బైక్ ఎక్కాలంటూ యువతికి వేధింపులు | young women harassment | Sakshi
Sakshi News home page

బైక్ ఎక్కాలంటూ యువతికి వేధింపులు

Published Thu, Apr 13 2017 7:02 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

young women harassment

సాక్షి, బెంగళూరు: మహిళల రక్షణ కోసం రాష్ట్ర హోంశాఖ బెంగళూరులో మూడు రోజుల  క్రితం ప్రారంభించిన పింక్‌ హొయ్సళ కార్యాచరణ మొదలుపెట్టింది. బైకు ఎక్కాంలటూ వేధిస్తున్న యువకుడిని అరెస్ట్ చేసి అతని బారి నుంచి ఓ యువతిని రక్షించింది.  సదరు ఆకతాయిని కటకటాల వెనక్కు నెట్టింది. నగరంలోని మైసూరురోడ్‌ టింబర్‌యార్డు ప్రాంతానికి చెందిన దీపక్, ప్రేమ కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. 
 
ఇటీవల దీపక్‌ ప్రవర్తనలో తేడా రావడంతో దూరం పెట్టసాగింది. తనను నిర్లక్ష్యం చేస్తుందనే ఆక్రోశంతో దీపక్‌  ఆ యువతిని వేధించసాగాడు.  ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ప్రేమ కత్రిగుప్పె వాటర్‌ ట్యాంకర్‌ వద్ద ఉండగా అక్కడికి చేరుకున్న దీపక్‌..  బైక్‌పై ఎక్కి కూర్చోవాలంటూ వేధించడం ప్రారంభించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు పింక్‌హొయ్సళ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది దీపక్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్ లో అప్పగించగా అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కు పంపారు.  ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి వరకు 5,724 మంది సురక్షయాప్‌ను డౌన్లోడ్‌ చేసుకున్నట్లు పింక్‌ హొయ్సళ కమాండ్‌ సెంటర్‌ అధికారి తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement