prema
-
Pavithra B Naik: హల్దీ ఫంక్షన్లో సీరియల్ నటి జోరు (ఫోటోలు)
-
550 సార్లు రీ-రిలీజ్ అయిన ఏకైక సినిమా.. ఈ విషయాలు తెలుసా..?
టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రీ-రిలీజ్... ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్లీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు. అప్పటి సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు అయితే రెండు నుంచి మూడు సార్లు రీ-రిలీజ్ అయ్యాయి. అయితే, ఒక సినిమాను ఏకంగా 550 సార్లకు పైగానే రీరిలీజ్ చేశారంటే నమ్ముతారా..? ఆశ్చర్యం అనిపించినా ఈ వార్త నిజమే. కన్నడలో ఉపేంద్ర డైరెక్ట్ చేసిన 'ఓం' ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించారు. ఇందులో ప్రేమ హీరోయిన్గా మెప్పించింది. 1995 మే 19న ఈ చిత్రం విడుదలైంది. సుమారు 30 ఏళ్లు అవుతున్నా ఈ చిత్రానికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధికసార్లు రీ-రిలీజ్ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం దక్కించుకుంది.ఈ సినిమా కోసం అండర్‌వరల్డ్‌లో పనిచేసిన అనేక మంది నేరస్థులతో పాటు నిందితులను కూడా తీసుకొచ్చారు. ఓం సినిమా కోసమే జైలు నుంచి బెయిల్‌పై వారిని బయటకు తీసుకొచ్చారు. అందులో కొంతమంది కరుడుగట్టిన నురస్థులు కూడా ఉన్నారు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. అప్పట్లో ఈ సినిమా నిర్మించేందుకు రూ. 70లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. బెంగళూరులోని కపిల్ థియేటర్లో 'ఓం'చిత్రాన్ని అత్యధికంగా 35సార్లు రీ-రిలీజ్ చేయడం అనేది ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. 1996 కర్ణాటక స్టేట్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్, నటిగా ప్రేమ అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్రకు కూడా అవార్డు దక్కింది. ఓం సినిమాతో సౌత్ ఇండియా నుంచి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ను శివరాజ్‌కుమార్ దక్కించుకున్నారు. 2015లో 'ఓం' డిజిటల్ రైట్స్‌ను అమ్మకానికి మేకర్స్ పెట్టగా రూ.10కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది. ఇంతటి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులోనూ 'ఓంకారమ్' పేరుతోనే రాజశేఖర్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇందులో రాజశేఖర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్లో 'అర్జున్‌పండిట్' పేరుతో సన్నీ డియోల్, జుహీచావ్లా రీమేక్ చేశారు. -
హీరోయిన్ ప్రేమతో ఉన్న వ్యక్తి ఎవరు..? ఆమె చుట్టూ రూమర్స్
సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. 1995లో సవ్యసాచి అనే కన్నడ చిత్రంతో తన జర్నీ మొదలైంది. తొలి సినిమా పరాజయం పాలైనా ఓం అనే రెండో సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. కన్నడలో స్టార్ హీరోలందరితో జోడీ కట్టి టాప్ హీరోయిన్గా వెలుగొందింది. తెలుగులోనూ ధర్మచక్రం, దేవి, ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, పోలీస్ పవర్ సహా పలు చిత్రాలు చేసింది. ప్రేమ 2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పచును పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. దేవి సినిమాతో టాలీవుడ్లో చెరగని ముద్ర వేసిన ప్రేమ తెలుగులో తక్కవ సినిమాలే చేసినా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ప్రేమ.. తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత 2017లో ఉపేంద్ర 'మత్తే బా' చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కన్నడలో పలు సీరియల్స్‌లో కూడా నటిస్తుంది. ప్రేమ రెండో వివాహ చేసుకోబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాటిలో నిజం లేదని తేల్చేసింది. తాజాగా ప్రేమతో పాటు తరుచూ ఒక వ్యక్తి కనిపిస్తున్నారని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కన్నడలో సినీబజ్ వెబ్సైట్ ప్రేమ గురించి ఒక వార్తను ఫోటోతో పాటు ప్రచురించింది. ఈ ప్రచురించిన నివేదిక ప్రకారం, ప్రేమతో పాటు కన్నడ టెలివిజన్ పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్‌గా పేరుగాంచిన అరవింద్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి కారణాలు ఏంటో అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ అరవింద్ కూడా ఉంటున్నారని తెలిపింది. రీసెంట్గా ప్రేమ కర్ణాటకలోని కొరగజ్ఞ సన్నిధికి వెళ్లినప్పుడు అరవింద్‌తో ప్రేమ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుందా అని టాక్ కూడా వినిపించింది. తల్లిదండ్రులతో ప్రేమ అయితే ఇప్పుడు ఆ టాక్.. టాక్‌గానే మిగిలిపోయిందని, వారిద్దరి మధ్య అలాంటి సంబంధం లేదని, వారు మంచి స్నేహితులు మాత్రమేనని కొన్ని కన్నడ వెబ్‌సైట్స్ చెబుతున్న మాట. వాస్తవానికి ప్రేమ రెండో పెళ్లి గురించి పలుమార్లు రూమర్స్ వచ్చాయి. వాటిని ఆమె తిప్పి కొట్టింది కూడా.. ఇప్పుడు కూడా ఫోటో అయితే వైరల్ అవుతుంది కానీ అది ఎప్పటిది..? వారిద్దరి మంధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది పూర్తి వివరాలు లేవు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్తలపై ప్రేమ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. పెళ్లి గురించి ప్రేమ గతంలో చెప్పిన మాట రెండో పెళ్లి అంటూ రూమర్స్ వచ్చాయి. జీవితంలో పెళ్లి ఉండాలి. నాకు తగిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను. నా జీవితం ఎలా ఉండాలనేది నాకు తెలుసు. నా మీద ఇంకో రూమర్ కూడా సృష్టించారు. నాకు క్యాన్సర్ వచ్చిందని ప్రచారం చేశారు. అలాంటిదేమీ లేదు. డిప్రెషన్ వల్ల కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఆ సమయంలో నాకు క్యాన్సర్ ఉందని పుకార్లు వ్యాప్తి చేశారు' అని చెప్పుకొచ్చింది ప్రేమ. ఇక తనకు 70 ఏళ్లు వచ్చాక కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అప్పుడు చేసుకుంటే తప్పు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. మనకు దొరికేది ఒకటే జీవితం అని ఆ జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆమె పేర్కొన్నారు. జీవితంలో తనకు నచ్చినట్లే ఉండమని తన అమ్మగారు కూడా చెప్పారని ఆమె తెలిపింది. -
షూటింగ్ సమయంలో నిజంగానే పాము కరిచింది: ప్రేమ
కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘దేవి’ ఒకటి. ఈ చిత్రంలో హీరోయిన్ ప్రేమ టైటిల్ పాత్రను పోషించగా, వనిత , షిజు , అబు సలీం, భానుచందర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు . ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన తొలి సినిమా ఇది. ఈ సోషియో ఫాంటసీ చిత్రం విడుదలై నేటికి(మార్చి 12, 1999న రిలీజ్) సరిగ్గా 25 ఏళ్లు. ఈ సందర్భంగా అలనాటి హీరోయిన్ ప్రేమ ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘అప్పట్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తక్కువగా వచ్చేవి. రిస్క్ చేసి మరి ‘దేవి’ చిత్రాన్ని తెరకెక్కించాడు కోడి రామకృష్ణ. ఈ మూవీ ఆ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఆయనే. ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సీన్ సరిగా రాకపోతే మళ్లీ మళ్లీ చేయించేవాడు. ఓక్కో సీన్‌కి 50 టేకులపైగా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. నాతో డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేయించేవారు. దేవత ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడాలని చెప్పేవారు. గెటప్ వేశాక నా హావభావాలు ఆటోమెటిక్‌గా మారిపోయేవి. టీమ్ అంతా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశాం. షూటింగ్ సమయంలో ఓ వ్యక్తిని నిజంగానే పాము కాటేసింది. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా బతికించుకోలేకపోయాం. ఆ బాధతో రెండు రోజుల పాటు షూటింగ్‌ని నిలిపివేశాం. క్లైమాక్స్ షూటింగ్ సమయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాం. మంచులో షూటింగ్ చేయడం సవాల్‌గా మారింది. సినిమా రిలీజ్ తర్వాత మా కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఫీలయ్యాం. ప్రేక్షకుల స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. నా కెరీర్లో ‘దేవి’ స్పెషల్ మూవీ’ అని ప్రేమ చెప్పుకొచ్చింది. 25 years for Blockbuster #Devi 🔥🔥 A supernatural phenomenon film which attracted the audience to theaters for a long time. 🙌 Directed by #KodiRamakrishna Produced by @MSRajuOfficial A Rockstar @ThisIsDSP musical 🎶#Prema #Shiju @Actor_Mahendran #25YearsForDevi pic.twitter.com/Xr6V5BKl0J — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 12, 2024 -
'అమీర్‌పేట్‌లో అలాంటి కోచింగ్ కూడా ఉంటే బాగుండు'..!
మలయాళంలో హిట్‌గా సినిమా తెలుగులో విడుదలకు సిద్ధమైంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ప్రేమలు'. కేరళలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. దీంతో డబ్బింగ్ చేసి టాలీవుడ్ ప్రేక్షకుల కోసం ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగు హక్కుల్ని దక్కించుకున్నారు. ట్రైలర్ చూస్తే తెలుగు ప్రేక్షకులకు సైతం కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇలాంటి రొమాంటిక్ ప్రేమకథ యూత్‌ను అలరించండం ఖాయంగా కనిపిస్తోంది.ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే అదే రోజున గోపీచంద్ 'భీమా', విశ్వక్ సేన్ 'గామి' చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. దీంతో ఈ వారం బాక్సాఫీస్ వద్ద సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ చేసే సినిమాలు రానున్నాయి. ప్రేమలు సినిమా కథ విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చేసిన సచిన్‌కి(నస్లేన్) యూకే వెళ్లాలనేది ప్లాన్. కానీ వీసా రిజెక్ట్ కావడంతో సొంతూరిలో ఉండటం ఇష్టం లేక ఫ్రెండ్‌తో కలిసి హైదరాబాద్‌కి వస్తాడు. ఇక్కడ ఓ పెళ్లిలో రీనూ(మమిత బైజు)ని చూసి ప్రేమలో పడతాడు. ఈ అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా జాజ్ చేస్తుంటుంది. మరి వీళ్లిద్దరూ చివరకు ఒక్కటయ్యారా? ఈ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారనేది స్టోరీ. -
స్టార్ హీరోతో లవ్.. వందల కోట్ల ఆస్తులు.. కానీ: ప్రేమ
ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది ప్రేమ. ఎయిర్ హోస్టెస్ అవుదామనుకుని అనుకోకుండా హీరోయిన్గా మారింది. 1995లో సవ్యసాచి అనే కన్నడ చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. కన్నడకు చెందిన ప్రేమ.. టాలీవుడ్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తెలుగులోనూ ధర్మచక్రం, దేవి, ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, పోలీస్ పవర్ సహా పలు చిత్రాలు చేసింది. జీవన్ అప్పాచ్చు అనే వ్యక్తిని పెళ్లాడిన ప్రేమ కొంతకాలానికే ఆయనకు విడాకులు ఇచ్చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ప్రేమ మాట్లాడుతూ.. 'నాకు చాలా సింపుల్‌గా ఉండడమే ఇష్టం. యాటిట్యూడ్ తలలో ఉంటే చాలా కష్టం. నాకు ఎలాంటి ఆస్తులు లేవు. డబ్బులే ముఖ్యం కాదు. అదే శాశ్వతం కాదు. అవసరమైన డబ్బు ఉంటే చాలు. నేను చాలా బోల్డ్‌గా మాట్లాడతా. ఉపేంద్రతో ప్రేమ గురించి రాసిన వారినే అడగాలి. అది ఒక గాసిప్. అప్పుడు నా ఫోకస్ కేవలం సినిమాలే పైనే. ఒకసారి సక్సెస్ వచ్చినప్పుడు ఇలాంటి వస్తాయి. ప్రతి విషయానికి నెగెటివ్, పాజిటివ్ రెండూ ఉంటాయి. ఎలా వచ్చినా వాటిని ఎదుర్కొవాలి. నేను బీకామ్ చదివేదాన్ని. చదువు మధ్యలో ఉండగానే ఇండస్ట్రీలోకి వచ్చా. నేను ఎక్కువగా ఆలోచించే దాన్ని కాదు. అప్పట్లో నేను సౌందర్యతో ఎక్కువగా టచ్‌లో ఉండేదాన్ని. ' అని అన్నారు. -
ఎంతో అందంగా ఉండే సౌందర్యను అలా చూడలేకపోయా : ప్రేమ
హీరోయిన్ ప్రేమ పేరు వినగానే మొదటగా దేవి సినిమానే గుర్తుకొస్తుంది. నిజానికి ఆమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా స్టార్డమ్ సంపాదించుకుంది. కన్నడ, తెలుగు, మలయాళ సినిమాలతో తనకంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ప్రేమ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. 2017లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే ఒకటి, రెండు సినిమాల్లో కనిపించిన ఆమె మళ్లీ స్క్రీన్కు దూరమయ్యారు. ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్న ప్రేమ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి, విడాకులు, కెరీర్.. ఇలా పలు విషయాలపై ఓపెన్ అయ్యింది. ఈ క్రమంలో దివంగత నటి సౌందర్య మరణాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. ''సౌందర్య చనిపోయిన రోజు.. ఇంతేనా జీవితం అనిపించింది. చివరి చూపు కోసం వాళ్ల ఇంటికి వెళ్లాను. సౌందర్య, ఆమె సోదరుడు డెడ్‌బాడీలను బాక్స్‌లో పెట్టి ఉంచారు. చూడటానికి ఫేస్ కూడా లేదు. ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం అనిపించింది. మనం పోయేటప్పుడు తీసుకెళ్లేది కర్మ, గౌరవం మాత్రమే. సౌందర్య చేతికి పెట్టుకున్న గడియారాన్ని బట్టి అది సౌందర్య డెడ్‌బాడీ అని గుర్తించారు. అందంగా కనిపించడానికి సౌందర్య ఎంతో ఇష్టపడేవారు.షూటింగ్లో షాట్ గ్యాప్‌లో కూడా ఎప్పటికప్పుడు టచప్ చేసుకుంటూ అన్నీ పర్ఫెక్ట్ లా ఉండాలని అనుకునేవారు. అలాంటిది చివరి రోజుల్లో ఆమె ముఖం కూడా లేదు. అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది'' అంటూ ప్రేమ పేర్కొంది. -
పెళ్లైన కొంత కాలానికే విడాకులు.. రెండో పెళ్లిపై స్పందించిన ప్రేమ
ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది ప్రేమ. ఎయిర్ హోస్టెస్ అవుదామనుకుని హీరోయిన్గా మారింది. తన అందంతో, సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. 1995లో సవ్యసాచి అనే కన్నడ చిత్రంతో తన జర్నీ మొదలైంది. తొలి సినిమా పరాజయం పాలైనా ఓం అనే రెండో సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. కన్నడలో స్టార్ హీరోలందరితో జోడీ కట్టి టాప్ హీరోయిన్గా వెలుగొందింది. తెలుగులోనూ ధర్మచక్రం, దేవి, ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, పోలీస్ పవర్ సహా పలు చిత్రాలు చేసింది. జీవన్ అప్పాచ్చు అనే వ్యక్తిని పెళ్లాడిన ప్రేమ కొంతకాలానికే ఆయనకు విడాకులు ఇచ్చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 'దర్శకుడు కోడి రామకృష్ణ నాకు తెలుగు నేర్పించారు. పెళ్లైన కొంతకాలానికి విడాకులు తీసుకున్నాం. ఈ నిర్ణయాన్ని మొదట మా పేరెంట్స్‌కు చెప్పాను. వాళ్లు నా నిర్ణయానికి మద్దతు తెలిపారు. చాలామంది అలాంటి సమయంలో ఆత్మహత్య దిశగా ఆలోచిస్తుంటారు. కానీ నేను సూసైడ్ చేసుకోలేదు. ఇది ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాను. పెళ్లనేదే జీవితం కాదు. ఛాలెంజ్‌లు స్వీకరిస్తేనే ధృడంగా తయారవుతారు. నేను సెన్సిటివ్‌గా, ఎమోషనల్‌గా ఉండేదాన్ని. కానీ తర్వాత స్ట్రాంగయ్యాను. రెండో పెళ్లి అంటూ రూమర్స్ వచ్చాయి. జీవితంలో పెళ్లి ఉండాలి. నాకు తగిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను. నా జీవితం ఎలా ఉండాలనేది నాకు తెలుసు. నా మీద ఇంకో రూమర్ కూడా సృష్టించారు. నాకు క్యాన్సర్ వచ్చిందని ప్రచారం చేశారు. అలాంటిదేమీ లేదు. డిప్రెషన్ వల్ల కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఆ సమయంలో నాకు క్యాన్సర్ ఉందని పుకార్లు వ్యాప్తి చేశారు' అని చెప్పుకొచ్చింది ప్రేమ. -
షూటింగ్ సమయంలో డైరెక్టర్ నన్ను బాగా తిట్టారు: నటి ప్రేమ
హీరోయిన్ ప్రేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట కన్నడ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత ధర్మ చక్రం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, దేవి వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక పలు చిత్రాల్లో దేవత పాత్రలు చేసి మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె సినిమాలకు దూరమయ్యారు. సుదీర్ఘ విరామం అనంతరం తాజాగా ఆమె ‘అనుకోని ప్రయాణం’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 28న విడుదల కాబోతోంది. చదవండి: రామ్ చరణ్ మాటలకు ఏడ్చేసిన జపాన్ ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ టాక్‌లో షోలో పాల్గొంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, సినిమా విశేషాల గురించి పంచుకుంది. తాను మొదట కన్నడ ఓం చిత్రంలో వెండితెర ఎంట్రీ ఇచ్చానంది. ఆ మూవీ షూటింగ్ సమయంలో డైరెక్టర్ తనని బాగా తిట్టారంటూ ఆసక్తికర విషయం చెప్పింది. ‘కన్నడ హీరో శివరాజ్ కుమార్‌తో నటించాలన్నది నా చిన్ననాటి కల. ఆయనతోనే నా తొలి సినిమా. ఆయనను చూస్తుంటే అసలు డైలాగ్ చెప్పడానికి రావట్లేదు. డైరెక్టర్ ఎన్నిసార్లు చెప్పిన డైలాగ్స్ అసలు నా తలకెక్కట్లేదు. పదే పదే షాట్స్ తీస్తున్నా డైలాగ్ డెలివరి రావట్లేదు. చివరికి డైరెక్టర్ నాపై అరిచారు. బ్రేక్‌లో మా అమ్మ కూడా నన్ను తిట్టింది. ‘ఎన్ని సార్లు చెప్పించుకుంటావు. ఆయన చెప్తుంటే నాకే అసహ్యంగా అనిపిస్తుంది. వాళ్లు చెప్పింది తలకెక్కట్లేదా?. చదవండి: దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్ 15 షాట్స్ అయ్యాయి నీకు రావడం లేదా’ అని తిట్టింది. అమ్మ తిట్టాగానే కోపం వచ్చింది. షాట్ రెడీ కాగానే వెళ్లి డైలాగ్ చెప్పాను. సింగిల్ షాట్స్‌లోనే ఒకే అయిపోయింది’’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తెలుగుకు ఎలా వచ్చారని అడగ్గా.. కన్నడ ఓం సినిమా చూసి రామానాయుడు గారు తనకు ధర్మ చక్రం సినిమాలో చాన్స్ ఇచ్చారని తెలిపింది. అనంతరం తెలుగులో మోహన్ బాబు గారు అంటే మొదట్లో భయమేసేదని పేర్కొంది. ‘‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలో మోహన్ బాబు గారితో కలిసి నటించాను. ఇందులో నాది నెగిటివ్ రోల్. ఆయనను డైరెక్ట్‌గా చూడాలంటేనే భయం.. అలాంటిది ఆయనతో పోటీపడి నటించాల్సి వచ్చింది’’ అని ప్రేమ పేర్కొంది. -
రెండో పెళ్లికి రెడీ అవుతున్న సీనియర్ నటి?!
సీనియర్ నటి ప్రేమ రెండో పెళ్లికి రెడీ అయిందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. త్వరలోనే ఆమె మూడు ముళ్లు వేయించుకోనుందంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తన మీద వస్తున్న వార్తలను కొట్టిపారేసింది నటి ప్రేమ. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని తేల్చి చెప్పింది. అలాగే తన ఆరోగ్యం మీద వస్తున్న వదంతులను నమ్మవద్దని, తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొంది. నటి ప్రేమ 2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పచును పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. ఆ మధ్య ఈమెకు క్యాన్సర్ ఉన్నట్లు వార్తలు రాగా, అందులో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రేమ కన్నడ, తమిళం, మలయాళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించింది. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'సవ్యసాచి'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె మోహన్‌లాల్, విష్ణువర్ధన్, వెంకటేశ్, జగపతి బాబు, రవిచంద్రన్, మోహన్ బాబు, సాయికుమార్ వంటి పలువురు స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ నటి 2017లో ఉపేంద్ర 'మత్తే బా' చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్ -
అమ్మా.. హ్యాట్సాఫ్!
ఆకలి తీర్చేందుకు రెక్కల కష్టం పడే తల్లులు ఎందరో. ఆ కోవలో ఇక్కడ ఓ తల్లి రెక్కల కష్టం పడ్డా, బతుకు భారమై ఆత్మహత్యాయత్నం చేసినా, చివరకు తన బిడ్డల ఆకల్నితీర్చేందుకు తన శిరోజాల్ని అమ్ముకుంది. సాక్షి, చెన్నై : ‘ అమ్మ అన్న పదం అద్భుతం. అమ్మకి అద్భుతం పిల్లల జీవితం. ఇక, బిడ్డ ఆకలి అమ్మకే తెలుసంటారు. ఆ ఆకలి తీర్చేందుకు పస్తులుండే తల్లులు ఎందరో. పేదరికంలో కొట్టుమిట్టాడే కుటుంబాల్లో తమ పిల్లల ఆకలి తీర్చేందుకు రెక్కల కష్టం పడే తల్లులు ఎందరో. ఆ కోవలో ఇక్కడ ఓ తల్లి రెక్కల కష్టం పడ్డా, బతకు భారమైన ఆత్మహత్యాయత్నం చేసినా, చివరకు తన బిడ్డల ఆకల్ని తీర్చేందుకు తన శిరోజాల్ని అమ్ముకుంది. ఈ సమాచారం అందుకున్న ముగ్గురు యువకులు ఆ తల్లికి చేయూత నిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఫేస్ బుక్ ద్వారా రూ. లక్ష సేకరించి ఉండడం సేలంలో అమ్మాపేటలో వెలుగులోకి వచ్చింది. సేలం జిల్లా అమ్మాపేట సమీపంలోని వీమనూరుకు చెందిన సెల్వం(37), ప్రేమ(31) దంపతులకు ముగ్గురు మగ పిల్లలు. వీరి వయస్సు నాలుగేళ్ల లోపే. గతంలో సెల్వం, ప్రేమ దంపతులు ఇటుకల తయారీ బట్టీల్లో పనిచేసే వారు. అయితే, ఐదేళ్ల క్రితం ఓ మిత్రుడు ఇచ్చిన సలహాతో సొంతంగా ఇటుక బట్టిని ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండడంతో ఇటుక బట్టిని నడిపేందుకు అప్పులు చేయక తప్పలేదు. క్రమంగా అప్పుల భారం పెరగడంతో ఇటుకల బట్టీని వదులుకోవాల్సి వచ్చింది. కంతు వడ్డి వేధింపులు పెరగడంతో బతుకు భారమైంది. అప్పులు ఇచ్చిన వాళ్లు తనను చుట్టుముట్టడంతో ఏడాదిన్నర క్రితం సెల్వం ఆత్మాహుతి చేసుకున్నాడు. తనను పిల్లల్ని వదలి భర్త ఆత్మాహుతి చేసుకోవడంతో ప్రేమ తీవ్ర మనో వేదనలో మునిగింది. ఆప్తులు, బంధువులు మోసం చేసినా, తనను దరిచేర్చుకునే వాళ్లు ఎవరూ లేకున్నా, మనో ధైర్యంతో చేతిలో ఉన్న చంటి బిడ్డతో పాటు మరో ఇద్దరు పిల్లల పెంపు భారాన్ని తన భుజాన వేసుకుంది. విసిగి వేసారి..... వీమనూరు సమీపంలోని ఓ ఇసుక బట్టీలో చేరి రెక్కల కష్టంతో పిల్లల కడుపుల్ని నింపుతూ వచ్చిన ఈ తల్లికి కాలక్రమేనా బతుకు జీవనం భారంగా మారింది. ఇందుకు కారణం భర్త సెల్వంకు గతంలో అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు పెరగడమే. తన పిల్లల కడుపు నింపేందుకు తాను పడుతున్న కష్టాన్ని వారికి చెప్పుకున్నా ప్రయోజనం శూన్యం. ఈ వేధింపులు క్రమంగా పెరగడంతో విసిగి వేసారిన ప్రేమ గత నెల ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లల మీదున్న మమకారం, వారి ఆకలి కేకలు ఆమెకు పునర్జన్మనిచ్చాయి. తాను క్రిమి సంహారక మందు సేవించినట్టుగా ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో ఆమెను తీసుకెళ్లి ఆస్పత్రిలో పడేసి రక్షించారు. ఆ తదుపరి ఆమెకు కష్టాలు మరింతగా పెరిగాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జయినా, పని అన్నది దొరక్క పోవడంతో ప్రేమ తీవ్ర మనో వేదనలో మునిగింది. తన పిల్లలు ఆకలితో అలమటిస్తుండడంతో తల్లడిల్లింది. చివరకు రెండు రోజుల క్రితం ఆమె ఓ సెలూన్ షాపు అతన్ని సంప్రదించి, తన శిరోజాల్ని అమ్ముకుంటానని, తనకు ఎంతో కొంత ఇస్తే పిల్లల కడుపు నింపుకుంటానంటూ వేడుకుంది. కనీస జాలి కూడా చూపించని ఆ షాపు యజమాని గుండు గీసి మరీ ఆమెకు ఉన్న పొడవాటి శిరోజాల్ని తీసుకున్నాడు. ఎంతో కొంత అతగాడు ముట్టచెప్పడంతో ఆనందంతో తన పిల్లల కడుపుల్ని ఆమె నింపింది. తన పిల్లల ఆకలి తీరడంతో ఆమె ఆనందానికి అవుధులు లేవు. యువకుల చేయూత... తన పిల్లల ఆకలి తీర్చేందుకు ఓ తల్లి శిరోజాల్ని అమ్ముకున్నట్టుగా తనకు లభించిన సమాచారంతో ఓ యువకుడు చలించిపోయాడు. అమ్మా పేటకు చెందిన బాల(32) తన ఇద్దరు మిత్రులతో కలిసి ప్రేమను సంప్రదించాడు. ఆమెకు ఇటుక బట్టిలో మళ్లీ పని కల్పించే ఏర్పాట్లు చేయడమే కాదు, పిల్లల ఆకలి తీర్చేందుకు తన వంతుగా చేయూత నిచ్చారు. శిరోజాల్ని ఎక్కడ అమ్మిందో ఆరా తీయడానికి ప్రయత్నిస్తే, తన పిల్లల ఆకలి తీర్చేందుకు సాయం చేసిన ఆ సెలూన్ గురించి తాను చెప్పబోనంటూ ఆ మాతృమూర్తి పేర్కొనడం విశేషం. అంతటితో ఆగకుండా ఆమెకు సాయం అందించే విధంగా బాలు అండ్ మిత్ర బృందం ముందుకు కదిలింది. ఫేస్ బుక్ ద్వారా రూ. లక్ష సేకరించి ప్రేమను వేధిస్తున్న వడ్డీ వ్యాపారుల్ని సంప్రదించేందుకు సిద్ధం అయ్యారు. ఆమెను ఇక వేదించవద్దు అని, ఇంతటితో సరి పెట్టుకోవాలని అప్పులు ఇచ్చిన వారిని అభ్యర్థించేందుకు నిర్ణయించామని బాల పేర్కొన్నాడు. అయితే, ఈ సమాచారం కాస్త పోలీసుల చెవిన పడడంతో ఆ కంతు వడ్డీ దారుల్ని గుర్తించి, భరతం పట్టేందుకు ప్రత్యేక బృందం రంగంలో దిగడం కొసమెరుపు. -
‘జర్నలిస్ట్ కావాలనుకున్నా’
ఎనిమిదవ తరగతిలోనే టీవీ సీరియల్స్‌కు పరిచయం అయిన సాధన బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటోంది. జీ తెలుగులో ‘ప్రేమ,’ జెమినీ టీవీలో ‘రెండు రెళ్లు ఆరు’ సీరియల్స్‌లో నటిస్తున్న సాధన చదువులోనూ రాణిస్తోంది. వర్క్ గ్యాప్‌లో చదువుకుంటూ ఇటు నటనని, అటు చదువునూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సాధన చెబుతున్న ముచ్చట్లివి. ఇండస్ట్రీతో పరిచయం? మా అమ్మ టీవీ ఆర్టిస్ట్. నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మతో పాటు లొకేషన్స్‌కి వచ్చేదాన్ని. అలా ఒకరోజు టీవీ వాళ్లు నా ఆడిషన్స్ తీసుకున్నారు. అలా ఈ ఫీల్డ్కి స్కూల్ డేస్‌లోనే నేనూ పరిచయం అయ్యాను. పుట్టింది ఖమ్మం. చదువు అంతా సాగింది హైదరాబాద్‌లోనే. చిన్నప్పుడు డ్యాన్స్ అంటే విపరీతమైన ఇష్టం ఉండేది. చాలా బాగా డ్యాన్స్ చేసేదాన్ని. దీంతో ఏదో ఒక రోజు ఫేమ్ వస్తుంది, మానొద్దు అని ఇంట్లో ఎంకరేజ్ చేస్తుండేవారు. అనుకోకుండా ఒక అవకాశం రావడంతో ఇలా మీ అందరి ముందుకు వచ్చే అదృష్టం దక్కింది. సీరియల్ వర్క్స్‌తో పాటు ఎంబీఏ సెకండియర్ చేస్తున్నాను. ఫీల్డ్‌లో ప్లస్‌లు మైనస్‌లు ? ఏ కెరియర్ తీసుకున్నా ప్లస్‌లూ మైనస్‌లు అంతటా ఉంటాయి. అన్నింటా మన వ్యక్తిత్వమే మెయిన్. ఇక్కడ నా వర్క్ విషయానికి వస్తే ఉదయం 6:30 గంటలకు లొకేషన్లో ఉంటాను. మళ్లీ రాత్రి 9 గంటలకు ప్యాకప్ చెప్పేంతవరకు అక్కడే ఉంటాను. నెలలో ఇరవై రెండు రోజులు ఇలాగే వర్క్ ఉంటుంది. నిద్ర ఉండదు. రోజులో నాలుగైదు గంటలు పడుకుంటాను. కానీ, ఇదే నా ప్రపంచం. ఈ వర్క్ లేకపోతే నన్ను నేను ఊహించుకోలేను. నెలల తరబడి ఒక సీరియల్‌కి వర్క్ చేస్తాం. రేటింగ్ బట్టి ఒక్కో సీరియల్ ఐదేళ్లు కూడా పడుతుంది. సీరియల్ టీమ్ అంతా కొన్ని రోజుల్లోనే ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతాం.. డ్రైవర్ నుంచి మేకప్ మ్యాన్, లైట్ బోయ్ వరకూ.. అంతా ఒకే కుటుంబం. చివరగా సీరియల్ పూర్తయ్యి గుమ్మడికాయ కొట్టిన రోజు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. అలాంటి టైమ్‌లో రెండు–మూడు సార్లు ఏడ్చేశాను కూడా. ప్రతిరోజూ లొకేషన్లో ఫన్నీ థింగ్స్ ఉంటూనే ఉంటాయి. కొన్ని చిన్న చిన్న గొడవలుంటాయి. మా రోల్స్‌ని మిగతావాళ్లు ఇమిటేట్ చేసి ఉడికిస్తుంటారు. సీనియర్స్ కూడా మమ్మల్ని ఇమిటేట్ చేస్తుంటారు. చాలా సరదాగా గడిచిపోతుంది. రియల్ లైఫ్‌లో ప్లస్‌లు మైనస్‌లు? నా చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు. మొదట అక్క పుట్టినప్పుడే ‘ఆడపిల్ల’ అని నాన్న చాలా ఫీలయ్యారంట. నేనూ ఆడపిల్లను అనేసరికి నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. అయినా అమ్మ బాధపడలేదు. మా అమ్మే నాన్న అయి మమ్మల్ని పెంచింది. అక్కను డాక్టర్ని చేసింది. నేను యాక్టర్‌ని అయ్యాను. మా భవిష్యత్తు గురించి అమ్మ పడే తపన వల్లే మేమీ రోజుకు ఇలా ఉన్నాం. మా జీవితంలో అమ్మ పెద్ద ప్లస్. అమ్మ లేకపోతే మేం లేం. ఇన్నేళ్ల కెరియర్లో బాగా నచ్చిన పాత్ర? ‘రెండు రెళ్లు ఆరు’ సీరియల్లో కృష్ణ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. కృష్ణ ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్. ఆ పాత్ర చాలా పవర్ఫుల్. డైనమిక్. ఒక అమ్మాయి ధైర్యవంతురాలిగా ఎలా ఉండాలో చూపుతుంది. అన్యాయం జరిగితే తట్టుకోదు. ఎవరైనా తప్పు చేస్తే ఊరుకోదు. అస్సలు రాజీపడదు. నేనూ రియల్ లైఫ్‌లో జర్నలిస్ట్ అయితే బాగుంటుంది అని చాలా సార్లు అనుకునేదాన్ని. ఎన్నో స్టోరీస్ కవర్ చేయచ్చు, ప్రజలకు సాయంగా ఉండచ్చు అనిపించేది. ఆ ఇష్టం ఇప్పుడీ పాత్ర ద్వారా తీరింది. యాక్టింగ్ ఫీల్డ్‌లో ఉన్న అడ్వాంటేజీ ఏంటంటే రియల్ లైఫ్‌లో ఉన్న డ్రీమ్స్‌ని ఇలా కొద్దిగాౖ నెనా సాటిస్ఫై చేసుకోవచ్చు. కన్నడ హీరోయిన్స్‌కే ఇక్కడ అవకాశాలు ఎక్కువ? నిజమే, తెలుగు వారికి తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. ఇక్కడ వాళ్లలో ఏం తక్కువైందో తెలియడం లేదు. వేరేవాళ్లను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో తెలియదు. లేదంటే, మనవాళ్లు కూడా చాలా మంది భయపడి ఈ ఇండస్ట్రీకి రావట్లేదేమో అనిపిస్తుంది. షూటింగ్ లేకపోతే..? ఫుల్‌గా నిద్రపోతాను. కాస్త తీరిక అనిపిస్తే వంట చేస్తాను. బాగా వండుతాను. అమ్మ, అక్క నా వంటను చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత నాకు నచ్చిన డ్యాన్స్ ఉండనే ఉంది. అక్కతో కలిసి షటిల్ ఆడటం చాలా బాగుంటుంది. అమ్మ, నేను, అక్క కూర్చుంటే కబుర్లతో సమయమే తెలియదు. – నిర్మలారెడ్డి -
మా నాన్న నన్ను ఇంజినీర్ చేయాలనుకున్నారు
బొమ్మనహళ్లి : విద్యార్థులు ఇష్టపడి చదువుకోవాలని, ఎవరి కోసమో చదివితే ఉపయోగం ఉండదని బహుభాషా నటి ప్రేమ అన్నారు. శుక్రవారం హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని సామసంద్రపాళ్యలోని శ్రీసాయిరామ్ విద్యా మందిర పాఠశాల 7వ వార్షికోత్సవం వేడుకల్లో ఆమె పాల్గొని జ్యోతి వెలిగించి మాట్లాడుతూ... పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ప్రతి ఒక్కరికి అద్భుతమైన ప్రతిభ ఉంటుందని, ఉపాధ్యాయులు గుర్తించి వారిని ప్రోత్సహించాలన్నారు. తాను ఇంజినీర్ కావాలని తన తండ్రి కోరికని అయితే తాను సినిమా ఇండస్ట్రీలో రాణించానని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఎం.సతీష్‌రెడ్డి మాట్లాడుతూ... స్థానిక బీజేపీ నాయకడు, సమాజ సేవకుడు శ్రీనివాస్ రెడ్డి పేదలకు తక్కువ ఖర్చుతో ఉత్తమ విద్యను అందించడం కోసం ఈ పాఠశాలను స్థాపించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఇక్కడి సామసంద్రపాళ్యలోని ఓ అపార్టుమెంట్లో ఎస్టీపీ ట్యాంకు శుభ్రం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి తలా రూ. లక్ష చొప్పున అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో శ్రీసాయిరామ్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ నితిన్‌రెడ్డి, సాహితీవేత్త సత్యనారాయణ, మిమిక్రి ఆర్టిస్ట్ గోపి, ప్రిన్సిపల్ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సినీ నటి ప్రేమా తదితరులు, చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే సతీష్‌రెడ్డి, తదితరులు -
సవతి సోదరుల మధ్య ఘర్షణ.
పూర్వం ధర్మం ప్రకారం, అంటే అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి, సంఘం అంగీకారంతో చేసుకునే భార్యను ‘ధర్మపత్ని’ అనేవారట. ధర్మపత్ని అంటే మొదటి భార్య అని అర్థం. భర్త శారీరక, మానసిక అవస్థలపై ఆస్తులపై అధికారాలపై ఈమెకే సగభాగం దక్కుతుంది. ఈమె పిల్లలే వారసులు అవుతారు. అధికారిక హక్కుదారులు అవుతారు. రెండవ భార్యకు ఈ హక్కు ఉండదు. ఆమె సంతానానికీ ఉండదు. దశరథుడి ధర్మపత్ని కౌసల్యకు పుట్టిన రాముడే అయోధ్యకు వారసుడు. కాదని కారడవులకు పంపడం వల్లే రామాయణం జరిగింది. తండ్రి మీద హక్కు కోసం లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నడు పోరాడలేదు. కాని ‘ఘర్షణ’లో కార్తిక్ పోరాడాడు. రెండవ భార్య సంతానం కావడం వల్ల తండ్రి పేరును తన పక్కన పెట్టుకోవడానికి పోరాడాడు. తండ్రిని అతనే నా తండ్రి అని చెప్పుకోవడానికి పోరాడాడు. నీకే కాదు నాకూ హక్కు ఉంది అని మొదటి భార్య కుమారుడితో చెప్పడానికి పోరాడాడు. ఘర్షణ కథ ఇద్దరు సవతి సోదరుల మధ్య నడిచిన కథ. ఇలాంటి కథ భారతీయ సినిమాలలో ఇదే మొదటిది. చాలా ఇబ్బందిగా ఉంటుంది– రెండవ భార్య కుమారుడితో ‘నువ్వు పెద్ద భార్య కుమారుడివా?’ అని అడిగితే. చాలా ఇరకాటంగా ఉంటుంది– మొదటి భార్య కుమారుడితో ‘మీ నాన్నకు ఇంకో భార్య ఉందట కదా’ అని అడిగితే. సంఘం ఒక భార్య–ఒక భర్తనే అంగీకరిస్తుంది. చట్టాన్ని ఒప్పించి రెండో పెళ్లి చేసుకున్నా, రెండో ఇల్లు పెట్టినా వ్యక్తిగతంగా బాగానే ఉండొచ్చు కానీ సంఘప్రకారం అది తప్పు అవుతుంది. మీ నాన్న తప్పు చేశాడు... మీకు దక్కవలసిన ప్రేమను మరొకరి ద్వారా కలిగిన సంతానానికి పంచాడు అనే భావన ఏదో ఈ సినిమాలో విజయకుమార్ కుమారుడిగా వేసిన ప్రభు మనసులో ఉంది. అలాగే మా నాన్న మా అమ్మను పెళ్లి చేసుకుని ఆమెకు సంఘపరమైన మర్యాద ఇవ్వలేకపోయాడు. ఆమె కూడా నా భార్యే అని లోకానికి ధైర్యంగా చెప్పలేకపోయాడు. మమ్మల్ని తన పిల్లలుగా చేయి పట్టుకుని నలుగురి మధ్యలో నడిపించలేకపోయాడు. మాకు ఉంపుడుగత్తె పిల్లలు అనే హోదాను ఇచ్చాడు అనే భావన విజయకుమార్ రెండో భార్య జయచిత్రకు పుట్టిన కార్తిక్ మనసులో ఉంది. ప్రభు, కార్తిక్ ఇద్దరూ మంచి వయసులో ఉన్న కుర్రవాళ్లు. ఆ వయసులో ఉండే ఉత్సాహం, హుషారు వారిలో ఉండవు. ఇద్దరూ అశాంతితో రగలిపోతుంటారు. ప్రభు కార్తిక్‌ను యాక్సెప్ట్ చేయడు. ప్రభును కార్తిక్ తన సోదరుడిగా గౌరవించడు. ఇద్దరి మధ్యా ఘర్షణ. చాలా పెద్ద ఘర్షణ. మనిషి ఇన్స్టింక్స్ చాలా బలంగా ఉంటాయి. నాది అనే భావన సకల జీవరాశుల్లో ఉంటుంది. ప్రభు, కార్తిక్‌ల మధ్య ఘర్షణకు కారణం వారికి తండ్రి మీద ఉన్న గొప్ప ప్రేమకు ప్రచ్ఛన్నరూపం అనిపిస్తుంది. ఆ తండ్రి పెద్ద ప్రభుత్వ అధికారి. చాలా మంచివాడు. ఈ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో ఉన్నా భార్యతో, కుమారుడితో చాలా బాగా ఉంటాడు. అలాంటి తండ్రి మాకు మాత్రమే ఉండాలని పిల్లలు అనుకుంటారు. ప్రభు, కార్తిక్‌లు కూడా అనుకొని ఉండొచ్చు. కాని ప్రతి రోజూ ఆ తండ్రి ఏకకాలంలో రెండు ఇళ్లలోనూ ఉండలేడు కదా. ఇక్కడ కొన్నిరోజులు ఉంటే అక్కడివాళ్లకు కోపం. అక్కడ కొన్నిరోజులు ఉంటే ఇక్కడి వాళ్లకు చిన్నతనం. దీని మధ్య అతడు నలుగుతుంటాడు. ఒకటి మాత్రం వాస్తవం. పెద్ద భార్య ఇంట్లో అతడికి పూర్తి స్వేచ్ఛ లేదు. కిటికీలు మూతబడి గాలాడని భావన. అందుకే అతడు కాసింత ఓదార్పు కోసం, రెండో భార్య ఇంటి నడవలో, తులసి కోటకు కాసింత దూరంలో చేరగిలపడి, ఒక వైపు వాన కురుస్తుంటే మరో వైపు భార్య ఆమ్లెట్ తెచ్చి పెడుతుంటే సకల మర్యాదలు వదిలి హాయిగా కాసింత మందు బిగించే స్వేచ్ఛ కోసం అక్కడికి వస్తుంటాడు. నిజానికి అతడి స్వార్థం అతడు చూసుకున్నాడు కాని ఆ భార్యకు పుట్టిన, ఈ భార్యకు పుట్టిన పిల్లల మధ్య సఖ్యత ఉందా లేదా చూసుకోలేకపోయాడు. ఆ సఖ్యత కోసం అతడు ఆ తర్వాత ధైర్యంగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఒకవేళ ప్రయత్నించే సమయం వచ్చేసరికి ఇరు పక్షాల్లో ఘర్షణ చోటు చేసుకుని ఉంది. ప్రభు పోలీస్ కమిషనర్ అయ్యి కార్తిక్‌ను సిల్లీ కారణాల్లో అరెస్ట్ చేసేవరకు వెళతాడు. కార్తిక్ తన ఫ్రెండ్స్‌తో పెద్ద భార్య ఇంటికి వెళ్లి రాళ్లు విసిరి అద్దాలు పగలగొడతాడు. రోడ్డున పడి కొట్టుకునే ఈ అన్నదమ్ములు ఒకే తండ్రికి పుట్టారు. తల్లులు వేరైనందుకు శతృవులయ్యారు. మేమూ మేమూ ఉన్నప్పుడు మేము పాండవులం. వారు కౌరవులు. కాని బయటి నుంచి శతృవు వస్తే మేము నూటైదు మంది అన్నదమ్ములం అన్నాడు ధర్మరాజు. బయటి శతృవు వచ్చినప్పుడు రక్తం చేసే చాలనం చిత్రంగా ఉంటుంది. తన రక్తాన్ని తాను గుర్తించి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే రక్తబంధం అంటారు. ఈ సినిమాలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న విలన్ మీద ఒన్ మేన్ కమిషన్‌గా విజయకుమార్ బాధ్యతలు తీసుకుంటాడు. ఫలానా తేదీ లోపల కమిషన్ రిపోర్ట్ అప్పగించాలి. ఆ విలన్ దోషి అని కమిషన్ తేల్చితే వెంటనే అతడు జైలుకు వెళతాడు. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి విజయకుమార్‌ను విలన్ బుజ్జగించే ప్రయత్నం చేస్తుంటాడు. కాని విజయకుమార్ స్ట్రిక్ట్ కనుక మాట వినడు. దాంతో విజయకుమార్నే చంపించే పనికి విలన్ దిగుతాడు. ఈ సంగతి అన్నదమ్ములకు తెలుస్తుంది. బయటి నుంచి ఎవరూ రానంత వరకే వారు సవతి సోదరులు. వచ్చాక సొంత అన్నదమ్ములు. తండ్రిని కాపాడటానికి ఇద్దరూ రంగంలో దిగుతారు. విలన్‌ను ఎదుర్కొని తండ్రిని కాపాడుకుంటారు. ఘర్షణలో శాశ్వతత్వం లేదు. శాంతిలోనే ఉంది. విడి చేతులలో బలం లేదు. చేతులు కలిపితేనే బలం. ఆ అన్నదమ్ములు ఇప్పుడు ఒక్కటయ్యారు. తండ్రి ఒకడే. తల్లులు వేరు. కాని అమ్మా అని పిలిస్తే ఏ తల్లి అయినా ఒకటే కదా. ఈ కుటుంబం ఇప్పుడు సమష్టిగా మారడం మనకు ఆనందాన్ని ఇస్తుంది. అనుబంధాలు విరిసేను.. పన్నీరు చిలికేను... వెరీగుడ్ మణి. అగ్నినక్షత్రం ‘నాయకుడు’ వంటి ఎపిక్ తీశాక మణిరత్నం 1988లో నెరేషన్‌ను, ఎమోషన్‌ను మిళితం చేసుకుంటూ తేలిక పద్ధతిలో చెప్పిన కథ ‘అగ్నినక్షత్రం’. తెలుగులో ‘ఘర్షణ’గా డబ్ అయ్యి పెద్ద విజయం సాధించింది. సవతి సోదరుల మధ్య ఘర్షణ ఉంటుంది అనే చిన్న పాయింట్ తప్ప కథంటూ ఏమీ లేని ఈ సినిమా కేవలం సంఘటనల వరుస ద్వారా సమ్మోహితం చేస్తుంది. ప్రభు జీవితంలో కొన్ని సంఘటనలు, ప్రేమ, కార్తిక్ జీవితంలోని కొన్ని సంఘటనలు, ప్రేమ వీటి మధ్యలో అక్కడక్కడా ఘర్షణ చూపిస్తూ మంచి పాటలతో సినిమాను ముగిస్తాడు దర్శకుడు. ఈ సినిమా వచ్చిన కొత్తల్లో ఇందులోని ఇళయరాజా పాటలకు, పి.సి.శ్రీరామ్ ఫొటోగ్రఫీకి ప్రేక్షకులు మోహాశ్చర్యాలకు లోనయ్యారు. పి.సి.శ్రీరామ్ చేసిన మెరుపు లైటింగ్ ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలను వెంటాడింది. ఇందులోని ‘రాజా రాజాధి రాజా’ పాటలో ప్రభుదేవా గ్రూప్డాన్సర్గా కనిపిస్తాడు. ‘ఒక బృందావనం సోయగం’ పాట చిత్రలహరిలో కొన్ని వందలసార్లు ప్లే అయ్యింది. ఈ సినిమా నిరోషాకు తొలి సినిమా. అరుపులు, కేకలు, విగ్గుల విలన్ హయామ్లో చాలా మామూలు పెద్ద మనిషిగా ‘ఏం రాజా’ అని ఆత్మీయంగా పిలిచే విలన్ (మద్రాసులో ఆనంద్ థియేటర్ ఓనర్ జి.ఉమాపతి) కనిపించడం చాలా కొత్త. ఈ విలనీని ‘కర్తవ్యం’లో పుండరీ కాక్షయ్యకు వాడారు. ఈ సినిమాలో భార్య నాగమణి ఊరెళితే ఎగిరి గంతేసి పండగ చేసుకునే జనకరాజ్ క్యారెక్టర్ ఎంత హిట్టయ్యిందంటే ఇప్పటికీ జన సామాన్యంలో భార్య ఊరెళ్లిందని చెప్పడానికి ‘నాగమణి లేదు’ అనడం కద్దు. స్లో మోషన్లో ప్రభు, కార్తీక్ కోపంగా క్లోజప్‌లో ఒకరినొకరు చూసుకునే షాట్స్‌ను ఆ తర్వాత చాలా సినిమాల్లో అనుసరించారు. ఘర్షణ చాలావాటికి ట్రెండ్ క్రియేట్ చేసింది. అది నిజమైన ట్రెండ్ సెట్టర్. – కె నిరోషా, పి.సి. శ్రీరామ్, జనకరాజ్, మణిరత్నం -
’పెళ్లికి ముందు ప్రేమకథ’ యూనిట్ సందడి
అమలాపురం టౌన్ : అమలాపురం తన సొంత ఊరు అని, హీరోగా తాను నటించిన చిత్రం విజయయాత్ర ఇక్కడ జరుగుతుంటే అంతకు మించిన ఆనందం ఏముంటుందని ఇటీవల విడుదలైన ‘పెళ్లికి ముందు ప్రేమ కథ’ చిత్ర హీరో చేతన్ శ్రీను అన్నారు. ఆ చిత్ర యూనిట్లో జిల్లాలో నిర్వహిస్తున్న విజయయాత్ర అమలాపురానికి బుధవారం వచ్చింది. స్థానిక గణపతి థియేటర్లో ఆ యూనిట్ సందడి చేసింది. థియేటర్ వద్ద హీరో చేతన్ శ్రీనుకు, చిత్ర నిర్మాత, దర్శకుడు, ఇతర నటులు, సాంకేతిక సిబ్బందికి అభిమానులు స్వాగతం తెలిపారు. తొలుత హీరోతోపాటు చిత్ర నిర్మాత అవినాష్, దర్శకుడు మధు గోపు, హీరోయిన్ సునయన, సంగీత దర్శకుడు యాజమాన్య, డాన్స్ డైరెక్టర్ కిరణ్ మాస్టర్, ఫొటోగ్రాఫర్ కన్నాలకు అభిమానులు, థియేటర్ యాజమాన్యం పూల మాలలు వేసి స్వాగతం పలికారు. యూనిట్ బృందం కొద్దిసేపు ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించింది. ప్రేక్షకులనుద్ధేశించి హీరో చేతన్ శ్రీను మాట్లాడుతూ తన తర్వాత చిత్రం మాంగల్యం తంతునేనా త్వరలో విడుదల కానుందని... ఆ చిత్రం షూటింగ్ కోనసీమలో జరగటం ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం యూనిట్ సభ్యులు పట్టణంలో స్వర్ణ శిఖరసాయి మందిరంలో సాయిబాబాను దర్శించుకుని పూజలు చేశారు. -
బైక్ ఎక్కాలంటూ యువతికి వేధింపులు
సాక్షి, బెంగళూరు: మహిళల రక్షణ కోసం రాష్ట్ర హోంశాఖ బెంగళూరులో మూడు రోజుల క్రితం ప్రారంభించిన పింక్ హొయ్సళ కార్యాచరణ మొదలుపెట్టింది. బైకు ఎక్కాంలటూ వేధిస్తున్న యువకుడిని అరెస్ట్ చేసి అతని బారి నుంచి ఓ యువతిని రక్షించింది. సదరు ఆకతాయిని కటకటాల వెనక్కు నెట్టింది. నగరంలోని మైసూరురోడ్ టింబర్‌యార్డు ప్రాంతానికి చెందిన దీపక్, ప్రేమ కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల దీపక్ ప్రవర్తనలో తేడా రావడంతో దూరం పెట్టసాగింది. తనను నిర్లక్ష్యం చేస్తుందనే ఆక్రోశంతో దీపక్ ఆ యువతిని వేధించసాగాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ప్రేమ కత్రిగుప్పె వాటర్ ట్యాంకర్ వద్ద ఉండగా అక్కడికి చేరుకున్న దీపక్.. బైక్‌పై ఎక్కి కూర్చోవాలంటూ వేధించడం ప్రారంభించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు పింక్‌హొయ్సళ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది దీపక్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్ లో అప్పగించగా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు పంపారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి వరకు 5,724 మంది సురక్షయాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు పింక్ హొయ్సళ కమాండ్ సెంటర్ అధికారి తెలిపారు. -
భర్త చంపుతానన్నాడని..!
భర్త చంపుతానన్నాడని భార్యే.. భర్తతో పాటు ఇద్దరు పిల్లలను చంపేసింది. భార్య కత్తితో పొడవడంతో భర్త సురేష్(45) ఆమె సవతి కుమారులైన సుచి(15), సుమేష్(11) మృతి చెందారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కేరళ రాష్ట్రానికి చెందిన సురేష్ ఏడాది క్రితం సురేష్ కుటుంబం ప్రొద్దుటూరుకు వచ్చి కోనేటికాల్వ వీధిలో నివాసముంటున్నారు. అక్కడే గుడ్‌బాయ్ అప్పడాల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో సుచి 8వ తరగతి, సుమేష్ 5వ తరగతి చదువుతున్నారు. భార్య ప్రేమ అప్పడాల పిండిని తయారు చేస్తుంటుంది. ఈ క్రమంలో గురువారం ఉదయాన్నే దుకాణంలో పని చేస్తున్న శివ అనే వ్యక్తి ఇంటి వద్దకు వచ్చి పిలవగా..ఇంట్లోనించి సమాధానం రాలేదు. దీంతో అతను కిటికిలో నుంచి లోపలికి చూశాడు. సురేష్ రక్తపు మడుగులో పడి ఉండటం గమనించి.. స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులకొట్టి లోపలికి వెళ్లారు. సురేష్ మృతదేహం మంచంలో పడి ఉండగా, సుచి మృతదేహం పై అంతస్తులోకి వెళ్లే మెట్లపై పడి ఉంది. సుమేష్, సుప్రీమ్, ప్రేమ గాయాలతో పడి ఉన్నారు. దీంతో పోలీసులు గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సుమేష్‌కు కత్తిపోట్లు ఎక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. అయితే కొద్దిసేపటికే అతను చనిపోయాడు. స్వల్ప గాయాలైన ప్రేమ, ఆమె కుమారుడు సుప్రీమ్లు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మద్యం మత్తులో ఉన్న తన భర్త తనను ఉరివేసి చంపేస్తానని చెప్పడం వల్ల భయంతో.. తానే అతడిని చంపేసినట్లు ప్రేమ పోలీసులకు చెప్పింది. ఈక్రమంలోనే అడ్డువచ్చిన సుచి, సుమేష్ లు కూడా కత్తిపోట్లకు గురయ్యారని వివరించింది. వారితోపాటు తన కుమారుడ్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అయితే చివరి నిమిషంలో ఆ పని చేయలేకపోయానని ప్రేమ పేర్కొంది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీరి కుటుంబానికి సన్నిహితుడైన దస్తగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. -
పదిహేడేళ్ల తర్వాత!
‘వాస్సి వాడి తస్సాదియ్యా...’ అంటూ ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నాగార్జున చేసిన సందడిని అంత సులువుగా మర్చిపోలేం. జోరుగా ఉండే తండ్రి పాత్ర, కూల్‌గా ఉండే కొడుకు పాత్రను నాగ్ అద్భుతంగా పోషించారు. అన్ని ఏరియాల వాళ్లనీ ఆకట్టుకున్న చిత్రం ఇది. ఇప్పుడీ రెండు పాత్రల్లో కన్నడ ప్రేక్షకులు ఉపేంద్రను చూడనున్నారు. విలక్షణమైన పాత్రలతో కన్నడిగులనే కాదు.. తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్న ఉపేంద్రకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చాలా నచ్చిందట. అందుకే కన్నడ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తెలుగులో రమ్యకృష్ణ చేసిన పాత్రను కన్నడంలో ప్రేమ చేయనున్నారు. విశేషం ఏంటంటే... 1999లో ఉపేంద్ర, ప్రేమ జంటగా ‘ఉపేంద్ర’ చిత్రంలో నటించారు. ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించింది. పదిహేడేళ్ల తర్వాత ఈ ఇద్దరూ జతకట్టనున్న చిత్రం ఇదే. మరో విశేషం ఏంటంటే... ఈ చిత్రంతోనే ప్రేమ నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. అరుణ్ లోకనాథ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘మత్తె హుట్టి బా, ఇంతి ప్రేమ’ అనే టైటిల్ నిర్ణయించారు. ఆ సంగతలా ఉంచితే నాగ్ మంచి రొమాంటిక్ హీరో. ఉపేంద్ర ఫుల్ మాస్ హీరో. అందుకే తన ఇమేజ్‌కీ, కన్నడ ప్రేక్షకుల అభిరుచికీ తగ్గట్టుగా ‘సోగ్గాడే..’ కథను మలుస్తున్నారట. -
నాగార్జున పాత్రలో నటించనున్న ఉపేంద్ర
బెంగళూరు: కన్నడ సినీ రంగంలో ఒకానొక కాలంలో హిట్‌పెయిర్‌గా నిలిచిన ఉపేంద్ర, ప్రేమ చాలా విరామం తర్వాత కలిసి నటించనున్నారు. తెలుగులో నాగార్జున నటించిన సోగ్గాడె చిన్ని నాయన చిత్రాన్ని కన్నడలో ఉపేంద్ర రీమేక్ చేయనున్నారు. తెలుగులో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన పాత్రలలో ఉపేంద్ర నటించనుండగా నాగార్జనకు జోడీగా రమ్యకృష్ణ నటించిన పాత్రను కన్నడలో ప్రేమ కనిపించనున్నారు. 17 సంవత్సరాల తర్వాత ప్రేమ, ఉపేంద్ర కలిసి నటించనున్నారనే వార్తతో ఉపేంద్ర అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి తగిన మార్పులు,చేర్పులు,కూర్పులు అన్ని హీరో ఉపేంద్ర స్వయంగా చేస్తుండడడం విశేషం -
ప్రేమ @ 22,000కోట్లు!
-
ప్రేమకు సైడ్ ఎఫెక్ట్స్...
-
ప్రేమించడం సులువే కానీ...
ప్రేమ అనేది ఎవర్గ్రీన్. ఈ ప్రపంచంలో ప్రేమలో పడనివాడు, వానలో తడవనివాడు ఎవ్వరూ ఉండరు. అయితే ప్రేమించడం సులువే కానీ, ప్రేమను కాపాడుకోవడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. చందా గోవిందరెడ్డి దర్శకత్వంలో ఆర్.పి.ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌ప్రసాద్, శ్రీరాములు, సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజీవ్, సిమ్మీదాస్ ఇందులో హీరో హీరోయిన్లు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూలు చిత్రీకరిస్తున్నాం. రాజీవ్‌కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: నందన్‌రాజ్, మాటలు: గోవిందరెడ్డి, సుమన్.