యూజర్ షేర్ చేసిన కథనం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
సిలికాన్ వ్యాలీ-ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సీక్రెట్ సుషీ ఉద్యోగం అప్లయ్ చేసిన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇటీవల ఒక మహిళా ఉద్యోగ అభ్యర్థికి తిరస్కరణ లేఖతో పాటు అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ను పంపింది. దీంతో ఎంత దయగల కంపెనీ అనే ప్రశంసలు దక్కించుకుంది. మేల్‌విచ్ స్క్వేర్ అనే Reddit వినియోగదారు 'రిక్రూటింగ్‌హెల్' సబ్‌రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. మేనేజర్ జాబ్‌కోసం ఆమె దరఖాస్తు చేశారు.
ఇంటర్వ్యూలు ఫేస్ చేశారు. ఆ తరువాత ప్రతి రోజు, ఆమె తన ఇన్‌బాక్స్‌ను ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే అనుకోకుండా సీక్రెట్ సుషీ నుండి అందుకున్న దరఖాస్తుదారునికి ధన్యవాదాలు తెలుపుతూ, సెలెక్ట్ చేయలేదని చెప్తూనే,గిఫ్ట్ వోచర్ సెండ్‌చేసింది. ఈ తిరస్కరణ ఇమెయిల్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసింది. దీంతోపాటు తనకొచ్చిన 7 డాలర్లు గిఫ్ట్ వోచర్ ను కూడా షేర్ చేస్తూ.. " మర్చిపోలేని అత్యుత్తమ తిరస్కరణ" అంటూ పోస్ట్‌పెట్టారు. దీంతో ఇది వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment