హీరోయిన్‌ ప్రేమతో ఉన్న వ్యక్తి ఎవరు..? ఆమె చుట్టూ రూమర్స్‌ | Actress Prema Photo In Temple Again Viral | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ ప్రేమతో ఉన్న వ్యక్తి ఎవరు..? ఆమె చుట్టూ రూమర్స్‌

Published Thu, Apr 18 2024 3:33 PM | Last Updated on Thu, Apr 18 2024 3:46 PM

Actress Prema Photo In Temple Again Viral - Sakshi

సౌత్‌ ఇండియాలో స్టార్‌ హీరోయిన్‌గా ఒకప్పుడు గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది.  1995లో సవ్యసాచి అనే కన్నడ చిత్రంతో తన జర్నీ మొదలైంది. తొలి సినిమా పరాజయం పాలైనా ఓం అనే రెండో సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టింది. కన్నడలో స్టార్‌ హీరోలందరితో జోడీ కట్టి టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులోనూ ధర్మచక్రం, దేవి, ఓంకారం, మా ఆవిడ కలెక్టర్‌, పోలీస్‌ పవర్‌ సహా పలు చిత్రాలు చేసింది. ప్రేమ 2006లో వ్యాపారవేత్త జీవన్‌ అప్పచును పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు.

దేవి సినిమాతో టాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసిన ప్రేమ తెలుగులో తక్కవ సినిమాలే చేసినా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ప్రేమ.. తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత 2017లో ఉపేంద్ర 'మత్తే బా' చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కన్నడలో పలు సీరియల్స్‌లో కూడా నటిస్తుంది.  ప్రేమ రెండో వివాహ చేసుకోబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాటిలో నిజం లేదని తేల్చేసింది.

తాజాగా ప్రేమతో పాటు తరుచూ ఒక వ్యక్తి కనిపిస్తున్నారని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కన్నడలో సినీబజ్ వెబ్‌సైట్ ప్రేమ గురించి ఒక వార్తను ఫోటోతో పాటు ప్రచురించింది. ఈ ప్రచురించిన నివేదిక ప్రకారం, ప్రేమతో పాటు కన్నడ టెలివిజన్ పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్‌గా పేరుగాంచిన అరవింద్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి కారణాలు ఏంటో అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ అరవింద్ కూడా ఉంటున్నారని తెలిపింది. రీసెంట్‌గా ప్రేమ కర్ణాటకలోని కొరగజ్ఞ సన్నిధికి వెళ్లినప్పుడు అరవింద్‌తో ప్రేమ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుందా అని టాక్ కూడా వినిపించింది.


తల్లిదండ్రులతో ప్రేమ

అయితే ఇప్పుడు ఆ టాక్‌.. టాక్‌గానే మిగిలిపోయిందని, వారిద్దరి మధ్య అలాంటి సంబంధం లేదని, వారు మంచి స్నేహితులు మాత్రమేనని కొన్ని కన్నడ వెబ్‌సైట్స్‌ చెబుతున్న మాట. వాస్తవానికి ప్రేమ రెండో పెళ్లి గురించి పలుమార్లు రూమర్స్‌ వచ్చాయి. వాటిని ఆమె తిప్పి కొట్టింది కూడా.. ఇప్పుడు కూడా ఫోటో అయితే వైరల్‌ అవుతుంది కానీ అది ఎప్పటిది..? వారిద్దరి మంధ్య ఉన్న రిలేషన్‌ ఏంటి అనేది పూర్తి వివరాలు లేవు.  నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వార్తలపై ప్రేమ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.

పెళ్లి గురించి ప్రేమ గతంలో చెప్పిన మాట
రెండో పెళ్లి అంటూ రూమర్స్‌ వచ్చాయి. జీవితంలో పెళ్లి ఉండాలి. నాకు తగిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను. నా జీవితం ఎలా ఉండాలనేది నాకు తెలుసు. నా మీద ఇంకో రూమర్‌ కూడా సృష్టించారు. నాకు క్యాన్సర్‌ వచ్చిందని ప్రచారం చేశారు. అలాంటిదేమీ లేదు. డిప్రెషన్‌ వల్ల కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఆ సమయంలో నాకు క్యాన్సర్‌ ఉందని పుకార్లు వ్యాప్తి చేశారు' అని చెప్పుకొచ్చింది ప్రేమ. ఇక తనకు 70 ఏళ్లు వచ్చాక కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అప్పుడు చేసుకుంటే తప్పు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. మనకు దొరికేది ఒకటే జీవితం అని ఆ జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆమె పేర్కొన్నారు. జీవితంలో తనకు నచ్చినట్లే ఉండమని తన అమ్మగారు కూడా చెప్పారని  ఆమె తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement