’పెళ్లికి ముందు ప్రేమకథ’ యూనిట్ సందడి
’పెళ్లికి ముందు ప్రేమకథ’ యూనిట్ సందడి
Published Wed, Jun 21 2017 11:05 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM
అమలాపురం టౌన్ : అమలాపురం తన సొంత ఊరు అని, హీరోగా తాను నటించిన చిత్రం విజయయాత్ర ఇక్కడ జరుగుతుంటే అంతకు మించిన ఆనందం ఏముంటుందని ఇటీవల విడుదలైన ‘పెళ్లికి ముందు ప్రేమ కథ’ చిత్ర హీరో చేతన్ శ్రీను అన్నారు. ఆ చిత్ర యూనిట్‌లో జిల్లాలో నిర్వహిస్తున్న విజయయాత్ర అమలాపురానికి బుధవారం వచ్చింది. స్థానిక గణపతి థియేటర్‌లో ఆ యూనిట్ సందడి చేసింది. థియేటర్ వద్ద హీరో చేతన్ శ్రీనుకు, చిత్ర నిర్మాత, దర్శకుడు, ఇతర నటులు, సాంకేతిక సిబ్బందికి అభిమానులు స్వాగతం తెలిపారు. తొలుత హీరోతోపాటు చిత్ర నిర్మాత అవినాష్, దర్శకుడు మధు గోపు, హీరోయిన్ సునయన, సంగీత దర్శకుడు యాజమాన్య, డాన్స్ డైరెక్టర్ కిరణ్ మాస్టర్, ఫొటోగ్రాఫర్ కన్నాలకు అభిమానులు, థియేటర్ యాజమాన్యం పూల మాలలు వేసి స్వాగతం పలికారు. యూనిట్ బృందం కొద్దిసేపు ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించింది. ప్రేక్షకులనుద్ధేశించి హీరో చేతన్ శ్రీను మాట్లాడుతూ తన తర్వాత చిత్రం మాంగల్యం తంతునేనా త్వరలో విడుదల కానుందని... ఆ చిత్రం షూటింగ్ కోనసీమలో జరగటం ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం యూనిట్ సభ్యులు పట్టణంలో స్వర్ణ శిఖరసాయి మందిరంలో సాయిబాబాను దర్శించుకుని పూజలు చేశారు.
Advertisement
Advertisement