
న్యూఢిల్లీ: వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇచ్చిన కేసులో బ్యాంకు సీఈఓ చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు ఆదాయపన్ను శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పన్ను ఎగవేత అంశాన్ని ఐటీ శాఖ దర్యాప్తు చేస్తుండటం తెలిసిందే. దీపక్ కొచర్‌కు వ్యక్తిగత హోదాలోనే ఈ నోటీసులు జారీ చేశామని, నూపవర్ రెన్యువబుల్స్ కంపెనీ ఎండీగా దీపక్ కొచర్ వ్యక్తిగత ఆర్థిక అంశాలు, లావాదేవీల వివరాలు కోరామని ఐటీ వర్గాలు తెలిపాయి.
పది రోజుల్లోగా డాక్యుమెంట్లు సమర్పించాలని నోటీసుల్లో ఐటీ శాఖ కోరింది. మారిషస్‌కు చెందిన రెండు సంస్థల (ఫస్ట్ లాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్, డీహెచ్ రెన్యువబుల్స్ హోల్డింగ్స్) నుంచి నూపవర్ రెన్యువబుల్స్‌లోకి రూ.325 కోట్ల నిధుల రాకపై ఐటీ శాఖ తన దర్యాప్తులో ప్రత్యేకంగా దృష్టి సారించింది.
Comments
Please login to add a commentAdd a comment