అంగన్‌వాడి కేంద్రంలో కుక్కర్ పేలి నలుగురు విద్యార్థులు గాయపడిన ఘటన బుధవారం డాబాగార్డెన్స్‌లో చోటుచేసుకుంది.
అంగన్‌వాడి కేంద్రంలో కుక్కర్ పేలి నలుగురు విద్యార్థులు గాయపడిన ఘటన బుధవారం డాబాగార్డెన్స్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. నగరంలోని 21వ వార్డులో ఉన్న అంగన్‌వాడి కేంద్రంలో అన్నం వండుతుండగా ప్రమాదవశాత్తు కుక్కర్‌పేలి మురళీకృష్ణ (4) , దీపక్ (4), మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని కింగ్ జార్జ్ ఆసుపత్రికు తరలించారు.