
ప్రముఖ నటి, యాంకర్ హరితేజ ఇటీవల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల తమ చిన్నారి ఫోటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. కూతురికి భూమి దీపక్‌రావు అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. అయితే పాప పూర్తి ఫోటోని మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు హరితేజ. కానీ అప్పుడప్పుడు కూతురిని తన భర్త దీపక్‌రావు ఆడిస్తున్న కొన్ని వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
రీసెంట్‌గా హరితేజ షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. అందులో దీపక్ రావు కూతురిని చేతుల్లో ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు. ఇలా రోజూ ఆడించడం అలవాటుపడిన దీపక్ రావు.. ఒకసారి చేతుల్లో కూతురు లేకున్నా.. అదేపనిగా చేతులు ఊపుతుంటాడు. ఈ ఫన్నీ వీడియోని హరితేజ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘ఫాదర్ ఆన్ డ్యూటీ’అని హాష్‌ట్యాగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ‘క్యూటెస్ట్ డాడీ’అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment