పుణె: అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో మహారాష్ట్ర పుణె జిల్లాలోని ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లోని 17 మంది కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భంద్‌గావ్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఓ యూనిట్‌లో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఈ యూనిట్‌ను నిత్యం 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతను ఉంచడానికి అమ్మోనియా గ్యాస్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అది ప్రమాదవశాత్తూ లీకైంది.
ప్రమాద సమయంలో యూనిట్‌లో 25 మంది పనిచేస్తున్నారని.. వీరిలో చాలా మంది మహిళలేనని పోలీస్ ఇన్‌స్పెక్టర్ నారాయణ్ దేశ్‌ముఖ్ తెలిపారు. లీకైన తర్వాత అమ్మోనియా రెగ్యులేటర్‌ను వెంటనే ఆఫ్ చేసినట్లు వివరించారు. బాధిత కార్మికులను వేగంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించామని.. అక్కడ వారు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అయితే గ్యాస్ లీక్ పాయింట్‌కు దగ్గరగా ఉన్న ఓ మహిళకు మాత్రం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని.. ఆమె ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు ధ్రువీకరించారని దేశ్‌ముఖ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment