భర్తను విలన్‌గా మార్చిన సిమ్రాన్ | simran makes her husband as a villain | Sakshi
Sakshi News home page

భర్తను విలన్‌గా మార్చిన సిమ్రాన్

Oct 1 2016 3:09 AM | Updated on Sep 4 2017 3:39 PM

భర్తను విలన్‌గా మార్చిన సిమ్రాన్

భర్తను విలన్‌గా మార్చిన సిమ్రాన్

ఒక నాటి మేటి నటి సిమ్రాన్. పెళ్లికి ముందు ఇటు కోలీవుడ్‌లోనూ అటు టాలీవుడ్‌లోనూ నాయకిగా ఇరగదీశారు.చాలా మంది ప్రముఖ హీరోయిన్లు వివాహానంతరం

 ఒక నాటి మేటి నటి సిమ్రాన్. పెళ్లికి ముందు ఇటు కోలీవుడ్‌లోనూ అటు టాలీవుడ్‌లోనూ నాయకిగా ఇరగదీశారు.చాలా మంది ప్రముఖ హీరోయిన్లు వివాహానంతరం నటనకు కొంత గ్యాప్ ఇచ్చి కొంత కాలం తరువాత రీఎంట్రీ అయ్యి వివిధ రకాల పాత్రలతో బిజీ అవుతుండడం చూస్తున్నాం. నటి జ్యోతిక లాంటి కొందరు రీఎంట్రీలోనూ మంచి పాత్రలను ఎంపిక చేసుకుని కథానాయకిగానే కొనసాగుతున్నారు. నటి సిమ్రాన్ కూడా దీపక్‌ను పెళ్లి చేసుకుని కొంత కాలం తరువాత నటనకు తిరిగొచ్చారు.
 
 అలా ఆహా కల్యాణం, త్రిషా ఇల్లన్న నయనతార, కరైయోరం లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినా, పెద్దగా రాణించలేకపోయారు. అవకాశాలు కూడా అంతగా లేవనే చెప్పక తప్పదు. మధ్యలో సొంత చిత్ర నిర్మాణం, బుల్లి తెర సీరియళ్ల నిర్మాణాల ప్రయత్నాలు చేశారు. అయితే కారణాలేమైనా అవి కార్యరూపం దాల్చలేదు. ఇక తన భర్తను హీరోగా పరిచయం చేయాలన్న కోరిక ఫలించలేదు. ఇతర ప్రముఖ కథానాయకుల చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినా అవీ జరగలేదు.
 
  ఇలా హీరో అవకాశాల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే పుణ్యకాలం గడిచి పోతుందని భావించేరో ఏమో, ఇప్పుడు తన భర్త దీపక్‌ను విలన్‌గా మార్చేశారు. అవును ఓడు రాజా ఓడు చిత్రంలో దీపక్ విలన్‌గా నటిస్తున్నారు. జోకర్ గురుసోమసుందర్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నాజర్,చారుహాసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నిశాంత్ రవీంద్రన్, జతిన్ శకర్‌రాజా ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తి వినోదభరిత కథా చిత్రం అని యూనిట్ వర్గాలు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement