
ప్రియమణి టైటిల్ పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అంగుళీక’. దీపక్ కథానాయకుడు. ప్రేమ్ ఆర్యన్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ కోటి తూముల, ఎ.హితేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ –‘‘ఈ సినిమా కథ నాకు తెలుసు. నిర్మాతలిద్దరూ నాకు కావాల్సిన వారు కావడంతో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇచ్చేవారు. టీజర్ టైమింగ్, కటింగ్ చూశాక దర్శకుడు సినిమాని బాగా తీసుంటాడని అర్థమైంది. ఈ చిత్రం విజయవంతమై నిర్మాతలకు లాభాలు, దర్శకుడికి మంచి పేరు రావాలి’’ అన్నారు. ప్రేమ్ ఆర్యన్ మాట్లాడుతూ –‘‘కోడి రామకృష్ణగారి స్ఫూర్తితో ‘అంగుళీక’ చిత్రాన్ని డైరెక్ట్ చేశా. కాల చక్రంతో ముడిపడిన ఇద్దరు ప్రేమికుల వీరగాథే ఈ సినిమా.
కాలచక్రం, సూర్యగ్రహణం ఈ రెండు అంశాల చుట్టూ సినిమా తిరుగుతుంది. సూర్యగ్రహణం ఘడియల్లో విడిపోయిన ప్రేమజంట మళ్లీ సూర్యుడి ఆశీస్సులతో 585 ఏళ్ల తర్వాత కలుసుకుంటారు. అదే సమయంలో పగతో రగిలిపోతున్న దుష్ట ఆత్మ ఆ జంటపై పగ తీర్చుకుందా? ఆ ప్రేమ జంట ఆత్మలకు ఎలా మోక్షం కలిగింది– అనేది సినిమాకు హైలెట్’’ అన్నారు. కోటి తూముల, ఎ.హితేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శామ్ కె. ప్రసన్, కెమెరా: చిట్టిబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శశి బాణాల, శివ సిర్రి.
Comments
Please login to add a commentAdd a comment